ఫ్రండ్స్ ! ఈ రోజు మనం చర్చించే అంశం..... మోటివేషను మొదటి మెట్టు మాత్రమే!
ఫ్రండ్స్! మనం కొన్ని మోటివేషన్ వీడియోస్ చూసినప్పుడు, బుక్స్ చదివినప్పుడు, లేదా క్లాసులు అటెండ్ అయినప్పుడు, చాల ఉత్సాహం ఫీల్ అవుతం, లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి.. సాధించగలం అనిపిస్తుంది.. కాని అంతలోనే....పాలు వేడి చేసినప్పుడు వచ్చే పొంగులా...ఆ ఉత్సాహం తో వచ్చే పొంగు ఎంతోసేపు నిలవదు..ఆ మోటివేషన్ ఫీలింగ్ ఒక్క రోజో, కొన్ని గంటలో..కొన్ని నిమిషాలో మాత్రమే వుంటుంది, ఆ తర్వాత...తిరిగి మన ఆలోచనలు, మూడ్ మొదటికే వస్తుంది.
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు జీవితంలో పెద్ద మార్పులు ఏమి కనపడవు..అసలు ఇలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా? మొదట్లో నాకు ఈ సమస్య వుండేది.. ఒక క్లాసు వినగానే..ఒక మంచి పుస్తకం చదవగానే..ఇక జీవితం మారిపోతుంది అని అనిపించేది...కానీ కోద్దిరోజులకే అంత పాత పద్దతిలోనే జరిగేది...ఆ పుస్తకం లేదా ఆ క్లాసు ఒక తాత్కాలిక కిక్కుల, టైం పాస్లా అవుతుందేమో అనిపించేది. అయితే ఒక రోజు.... బాగా ఆలోచిస్తే అర్ధం అయ్యింది.. వీటి వల్ల జీవితం మారాలంటే ఏమి చెయ్యాలో..
అదేంటో ఇప్పుడు చూద్దాం.....అసలు ఈ మొటివేషన్ అనేది ఒక ఫీలింగ్ లేదా భావోద్వేగం అని ముందుగా మనం గుర్తించాలి. ఫీలింగ్ లేదా బావోద్వేగం అంటే..అది కొంత సమయమే వుండేది అని అర్ధం, మనం మన ఇతర ఫీలింగ్స్ అయిన కోపం, కరుణ, సంతోషం, బాధ, ఇలాంటి వాటిని పరిశీలిస్తే అవన్నీ కొంత సమయమే వుంటాయి. ఎ ఫీలింగ్ అయినా కుడా మనకి అన్ని సమయాల్లో, ఎప్పుడు ఉండదు, అలాంటిదే మొటివేషన్ కూడా. మరి మన జీవితంలో నిజంగా మార్పు రావాలి అంటే మాత్రం ఏమిచేయాలి. ఎలా మనం అనుకున్న మార్పును సాధించాలి... మొటివేషన్ క్లాస్స్లాన్ని టైం వేస్టేనా..అని మీరు అడిగితే మాత్రం...... మోటివేషన్ క్లాస్లు, వీడియోలు వేస్ట్..కాదు..మోటివేషన్ జీవితంలో చాల ముఖ్యం.
అయితే మోటివేషన్ ఎలాంటిదంటే, ఒక ఉదాహరణతో అర్ధం చేసుకుందాం. మీరు ఒక కారులో, ఒక దగ్గరికి వెళ్లి కార్ ఆఫ్ ఒక దగ్గర పార్క్ చేసారు కానీ...హెడ్ లైట్స్ ఆఫ్ చెయ్యకుండానే వెళ్లారు. ఆతర్వాత చూస్తే... .మీ కార్ యోక్క బాటరీ పూర్తిగా డౌన్ అయ్యిన్ధనుకంటే, బాటరీ డౌన్ అయినపుడు, సెల్ఫ్ స్టార్ట్ కానప్పుడు ఏమి చేస్తారు....
ఎవరైన వెనక నుండి కారుని నేడుతుంటే.. అలా తోయటంతో కారు స్టార్ చేస్తాము, అల నెట్టడం లాంటిదే మొటివేషన్.అయితే...తిరిగి కారు స్టార్ట్ చెయ్యాల్సిన ..
