అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకు : అమరావతి రైతులు

Update: 2019-12-21 06:43 GMT

రాజధాని ప్రాంత రైతులు ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్నారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజులో వైసీపీ నాయకులు నిమగ్నమై ఉండగా, రైతులు ఆయనకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారు. జిఎన్ రావు కమిటీ సమర్పించిన నివేదిక అమరావతిలో ఉద్రిక్తతను తీవ్రతరం చేసింది. రాజధాని కోసం భూములను త్యాగం చేసిన రైతులు నిన్న కమిటీ నివేదికపై పూర్తిగా నిరాశ చెందారు. కమిటీ సూచనలు అనైతికమైనవి అని అమరావతిలో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు చెప్పారు.

తమకు ఒకే రాజధాని మాత్రమే కావాలని, ఆ భూములు తీసుకునేటప్పుడు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీ ప్రకారం అమరావతిలో మాత్రమే రాజధాని ఉండాలని రైతులు డిమాండ్ చేశారు. అమరావతిలో ప్రభుత్వం ఇక్కడ రాజధానిని ప్రకటించినప్పుడు, ప్రతిపక్ష వైసీపీ కూడా అంగీకరించిందని.. జగన్ కూడా దీనిపై ఎటువంటి అభ్యంతరాలు లేవని చెప్పారని.. కానీ ఇప్పుడు, రాజకీయ మైలేజ్ కోసం అన్ని ప్రాంతాలను రెచ్చగొడుతున్నాడని ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News