కథలు చెప్పండి, విజయం సాదించండి ఇలా!

Update: 2019-04-16 06:59 GMT

అనగనగా ఒక రాజు....అనే మాట వినగానే మనకి గుర్తుకు వచ్చేది...కథ.

కథ అంటే, మన వినోద, విజ్ఞానం కోసం, ఒక ఊహాత్మకమైన సంఘటనలు, పాత్రల వర్ణన ద్వార చెప్పేది. ఇలాంటి కథల ద్వారానే మన తరతరాల సంస్కృతులు ఇప్పటివరకు నిలబడ్డాయి. అలాగే మన ముందు తరాలకు, ధర్మాన్ని, విలువలను అందించటానికి రామాయణ, మహాభారత కథలు మనకి ఎంతో సహయము చేస్తున్నాయి. ఈ కథల ద్వారానే మన సంస్కృతి మరియు మూలల గురించి మనం తెలుసుకోగలిగాము.

అలాగే మన కుటుంబంలో ఉన్న వివిధ పద్దతులు మరియు సాంప్రదాయాలను గురించి, మన కుటుంభ పెద్దలు చెప్పే, ఎన్నో కథలు కొత్త విషయాలను మనకి అందిస్తాయి. అలాగే ఒక దేశ చరిత్ర గురించి, లేదా రాజుల చరిత్ర గురించి విన్న కథలు చాల ఉపయోగపడ్డాయి. ఈ రోజుల్లో కార్పరేట్ కంపనీలు కూడా వారి వస్తువుల గురించి, సేవల గురించి కథల రూపంలో చెపుతున్నారు. అలా చెప్పడం వల్ల, ఆ కథ ద్వార వారి బ్రాండ్ గుర్తుండి పోతుంది కాబట్టి.

కథలని పిల్లలు, పెద్దలు ఆసక్తిగా వినడానికి ముఖ్యం కారణం...కథలు మన ఎమోషన్స్ ని టచ్ చేస్తాయి. ఆ కథలోని ముఖ్య పాత్ర యొక్క ప్రయాణంతో, మనం కనెక్ట్ అయ్యి ఫీల్ అవుతాము. అందుకే ఆ కథలోని కష్టాలని, సుఖాల స్ఫూర్తి పొందుతాము. అనుభూతి చెందుతాము. కథ మనని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకుపోగలదు. ఈ కథలు మన మానసిక వికాసానికి ఎంతగానో తోడ్పడుతాయి.

ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ఎవరైతే తమ జ్ఞాపకశక్తిని పెంచుకోగలరో, అలాగే తమ క్రియేటివిటీ తో కొత్త సమస్యలకు, కొత్త పరిష్కారాలు చూపగలరో, వారు విజేతలుగా నిలుస్తున్నారు. అయితే మన జ్ఞాపకశక్తి మెరుగుపడటానికి, మన ఉహ శక్తి పెరగటానికి ఈ కథలు చాల ఉపయోగపడతాయి. కథలు మన జ్ఞాపకశక్తిని ఎలా మెరుగుపరుస్తాయని, మీకు అనుమానం రావచ్చు. ఉదాహరణకి మీరు ఒక

పది వస్తువులను గుర్తుకి పెట్టుకోవాలి అనుకోండి...ఆ వస్తువులు 1. తుపాకి 2. మామిడితోట 3. బులెట్ బండి 4. పోలీస్ 5. ఫోన్ 6. డ్రగ్స్ 7. కత్తి 8. స్టేషన్ 9. సిగరెట్ 10 గేటు. ఈ పది వస్తువులని జ్ఞాపకం పెట్టుకోడానికి మీరు ఒకటి, రెండు సార్లు చదివి ఒక ఆర్డర్లో గుర్తుకి పెట్టుకోడానికి ట్రై చెయ్యవచ్చు. కాని చాలామందికి ఈ పది వస్తువులు గుర్తుకి పెట్టుకోడం కూడా కష్టం అవుతుంది. మీరు ఒక వేళా అదే వస్తువులను ఒక కథల తాయారు చేసుకొని ఎవరికైనా చెప్పారు..లేదా మీరు విన్నరనుకోండి..ఈ పది వస్తువూలు చాల సులభంగా గుర్తుకి పెట్టుకోగలరు. మనం ముందుగా ఈ పది వస్తువులను ఒక కథలో వాడాలి, అలా వాడటం వలన సులభంగా గుర్తుకి పెట్టుకోవచ్చు.