అలా ప్రతిసారి మన కార్ ఎవరో ఒకరు నెట్టడం చేయాల్సిన అవసరం లేదు.....ఆ తర్వాత కారు నడుస్తువుంటే బాటరీ ఆటోమేటిక్గా రిచార్ర్జు అవుతుంది. అలాగే ఇతరులు మన కార్ను త్రోయడం లాంటిదే మొటివేషన్, ఆ తర్వాతే రిచార్జూ చేసేది మాత్రం మన క్రమశిక్షణనే. ఆ మొటివేషన్ ఫీలింగ్ వచ్చిన తర్వాత మనం తీసుకునే చర్య లేదా చేసే పనే నిజమైన మార్పుని మన జీవితంలో తీసుకువస్తుంది అని మనం అర్ధం చేసుకోవాలి. అయితే ఆ మోటివేషన్ ఉన్నంత సేపు మాత్రమే చేసే చర్య అయితే పెద్దగా ఉపయోగం లేదు, ఎందుకంటే ఆ మోటివేషన్ ఎక్కువ సమయం ఉండదు కాబట్టి. కారు విషయంలో స్టార్ట్ చేయాల్సిన ప్రతిసారి ఎవరో నెట్టలేరుకద. నిజమైన మార్పుతో మనం విజయాన్ని పొందాలంటే మాత్రం, సక్సెస్ ఫుల్ వ్యక్తుల్ల "ఒక అవసరమైన పనిని, చేయాలని ఫీలింగ్ అప్పుడు వున్నా, లేకున్నా క్రమశిక్షణతో కొన్ని టెక్నిక్స్ పాటించటం ద్వార్త చెయ్యగలగాలి". అలా రేగ్యులర్గా ఏదైనా పని చేయాలనుకుంటే మొటివేషన్ తో పాటు మనకు ఉండాల్సింది క్రమశిక్షణ మరియు స్వీయ గుర్తింపు.
మన యొక్క ఈ స్వీయ గుర్తింపు వల్లే ఎన్నో విజయాలు సాద్యం, స్వీయ గుర్తింపు అంటే, మనం ఎవరం అని నమ్ముతున్నమో అని అర్ధం. ఉధహరణకు మీరు ఒక శాఖాహారి అనుకుందాం, ఎప్పుడైతే నేను ఒక శాకహారిని అని మిమ్మల్ని మీరు గుర్తిస్తున్నారో, అప్పుడు మాంసాహరము తినకండి అని మిమ్మల్ని ఎవరు మోటివేషాన్ చేయాల్సిన పనిలేదు. కాబట్టి మీ జీవితంలో మీరు కోరుకొనే రిజల్ట్స్ పొందాలి అంటే, మీరు చెయ్యాల్సిన పనులను చేసే వ్యక్తిగా మిమ్మల్ని మీరు గుర్తించాలి, ఆ గుర్తింపును పెంచుకోవాలి. అదెలా అంటే................. నేను చాల ఆక్టివ్ పర్సన్ని అని ఎప్పుడైతే గుర్తించుకొంటామో, అప్పుడు ఈజీగా ఉదయమే లేవగలం, ఎందుకంటే ఉదయాన్నే లేచే వ్యక్తిగా మనని గుర్తించాము కాబట్టి. మీ లక్ష్యాలకి అనుగుణంగా, ఒక పద్దతిలో క్రమశిక్షణ తో సాధన చేయడం ద్వార... ఈ గుర్తింపుని పెంచుకోవచ్చు, క్రమశిక్షణ అంటే మన ప్రస్తుత బావోద్వేగాల ప్రకారం కాకుండా, మన చర్యలపై పట్టు సాధించటం, మన పనిని, మన బావోద్వాగాలని మన అదుపులో ఉంచుకోడం. ఎ పనినైన క్రమబద్ధంగా, కొంతకాలం చెస్తే అది మన గుర్తింపులో బాగం అవుతుంది. ఆ తర్వాత ఆ పనిని ఆటోమేటిక్ గా చేసేయ్యగలం, అందుకే ఏది సాధిద్దామన్న దానికి సంబంధించిన విషయంలో, క్రమంగా కృషి చేసి గుర్తింపు సంపాదించడం ముఖ్యం. దాని కోసం కొంచెం కొంచెంగా ఆ పనిని మొదలు పెట్టి, రోజు తప్పకుండ చేసి ఒక అలవాటుగా మార్చుకోవాలి. కాబట్టి ఒక్క మోటివేషన్ ఒక్కటే మార్పు మన జీవితంలో తేలేదు, ఆ మొటివేషన్తో ద్వార క్రమశిక్షణతో, సాధనతో మనం తేచ్చుకొనే గుర్తింపే చాల మార్పుని తెస్తుంది. అల్ ది బెస్ట్.