హాయ్ ఫ్రెండ్స్... నేడు మనం చర్చించే అంశం... "మీ మూడే, మీ తోడు".
ఫ్రండ్స్! మీరు ఎప్పుడైనా ఒక పని చేసి, ఆ తర్వాత..అ..రె..రే... అలా ఎందుకు చేశాను అని నాలిక కోరుక్కునారా?ఎవరిపైనా అయిన మీకు బాగా కోపం వచ్చి, వారిని ఒక మాట అని, ఆ తర్వాత ..అరె..రే !..అలా అని ఉండాల్సింది కాదు..అని ఫీల్ అయ్యారా?
లేదా
ఎప్పుడైనా.... ఒక పని చేసి..తర్వాత, అరె "ఇంత బాగా చేసింది నేనేనా?" అసలు ఇంత గొప్పగా నేను ఎలా చేశాను! అని ఆశ్చర్యపోయారా?
ఫ్రండ్స్ ! మనం కొన్నిసార్లు, అలా ఎందుకు చేస్తామో, ఆ తర్వాత మరోలా ఎందుకు ఫీల్ అవుతామో... మీకు తెలుసా!
అలా మనం చెయ్యడానికి మన ప్రతిభనో లేదా అసమర్ధతనో ముఖ్య కారణం కాదట, అలా చెయ్యడానికి అసలు కారణం.. ఆ సమయంలో మనం వున్నా "మనో స్థితి", లేదా "మానసిక స్థితి" ముఖ్య కారణమాట!
దీనినే మనం సాధారణంగా "మూడ్ "అని కూడా అంటాము. అప్పటి "మూడ్" మారి, మరో మూడ్ రాగానే "అరె అలా ఎందుకు చేసాము" అని భాధ లేదా గిల్ట్ ఫీల్ అవుతామట. ఇక ముందు..ముందు.. మనం అలా చెయ్యకుండా...ఆ తర్వాత ఫీల్ కాకుండా వుండాలి అంటే, ఏమి చెయ్యల్లో ఇప్పుడు చూద్దాము.
చాలామంది వారి మూడ్ కి కారణం ఇతరులు లేదా వారి పరిస్థితులు అనుకుంటారు. అయితే మనం ప్రతి సారి మన చుట్టూ వున్నాఇతరులను, పరిస్థితులను మనకి కావాల్సిన విధంగా మార్చుకోలేము, కాని మన మూడ్ వారి వల్ల ఎఫెక్ట్ కాకుండా మాత్రం కాపాడుకోవచ్చ్చు. కంప్యూటర్లోకో వైరస్ రాకుండా యాంటివైరస్ ఎలా వాడుతామో అలా, మన మంచి మూడ్ ని కాపాడుకునే టెక్నిక్స్ తప్పక మనం నేర్చుకోవాలి.
ఎందుకంటే మూడ్ బాగున్నోడు, ఎక్కడ వుంటే అక్కడ "స్వర్గం"వున్నట్టు, కాని "మూడ్ బగాలేనోడు" స్వర్గంలో వున్నా కూడా నరకంలో ఉన్నట్టే కదా!
ఫ్రండ్స్..ఒక వేళా మీకు, ప్రతీ రోజు...మీరు కోరుకొనే "మూడ్" ని, మీరు కోరుకున్నప్పుడల్లా, మీరు వున్నా ప్రదేశంలో, మీ మనసులో తెచ్చుకోగలిగితే, మీరు ఎలాంటి విజయాలు సాదించగలరో ఒక్క సారి ఆలోచించండి.
జీవితంలో ఎదగాలి, నలుగురికి దారి చూపాలి అని అనుకునే వ్యక్తికి, అతి ముఖ్యమైన మొదటి మెట్టు, అన్ని సమయాల్లో తన మూడ్ ని, లేదా మనో స్థితిని, ప్రశాంత స్థితికి లీడ్ చేయ్యగలగాలి.
ఎందుకంటే అనవసరమైన కోపం, చికాకు, విసుగు, అనుమానం లాంటి మూడ్స్ మనకి నష్టాన్నే తెస్తుంది, అలాగే మనకి కావాల్సిన ఆత్మవిశ్వాసం, క్షమాభావం, అంగీకారభావం, ఉత్సాహం లాంటివి మనకు ఎంతగానో ఉపయోగపడతాయి.