అదెలాగో ఇప్పుడు చూద్దాము. మీకు ఇష్టమైన హీరో కొద్ది సేపు...పవన్ కళ్యాణ్ అనుకోని ఈ కథని తాయారు చేసుకుందాం... మీ కథలో హీరో అయిన పవన్ కళ్యాణ్ ఒక పోలీస్ ఆఫీసీర్. అతను తన పోలీస్ స్టేషన్ లో వుండగా, అతని ఫోన్కి ఎవరో కాల్ చేసి దగ్గరలోని మామిడి తోటలో డ్రగ్స్ వున్నాయని చెప్పారు, వెంబడే తన తుపాకి తీసుకొని, బులెట్ బండి పై, మామిడి తోటకి బయలుదేరాడు. పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకోగానే ఆ తోట గేటు వద్దే, విలన్ జగపతి బాబు సిగరెట్ కాలుస్తూ, తన మరో చేతిలోని కత్తితో, పవన్ కళ్యాణ్ పై దాడికి దిగాడు. ఇంతవరకు కథలోనే..మనం ఆ పది వస్తువులను వాడాము. ఆ పది వస్తువులను మీరు ఇలా ఒక కథలా మార్చుకోవడం వలన, ఈ కథని క్రమ బద్దంగా గుర్తుకు చేసుకుంటే చాలు, మీకు ఆ పది వస్తువులు గుర్తుకు వస్తాయి. ఇలా ఎ విషయానైన ఒక కథలా మలచుకొని మనం గుర్తుకి పెట్టుకోవచ్చు. అందుకే కథలు మన జ్ఞాపక శక్తిని పెంచుతాయి అంటాము.

కథలు కాలక్షేపానికే, ఉల్లాసానికే కాదు. మనలో వినే శక్తిని పెంచుతుంది. ఈ రోజుల్లో మనలో చాలామందికి ఒక విషయం మీద ఎక్కువ సేపు ద్రుష్టి, శ్రద్ధ పెట్టడం కష్టం అవుతుంది. అయితే ఒక మంచి కథ వింటూ, మనకి తెలియకుండానే ఒక దానిపై మన ద్రుష్టి కేంద్రికరించగలం. కాబట్టి కథలు మన ఏకాగ్రతని కూడా పెంచుతాయి. అలాగే ఒక కథ ద్వార మీరు ఒకే విషయం గురించి ఎన్నో కోణాలలో చర్చించ వచ్చు. అందుకే మనం కథలు చదవాలి, అలాగే చూడాలి, వినాలి మరియు వాటి సారాంశం పట్టాలి. అలాగే ఒక కొత్త ఐడియా ను ప్రపంచం ముందు పెట్టడానికి కథను మించిన గొప్ప పరికరం ఇప్పటికి ఏది లేదు. కాబట్టి మీ ఐడియాస్ ని కథల రూపంలో పెట్టడం అలవాటు చేసుకోండి.

కథల ద్వార ప్రజలు తమ అభిమాన పాత్రల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటారు మరియు తరచుగా వాటిని అనుకరించటానికి కూడా ప్రయత్నిస్తారు. అది ఒక హరీపోట్టర్ కథ అయివుండవచ్చు, సూపర్మాన్ కథ అయివుండవచ్చు, లేదా హనుమాన్ కథ అయివుండవచ్చు. అయితే మీరు అర్ధవంతమైన సందేశముతో, సారాంశంతో నిండిన కథలను ఇతరులకు చెప్పటం ద్వారా, వారికీ జ్ఞానం, ధైర్యం, నిజాయితీ మొదలైన లక్షణాలను నేర్చుకునే అవకాశం ఇస్తున్నారు. అందుకే మీరు మన భారత దేశ బిడ్డలయిన వీర శివాజీ, మరియు మహాత్మా గాంధీ చరిత్ర చూస్తే, చిన్నప్పుడు వారు చదివిన, విన్న కథలు వారినేంతో ప్రభావితం చేసాయి అని తెలుస్తుంది. కథల ద్వార వారి వ్యక్తిత్వం మెరుగుపడింది.

మన ప్రతి ఒక్కరిలో సహజంగానే రాజమౌళి లాంటి ఒక కథకుడు ఉంటాడట, అతనిని తట్టి లేపండి..కథలు చెప్పటం మొదలెట్టండి. ఇప్పటి నుండి మీ జ్ఞాపక శక్తిని, ఉహ శక్తిని పెంచుకోడానికి, మీరు మీ మిత్రులకు, ఇతరులకి చెప్పాలనుకున్న విషయాన్నీ ఒక కథలా తాయారు చేసి చెప్పడం అలవాటు చేసుకోండి. దీని వలన మీ కమ్యునికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, అలాగే మీలో ఉహ శక్తి, మరియు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ప్రతి కథ చివరిలో కథ కంచికి, మనం ఇంటికి అంటుంటారు... కథ కంచికి వెళ్ళిన కూడా...మనకి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చి వెళుతుంది, కాబట్టి ఒక్కసారి కథ చెప్పి చూడండి, అంతా మీకే అర్ధం అవుతుంది. అల్ ది బెస్ట్.  

Similar News