ఫ్రెండ్స్! ఈ రోజు మనం చర్చించే అంశం… "ఇలా సంభాషణ చేస్తే, ఇక సంతోషం మీ సొంతమే"
మన రోజువారీ జీవితంలో ఎంతో మందితో మనం మాట్లాడుతూవుంటాము. ఆఫీస్ లో బాస్ తో, కొలీగ్స్ తో, అలాగే మీ జీవిత భాగస్వామితో, కుటుంభ సభ్యులతో లేదా స్నేహితులతో, ఇంకా మన బిజినెస్ కస్టమర్స్ తో కూడా అయివుండవచ్చు. అందుకే కొద్దిమంది అంటారు ...ఒక మంచి సంభాషణ, మన మనస్సుకు వెయ్యేనుగుల బలం ఇస్తుంది అని. ఇలా రోజు మనం మాట్లాడేవాటిలో కొన్ని సంభాషణలు చాల ప్రాముఖ్యతని కలిగి వుంటాయి. ఎందుకంటే ఆ సంభాషణల ద్వార మనము లేదా ఎదుటివారు తీసుకునే నిర్ణయాలు, మనకు ఉపయోగపడే లేదా నష్టంపరిచే ఫలితాలను కూడా ఇవ్వవచ్చు కాబట్టి. ఇప్పుడు ఆ సంభాషణలను ఎలా చేస్తే మనం అనుకున్న ఫలితాలను పొందడమే కాకుండా, మన బంధాలను కూడా బలోపేతం ఎలా చేసుకోగలమో చూద్దాము.
ఫ్రెండ్స్! మీకు ముఖ్యమైన మరియు సున్నితమైన సంభాషణలు ఇతరులతో మీరు ఎలా చేస్తుంటారో ఎప్పుడైనా గమనించారా? వీటికి సంభందించిన పూర్తి అవగాహనా మనం కలిగివుండటం చాల అవసరం. ఎందుకంటే మన రోజువారీ సంభాషణలే, మన బంధాలను బలహీనం చేయడం లేదా బలంగా చేయడం చేస్తాయి. ఈ విషయంలో ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, అత్యంత ముఖ్యమైన సంభాషణల యొక్క ఫలితాన్ని, తమకు కావాల్సిన విధంగా ప్రభావితం చేసే వారే విజేతలుగా ఈరోజుల్లో నిలుస్తున్నారు. .
ఈ సంభాషణ విషయంలో వ్యక్తులను మూడు విభాగాలుగా మనం విభజించవచ్చు. మొదటి వారు అత్యంత ముఖ్యమైన సంభాషణలను తప్పించుకుంటారు, ఎలాగో అలా ఆ ప్రస్తావన రాకుండా చూసుకుంటారు, కానీ ఇలాంటి వారివలన ఎవ్వరికి ఉపయోగం వుండదు. రెండవవారు సంభాషణ చేస్తారు, కానీ వారి భావావేశాలను కంట్రోల్ ల్లో పెట్టుకోలేక, ఏదో ఒక మాటతో నోరు జారి...వారె నష్టపోతారు. ఇక మూడవ రకం మాత్రమే వారి సంభాషణలను విజయవంతంగా వాడుకుంటారు. ఆ సంభాషణ ద్వార అందరికి లాభం పొందేవిధంగా చూస్తారు. ఫ్రండ్స్ ! మనం ఆ మూడవ రకంగా వుండాలి అంటే కొన్ని విషయాలు అర్ధం చేసుకోవాలి. ముఖ్యంగా చాల సంభాషణలు సరైన విధంగా చెయ్యకుంటే...అవి సైలెంట్ గా నైన లేదా వయలేంట్ గా నైన అవుతాయి. అలా కాకుండా ఫ్రూట్ ఫుల్ గా అవ్వాలంటే మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
దీని కోసం మనం ముందుగా గుర్తించాల్సింది "సంభాషణ అంటే ఒక ఫ్రీ ఫ్లో గా ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది ఒక మీనింగ్ పంచుకునే విధానం" అని. అయితే ఇందులో ఎన్నో మన భావాలూ సంభాషణలో బాగంగా వచ్చి పోతూ వుంటాయి. ఆ భావావేశాలు సంభాషణ యొక్క ఫలితాన్ని ప్రభావం చేస్తుంటాయి. దీని వలన నష్టం ఏంటి అని మీరు అడిగితే...మనకి కొన్ని సంభాషణలు చాల ముఖ్యమైనవి వుంటాయి, వాటి ద్వార జరిగే నిర్ణయాలు మన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకి అది ఒక పెళ్లి విషయం అయివుండవచ్చు, లేదా ఆర్ధిక విషయం అయివుండవచ్చు, లేదా చదువు విషయం అయిఉండవచ్చు, అయితే ఇలాంటి సమయంలో మన భావావేశాలు ఏంతో ఎక్కువగా వుండే అవకాశం వుంది. ఎప్పుడైతే మన ఎమోషన్ ఎక్కువగా ఉంటాయో, అప్పుడు మన లాజిక్ మిస్ అయ్యి మాట్లాడవచ్చు. అందుకే మన భావవేశాలని అదుపులో పెట్టుకొని మాట్లాడటం చాల ముఖ్యం. మన ఎదురుగా కూర్చున్న వారితో ముందు, మన ఆలోచనలు, భావాలూ, అభిప్రాయాలూ బహిరంగంగా పంచుకోవాలి, అలాగే వారి అభిప్రాయాలూ తెలుసుకోవాలి, ముఖ్యంగా వారు చెపుతున్న విషయాన్నీ పూర్తి శ్రద్ధ తో వినటంలోనే సంభాషణని సక్సెస్ఫుల్ చేస్తున్నట్ట్టు. ఆ తర్వాత సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని ఇద్దరు కూడా లాభం పొందవచ్చు.