మనకి ఎన్ని నైపుణ్యాలు వున్నా, ఎన్ని శక్తులు వున్నా, ఎంత ప్రతిభ వున్నా, అవసరమైన సమయంలో మన మూడ్ సరిగ్గా లేకుంటే మాత్రం... మహాబారత యుద్ధ సమయంలో కర్ణుడికి అన్ని అస్త్రాలు, విద్యలు వచ్చిన కూడా, ఆ సమయంలో వాటిని వాడలేక, ఓడిన విధంగా, మనం కూడా సరైన మనో స్థితి లేకుంటే పోటి అనే ఈ ప్రపంచ ఆటలో ఓడిపోవచ్చు.
అలాగే మన మానసిక స్థితి ఎంత ప్రశాంతంగా ఉంటే అంత లాజికల్గా ఆలోచించగలం, అదే మన మానసిక స్థితి బాగాలేకుంటే ఎక్కువగా రియాక్ట్ అవుతాము.
మన మూడ్, మన సామర్థ్యాన్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది, ఎలా అంటే... ఒక నాట్య కళలో ప్రతిభ వున్నా అమ్మాయి, తను ఒంటరిగా ఒంటరిగా వున్నప్పుడు, ప్రాక్టీసు చేసేప్పుడు చాల అద్బుతంగా నాట్యం చేయవచ్చు, కానీ అదే అమ్మాయి నలుగురు ముందు ఆ కళని ప్రదర్శించాలని అనుకుంటే మాత్రం, తను పర్ఫార్మెన్స్ అంగ్జిటి అనే మూడ్ వల్ల దాదాపు 20 నుంచి 30 శాతం తన నాట్య కళని ప్రదర్శించలేక డీలా అవ్వోచ్చట.
అందుకే మన మూడ్, మనని మ్యాడ్ గా ప్రవర్తించేలా చేయవచ్చు, గాడ్ లా ప్రవర్తించేలా చేయవచ్చు.
కయ్యానికి కాలు దువ్వేలా చేసేది...కరుణరసం తో ఆదరణ పంచేలా చేసేది..మన మూడ్ మాత్రమే. కాబట్టి ఎప్పుడు మంచి మూడ్ లో మనని మనం వుంచుకోగలగాలి.
అందుకే...ఎన్ ఎల్ పి ( న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్) లో అంటారు "ఉపయోగము లేని మనుషులు ఉండరు, ఉపయోగం లేని మానసిక స్థితులు (మూడ్) మాత్రమే ఉంటాయి అని. అందుకే తన మనస్సులో నేర్చుకోవాలనే ఉత్సాహం, ఆసక్తి, కుతూహలము,ఆత్రుతతో వుంటే ఎలాంటి విద్యార్ధి అయిన నేర్చుకోగలడు. కాని ఆ సమయంలో తన మనస్సులో ఆ విషయం పై అనాసక్తి, గాబరా, విసుగు వున్నాయనుకోండి, ఆ విద్యార్ధి క్లాసు రూమ్లో వున్నా కూడా ఎక్కవగా ఏమి నేర్చుకోలేరు.
అందుకే మీరు ఏది నేర్చుకోవాలనుకున్న, మీరు ఎ పని చేయాలనుకున్నా, అలాగే మీరు ఎ ఫలితాన్ని కోరుకున్న కూడా, మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోవాల్సినది ఏంటంటే....
ఈ పని సులభంగా చేయాలి అంటే నేను "ఎ మూడ్ లో ఉండాలి" అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే మంచి మూడ్ లో వున్నా వ్యక్తే, ఎలాంటి సమస్యకైనా లాజికల్ గా, క్రియేటివ్ గా కూడా పరిష్కారాన్ని కనిపెట్టగలడు.
మన మనో స్థితిని ఎక్కువగా ప్రభావితం చేసేవి రెండు అంశాలని NLP అనే సబ్జెక్టు చెపుతుంది, NLP అంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అంటారు.. దీని ప్రకారం మన మానసిక స్థితి ప్రభావితం చేసేదాంట్లో మొదటిది మన శరీరపద్ధతి, అంటే మనము ఎలా నిల్చున్నాము, ఎలా కూర్చున్నాము, మన బుజాలు ఎలా వున్నాయి, మన తల ఎలా వుంది, ఇలా మన బాడీ లాంగ్వేజ్ కి, మన మూడ్ కి సంబంధం ఉందట. మన కూర్చునే, నిల్చునే విధానంలో మార్పు చెయ్యడం వల్ల కూడా కొంత మూడ్ మారుతుంది.
