Ayodhya Ram Mandir Bhoomi Pujan 2020: శరవేగంగా రామమందిరం భూమి పూజ ఏర్పాట్లు
Ayodhya Ram Mandir Bhoomi Pujan 2020: రేపు ఉదయం 10.35 నిమిషాలకు లక్నో విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధాని మోడి. అక్కడి నుండి ఎయిర్ ఫోర్స్ విమానంలో అయోధ్యకు పయనం అవుతారు. అక్కడ నుంచి 11.44 నిమిషాలకు సాకేత్ యూనివర్సిటీ లో ప్రధాని హెలీకాప్టర్ ల్యాండింగ్ అవుతుంది.
Ayodhya Ram Mandir Bhoomi Pujan 2020: అయోధ్యలో రేపటి (ఆగస్టు 05) న భూమిపూజ కార్యక్రమానికి విస్త్రతమైన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యూపీ ప్రభుత్వం నిఘావర్గాల హెచ్చరికల నేపధ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేస్తుంది. ఈ భూమిపూజ జరిగే వేదికపై ప్రధానితో పాటుగా మరో నలుగురికి మాత్రమే చోటుని కల్పిస్తున్నారు.
అందులో ప్రధానితో పాటుగా ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్, ఆలయ ట్రస్ట్ ఛైర్మన్ నిరిత్య గోపాల్ దాస్ మహారాజ్, యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ లకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. ఇక మొత్తం ఈ కార్యక్రమానికి గాను 175 మంది అతిధులకు ఆహ్వానాన్ని అందించారు. ఇక యూపీ నుంచి సీఎం యోగి అధిత్యనాథ్ , డిప్యూటీ సీఎంలకి మాత్రమే ఆహావానాన్ని అందించింది. ఇక మినహా ఇతర మంత్రులకు ఆహ్వానం లేదు.