ఫ్రెండ్స్! ఈ రోజు మనం చర్చించే అంశం.... " మన పనిలోనే, మన మని ఎలా దాగుందో మీకు తెలుసా!"
ఫ్రెండ్స్! ఈ ప్రపంచంలో విజేతలందరు, తమ పనిని దైవంగా భావించి, ఆ పనికి పూర్తిగా తమని అర్పించుకుంటారు. మనసా వాచా కర్మణా తమ పని చేస్తారు. ఎందుకంటే వారికి తెలుసు, వారి పని మాత్రమే, వారికి అపరిమితమైన అవకాశం అందిస్తుందని. ఎందుకంటే వారికి తెలుసు, వారి పని మాత్రమే వారికీ సంపదని అందిస్తుందని. అందుకే సినీ నటుడు, డైరెక్టర్ లారెన్స్ అంటారు, "ఏ రోజు కూడా మన దగ్గర డబ్బులు లేవని, మనం సిగ్గు పడకూడదు. కానీ చేతిలో చేయడానికి పని లేకుంటే మాత్రం..... తప్పక సిగ్గుపడాలి" అని అంటారు.
కాబట్టి మన దగ్గర ఇప్పుడు చెయ్యడానికి ఎ పని లేదు అని, మన సమయాన్ని వృధా చేస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు మిత్రమా. అలా అని, కొద్ది మంది యువకుల్లా " నేను ఇప్పుడు జాబు కోసం వెయిటింగ్"...నేను జాబు సెర్చింగ్.. జాబుకి ప్రిపేర్ అవుతున్నాను...అని మనమే నమ్మని మాటలతో, ఇంకా ఇతరులని నమ్మించాలని...చూడాల్సిన అవసరం లేదు.
ఏదో ఒక పని వెతుకుతూ, ముందుకు అడుగు వేస్తూ, అవకాశాలను సృష్టించుకోవలసిందే......ఎదో ఒక పని చేస్తువుండాల్సిందే.. ఎందుకంటే...మన కళ్ళ ముందు ఉన్న పనిని మంచిగా చేస్తూ వెళితే...ఎన్నో మంచి పనులు, మనకి ఇష్టమైన పనులు మనని వెతుక్కుంటూ వస్తాయి మిత్రమా!
పని చెయ్యాలనే మనసు, కోరిక ఉన్నవాడికి..... ఏదో ఒక పని తప్పక లభిస్తుంది. అలాగే నిజమైన ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, మన చేతిలోని ఐ ఫోన్ తోనో.....కొత్త బ్రాండెడ్ బట్టలు కొనుక్కోవడంతోనో, కొత్త స్పోర్ట్ బండి కొనుక్కోవడంతోనో, అందమైన అమ్మాయి వెంట వుంటేనో రాదు, అలాగే అమ్మ నాన్న ఇచ్చిన డబ్బులు, పబ్బుల్లో, పార్టీల్లో ఖర్చు పెట్టడంలో గొప్పతనం లేదు ఫ్రెండ్!
నిజమైన ఆత్మగౌరవం, నిజమైన ఆత్మవిశ్వాసం, మనస్పూర్తిగా మనం చేసే పనిలో, మనదంటు సంపాదించే మొదటి రూపాయిలో, మనదంటు చెప్పుకునే పనిలోనే వుంది. ఎన్నో గొప్ప పనులు చేయాడానికి కావాల్సిన బ్రెయిన్, చేతులు, కాళ్ళు, కండ్లు...ఇలా అన్ని అద్బుతమైన ఎన్నో శరీర ఆస్తులు, మనకి అమ్మ, నాన్నల నుండి ఉచితంగా వచ్చిన, అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తున్న కూడా, మనం ఏ పని చెయ్యకుంటే మాత్రం...మనని సృష్టించిన, సృష్టికర్తనే మనం అవమానిస్తున్నట్టు.
ఎందుకంటే...మనం ఒక్క రోజు, ఒక్క ఓటు వేసి గెలిపించిన నాయకుడు, మంచిగా పని చెయ్యకుంటే ప్రతి రోజు విమర్శిస్తాము కదా. కాని మనం మాత్రం....మన కాలాన్ని, మన కాళ్ళలతో తంతు...వృధా చేస్తూ వుంటే ఎలా?
ఇందుకోసమేనా, అమ్మ తినకుండా ఒక ముద్ద మనకోసం దాచింది. ఇందుకోసమేనా, మననీ అమ్మ తొమ్మిది నెలలు తన కడుపులో జాగ్రత్తగా మోసింది.. ఇందుకోసమేనా, అమ్మ పురిటి నొప్పులు తట్టుకొని మనని కన్నది, ఇందుకోసమేనా....నాన్న రూపాయి..రూపాయి.దాచి...చదివించింది. కాదు మిత్రమా కాదు...వారికీ తెలుసు, ఏదో గొప్ప విషయం మనలో వుందని, వారికీ తెలుసు మనం తలచుకుంటే ఏదైనా సాదించగలమని, వారికీ తెలుసు మనం గొప్ప పనులు చెయ్యగలమని...అందుకే, ఆ రోజుకై..ఆ గడియకై, ఆ క్షణంకై ఆశగా...ఎదురు చుస్తూ, నిన్ను నమ్ముతూవున్నారు.
