చివరి వరకూ విజయం దోబూచులాడింది. కాదు.. కాదు.. రెండు జట్లూ చివరి నిమిషం వరకూ విజయం కోసం పోరాడారు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన పోరులో దబాంగ్ దిల్లీ తమిళ్ తలైవాస్ పై విజయం సాధించింది. ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో దబాంగ్ దిల్లీ జట్టు గురువారం తమిళ్ తలైవాస్ తో తలపడింది. ఈ పోరులో ఆఖరు ఆరునిమిషాల్లో ఆట స్వరూపమే మారిపోయింది. అప్పటి వరకూ పూర్తి ఆధిపత్యంతో దూసుకుపోతున్న తమిళ్ తలైవాస్ జట్టుకు ప్రధాన రైదర్ రాహుల్ ఔట్ అవ్వడంతో కథ మారిపోయింది. అక్కడ నుంచి దబంగ్ జట్టు వేగంగా పుంజుకుంది. తాలైవాస్ ను ఒత్తిడికి గురిచేసి విజయాన్ని సాధించింది.
రాహుల్ ఔటౌవ్వడంతో కథ మారింది. ఆఖరి రెండు నిమిషాల్లో దిల్లీ ఆటతీరే మారిపోయింది. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టి విజయం అందుకుంది.
రాహుల్ చౌదరి (7 పాయింట్లు) మొదట్లో దూకుడుగా ఆడటంతో తొలి అర్ధభాగం ముగిసే సరికి తమిళ్ తలైవాస్ 18-11తో నిలిచింది. అజయ్ ఠాకూర్ (5), మంజీత్ చిల్లర్ (5) అతడికి తోడుగా రాణించడంతో రెండో అర్ధభాగం చివరి వరకు విజయంపై ధీమాగా ఉంది. మరో ఐదు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా 21-28తో వెనకబడ్డ దిల్లీ అనూహ్యంగా పుంజుకుంది. ఆ జట్టు రైడర్ నవీన్ కుమార్ సూపర్‌రైడ్‌తో అజీత్, వినీత్, రణ్‌సింగ్‌ను ఔట్ చేసి 24-28తో ఆటను మలుపు తిప్పాడు. అదే సమయంలో డూఆర్‌డై రైడ్‌కు వెళ్లిన అజయ్ ఠాకూర్‌ను విశాల్ మానె అద్భుతంగా ట్యాకిల్ చేయడంతో తలైవాస్ ఆలౌటైంది. ఆ తర్వాత నవీన్ కూతకు వెళ్లి అజీత్‌ను ఔట్ చేయడంతో స్కోరు 28-29గా మారింది. మరోసారి కూతకువెళ్లిన అజయ్‌ను నవీన్ కుమార్ పట్టేశాడు. దాంతో స్కోరు 29-29గా మారింది. చివరి నిమిషంలో డూఆర్‌డై రైడ్‌కు వెళ్లిన నవీన్.. మంజీత్‌ను ఔట్ చేసి దిల్లీకి విజయం అందించాడు. మొత్తం 7 పాయింట్లు తెచ్చాడు.