మనం సంభాషణ చేసే అప్పుడు ఎదుటి వ్యక్తి హావభావాలను గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనము మాట్లాడుతున్న విషయం మాత్రమే కాకుండా, ఎదుటి వ్యక్తిని గమనించడం ద్వారా ఆ సంభాషణ సరైన విధంగా వెళుతుందో లేదో మీకు తెలుస్తుంది. అలాగే ఒక సంభాషణలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు చాలా మంది ఆ సంభాషణని పక్కకు పెట్టేస్తారు. అలా కాకుండా మనం ముందుగా రెండు విషయాలు జాగ్రత్త తీసుకోవాలి. ఒకటి ఆ వ్యక్తి యొక్క లక్ష్యాలని, అవసరాలని మనం పట్టించుకుంటాము అని అర్థం చేయించాలి. రెండు వ్యక్తిగా వారి గురించి కూడా మనం చాలా కేర్ తీసుకుంటాము అని వారికీ అర్థం చేయించాలి. అప్పుడు వారు మన విషయంలో చాల రిలాక్స్డ్ గా మరియు భద్రతా భావం తో ఉంటారు. అలా మనం అర్ధం చేయించకుంటే ఆ సంభాషణ సైలెంట్ గా గాని వయలేంట్ గా కానీ అయ్యే అవకాశం ఉంది. ఎదుటి వ్యక్తి మన ఐడియా ని ఆక్షన్ లో పెట్టడానికి సరైన సంభాషణలు ఎంతో సహాయం చేస్తాయి.
ఎదుటివ్యక్తితో మీ వాస్తవాలని చెప్పి, వాటి గురుంచి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పి, వారి అభిప్రాయం కూడా తెలుసుకొని, మీకు ఏమి కావాలో ఆ సహాయాన్ని ఎదుటివారి నుండి అడగగలగాలి. అన్ని సంభాషణల్లో మీ బాడీ లాంగ్వేజ్, మీ వాయిస్ అలాగే మీ ఫేషియల్ ఎక్ష్ప్రెషన్స్ చాల ముఖ్యం.. మిమ్మల్ని మీరు ఎలా పరిచయం చేసుకుంటున్నారు, మీరు మీ పేరు ఎలా చేబుతున్నారు, అలాగే ఇద్దరికీ ఇష్టమైన విషయాల చర్చ ఎలా తెస్తున్నారు అనేది చాల ముఖ్యం. అలాగే సంబాషణని మీ ఉత్సాహకరమైన పలకరింపుతో మొదేలట్టడం, దానితో పాటు కొన్ని కుశల ప్రశ్నలు అడగటం, ఆ తర్వాత వారి పేరును మళ్లీ మళ్లీ వాడటం చాల ఉపయోగపడుతుంది. అలాగే వారికీ నచ్చనివి లేదా వారికీ పూర్తిగా వ్యక్తిగతమైన విషయాలు ప్రస్తావించకపోవడం చాల మంచింది, వారితో మనం గౌరవంగా మాట్లాడతున్నాము అని వారికీ అర్ధం చేయించాలి, దానికోసం వీలైనంతవరకు ఓపెన్ గా మాట్లాడాలి. అలాగే వారిని ఎంకరేజ్ చేసే పదాలను ఎక్కువగా వాడుతూ, మన సంభాషణను సరైన టైమ్లో ముగించగలగాలి.
వీటిని ఆచరణలో పెట్టడానికి ఎ సంభాషణకైనా ముందు, కొన్ని విషయాలు మనం చెక్ చేసుకోవాలి. అవి. మొదటిది అసలు ఈ సంభాషణ ఎందుకు చేస్తున్నాను అని ప్రశ్నించుకోవాలి. రెండవది, ఈ సంభాషణ చేయడానికి ఇది సరైన సమయమేన, కాదా! అని చూసుకోవాలి. ఎందుకంటే సమయం, సందర్భం కూడా ఒక సంభాషణని ఎంతో ప్రభావితం చేస్తుంది. అలాగే మూడవది ఈ సంభాషణ ఎలా మొదలు పెట్టాలనుకుంటున్నారు అని ముందుగానే అలోచించి పెట్టుకోవాలి. ఒక సంభాషణ సరిగ్గా మొదలెట్టుతే సగం విజయం సాదిన్చినట్టే. ఇక నాలుగవది ఆ సంభాషణలో మీ యొక్క అంశం కు సంబంధించిన ఉద్దేశం చెప్పి, వారి ఉద్దేశం కనుక్కోండి. ఇక చివరిగా ఐదవది.. ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చి తదుపరి చర్యని పంచుకోండి. ఫ్రండ్స్! ఇలా స్పష్టంగా సన్నద్ధం కావటం వలన ఎ సంభాషననైన మీరు విజయవంతగా కొనసాగించగలరు. అల్ ది బెస్ట్.