ఫ్రెండ్స్! ప్రతి మనిషిలోను అంతర్లీనంగా ఎంతో గోప్ప శక్తులు వున్నాయని ఎందరో మహానుబావులు చెప్పారు. మనం చెయ్యాల్సిందల్ల, ఆ శక్తిని మనం వాడుకొని, మన పనిని గొప్పగా చెయ్యటమే. ఈ రోజు మన ముందు ఉన్న పనిని దైవంగా భావించి, ఎప్పుడైతే పని చెయ్యడం మొదలు పెడతామో... అప్పటి నుండి మన జీవితమే మారిపోతుంది. ఎందుకంటే...న్యూటన్ ఫస్ట్ లా చెప్పినట్టు "బాహ్యబల ప్రయోగము లేనంత వరకు, చలన స్థితిలో ఉన్న వస్తువు చలన స్థితిలోను, నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోనే వుంటుంది". అంటే ఒక్క సారి మనం పని అనే ట్రాక్ లో పడగానే ..మన పని చాల సులువుగా అనిపిస్తుంది. అదే బద్ధకం, అనే ట్రాక్ లో పడగానే...ప్రతిది బద్ధకం అనిపిస్తుంది. అందుకే ఏదైనా సరే ఒక అలవాటు గా మారగానే అది సులభం అనిపిస్తుంది. మన పని కూడా అంతే. మన పని ఎన్నో ఇబ్బందులకు మందు లాంటిది. దీనికోసం ముందుగా మనం గుర్తించాల్సింది.......మనీ వున్నవాడు ధనవంతుడు కాదు...పని వున్నవాడు నిజమైన ధనవంతుడు అని.
అందుకే మన పనినే, మనం నమ్ముకోవాలి..ఎందుకంటే..మన పనిని ఎన్నో సమస్యలకు సమాధానంగా చెయ్యవచ్చు, మన పనిని ఎన్నో కష్టాలకి పరిష్కారంగా చూపవచ్చు. మన పనిని ఎన్నో సంపదల యొక్క నిధులకు తాళం చెవిలా మార్చవచ్చు. మన పనిని ఒక శక్తివంతమైన ఆయుధంగా మనం వాడవచ్చు. మన పనిని, మన యొక్క అసలైన ఉనికిలా మార్చుకోవచ్చు. అందుకే...మన పని మాత్రమే, అవును...మన పని మాత్రమే... మనం కోరుకునే ఎన్నిటినో అందించగలదు.
కాబట్టి, మన సమయాన్ని, మన శక్తిని, మన పని మీద ఒక పెట్టుబడి గా ఎప్పుడైతే పెడతామో, మన పని యొక్క విజయాలు రెట్టింపు అవుతాయి. ఉదాహరణకి, మన పని రోడ్డు క్లీన్ చెయ్యడం అయిన కూడా...మనం క్లీన్ చేసిన రోడ్, ప్రపంచంలోనే అత్యంత క్లీన్ రోడ్స్ లో ఒకటిగా వుందంటే...మనం మన పనిలో గొప్ప అని అర్ధం. అందుకే ఎ పని చేస్తున్నాము అనేది అంత ముఖ్యం కాదు, ఆ పనిని ఎలా చేస్తున్నాము అనేది చాల ముఖ్యం.
అందుకే ఫ్రెండ్స్...మన అన్ని సమస్యలకి పరిష్కారం మన పని, అన్ని శక్తులకు మూలము మన పని, అన్ని విజయాలకు విత్తనం మన పని, అన్ని సంతోషాలకు వారధి మన పని, అన్ని బంధాలకు వాహనం మన పని, అందుకే...అన్ని దరిద్రాలని దూరం చేసేది, ఒక్క మన పని మాత్రమే. పనిని గౌరవించలేని వారు, ఈ ప్రపంచంలో దేనిని గౌరవిన్చలేరు...కాబట్టి మీ పని ఏదైనా సరే...గౌరవించండి. ప్రేమించండి..ఆరాదించండి... ఇక మీ జీవితంలో అన్ని అద్బుతలే జరుగుతాయి. మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు. ప్రపంచమంతా మీ చరిత్ర చదవడానికి పోటి పడుతుంది. మీకు జై జై లు కొట్టడానికి లైన్ లో నిలబడుతుంది. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని గర్వపడుతుంది. ఆ రోజు కై ...నేడే..ఈ నాడే...తొలి అడుగు వెయ్యి నేస్తమా...లే..కదులు..దూసుకుపో......అల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.