అలాగే ముఖ్యమైన రెండోది....మనకి పంచేంద్రియాల ద్వార వస్తున్నా సమాచారాన్ని, మన మనస్సు ఎలా మలచుకొంటుంది అనే విషయం. దీన్నే NLP లో ఇంటర్నల్ రేప్రేజంటేశన్ అంటారు. వీటి ద్వార మన మూడ్ ని ఎలా మార్చుకోవచ్చు ఇప్పుడు చూద్దాం.
ఎన్ ఎల్ పి యొక్క ఒక ముఖ్య ఉపయోగం ఏమిటంటే, మన స్టేట్ ఆఫ్ మైండ్ ని, మనం ఎంచుకునే అవకాశం ఇస్తుంది, అలాగే ఇతరులను కూడా మనం, ఒక మంచి స్టేట్ అఫ్ మైండ్ కి తీసుకుపోయే అవకాశం కూడా ఇస్తుంది.
ఇప్పుడు మనకి వున్నా మూడ్ బదులు మంచి మూడ్ కోసం కొన్ని టెక్నిక్స్ చూద్దాం.
మాములుగా కొద్దిమందికి మ్యూజిక్ వినటం ద్వార మూడ్ మారితే, కొద్దిమందికి ఫుడ్ తినటం ద్వార మారుతుంది. కొద్ది మందికి మంచి మాటలు వింటే మూడ్ మారితే, మరి కొద్దిమంది మందు బాటిల్ తో మారుతుంది. కొద్దిమందికి నడిస్తే మూడ్ మారుతుంది, మరి కొద్దిమందికి అరుస్తే మారుతుంది.
అయితే NLP ప్రకారం మూడ్ మారటానికి సులభమైన, ఖర్చు లేని, సైడ్ ఎఫెక్ట్స్ లేని టెక్నిక్ ఏంటంటే...మీరు మూడు నిమషాలు ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చొని, కళ్ళు మూసుకొని, మీ జీవితంలో జరిగిన, కొన్ని అందమైన, ఆనందాన్ని ఇచ్చిన, సంతోకరమైన, పాత జ్ఞాపకాలు గుర్తుకుచేసుకోవటం. ఆ సంతోషకరమైన సంఘటనని, ఇప్పడు మీ మనస్సులో ఒక సినిమా చూసినట్టు, ఆ సంఘటనలు ఇప్పుడు జరుగుతున్నట్ట్టు, అప్పడు చూసింది, ఇప్పుడు చూడండి. అప్పుడు విన్నవి, ఆ మాటలు, శబ్దాలు మరొక్కసారి వినండి. అప్పడు ఎలా ఫీల్ అయ్యారో గుర్తుకు చేసుకొని, ఇప్పుడు ఆ ఫీలింగ్ ని ఒక నిమిషం పాటు ఎంజాయ్ చెయ్యండి. ఆ తర్వాత కళ్ళు తెరవండి. ఇలా ఆ ఆనందమైన సంఘటనని మీరు పునర్జీవించడం వల్ల మీ ప్రస్తుత మూడ్ ఆనందంగా మారుతుంది.
అలాగే ఇంకా తక్కువ సమయంలోనే, అంటే క్షణాల్లో మూడ్ మారాలి అంటే...రెండు క్షణాలు కళ్ళు మూసుకొని, మీరు బాగా ఇష్టపడే, ప్రేమించే వ్యక్తిని మీ మనస్సులో గుర్తుకు చేసుకొని, వారి చిరునవ్వుని స్పష్టంగా చూడండి. అంతే క్షణంలో మీ మొహంలోకి చిరునవ్వు దూసుకు వస్తుంది.
ఫ్రెండ్స్! చివరిగా ఈ రోజు మీరు తీసుకునే అతి ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే...మీరు మంచి మూడ్లో ఉండాలి అని. సో అల్ ది బెస్ట్.