మీరు ఈ 5 పనులు చేస్తే, ఎవరినైనా "నొప్పించక" ఒప్పించవచ్చు!

Update: 2019-03-25 09:44 GMT

ఫ్రెండ్స్!

మీరు ముందుగా మీ మనసును ఒప్పించుకోగలిగితే, ఆ తర్వాత ఎవరినైనా ఒప్పించవచ్చు! శ్రీ.కో.

మన రోజు వారి జీవితంలో బాగంగా, మనం చాలామంది సహాయం తీసుకోవల్సివస్తుంది. ముఖ్యంగా కొన్ని విషయాల్లో వారిని మెప్పించి, మనకి కావల్సిన పని గురించి ఒప్పించాల్సి వుంటుంది. అయితే కొన్ని సందర్బాలలో ఒక్క వ్యక్తినే కన్విన్సు చెయ్యల్సివుంటుంది, మరి కొన్ని సందర్బాలలో ఇద్దరు లేక అంతకన్నా ఎక్కువ మందిని కన్విన్సు చెయ్యల్సివుంటుంది. అలా ఒప్పించగలిగిన వారు విజేతలుగా నిలుస్తారు.

అయితే చాలామందికి ఎదుటి వ్యక్తిని ఎలా కన్విన్సు చెయ్యాలో తెలియక చాల ఇబ్బంది పడతారు. ఎన్నో సమస్యలని పరిష్కరించు కోలేరు. ఇది రాకుంటే ఒక సేల్స్ పర్సన్ తన వస్తువులని అమ్మలేడు, ఒక భర్త తన బార్య యొక్క సహాయం తీసుకోలేడు, పిల్లలు తమ తల్లిదండ్రుల నుండి కోరుకునే వస్తువులు పొందలేరు.

కాబట్టి ఈ రోజుల్లో విజయవంతమైన జీవితం గడపడానికి, ఇతరులని కన్విన్సు చెయ్యడం చాల అవసరమైన కళ. ఒక ఉద్యోగం కోసం వెతికే వ్యక్తికి ఇంటర్వ్యూ లో విజయానికి కూడా ఈ స్కిల్ అవసరం. ఈ రోజుల్లో మంచి టెక్నికల్ స్కిల్ జాబ్స్ కన్నా, మంచి మేనేజర్ జాబ్స్ కన్న, పీపుల్ స్కిల్ వున్నా వారికే ఎక్కువ డిమాండ్ వుంది. ఎందుకంటే ఒక సరైన క్లయింట్ని ఒప్పించి తెచ్చే ఉద్యోగి ఆ కంపెనీకి పెద్ద ఆస్థి కాబట్టి.

ఫ్రెండ్స్ ! మిమ్మల్ని ఎవరైనా మీకు ఇష్టం లేకున్నా, మీ మనసుకు నచ్చకున్న, ఎదైన విషయంలో ఒప్పించాలని ట్రై చేశారా!

అలా చేసిన ఆ సందర్భంలో మీరు ఎప్పుడైనా, ఏదైనా విషయాన్ని ఒప్పుకున్నారా! ..............ఎవరైనా సరే మనని బలవంతం చేస్తే, ఏ విషయాన్ని కూడా మనస్పూర్తిగా ఒప్పుకోం కదా, అలాగే ఇతరులు కూడా.

అయితే మన ఎదుటి వారు మనని మెప్పించి ఒప్పిస్తే మాత్రం, చాల సంతోషంగా ఒప్పుకుంటాం. అలాగే ఎదుటివారు కోరిన విషయాన్నీ, మన పనిలా మసస్పుర్తిగా, విజయవంతంగా చేస్తాము. కాబట్టి ఇప్పడు మనం ఎవరినైనా నొప్పించక ఒప్పించడం కోసం ముఖ్యమైన ఐదు విషయాలు తెలుసుకుందాం.

1. ముందుగా వారి అభిప్రాయం తెలుసుకోండి.

మనం ఎవరినైతే కన్విన్సు చేయాలనుకుంటున్నామో వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా, ముందుగా మనం సేకరించాల్సి ఉంటుంది. వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత, ప్రస్తుతం వారికి ఉన్న సమస్య లేదా ఇబ్బంది ఏంటో తెలుసుకోవాలి. లేదా మీరు ఆఫర్ చేస్తున్న ఐడియా లో వారికి ఎలాంటి అవసరం ఉందో గుర్తించాలి. ఆ తర్వాత వారిని కలసినప్పుడు ఆ వ్యక్తిని ఆ విషయంలో తన అభిప్రాయం ఏంటో అడిగి తెలుసుకోవాలి.

అందుకే అంటారు...."If you don't have the confidence to ask, you will never have the confidence to convince" అని.

ఫ్రెండ్స్! ఎప్పుడు మనం ఎదుటి వ్యక్తి యొక్క అవసరాన్ని లేదా ఆలోచనని విన్నమో, గుర్తిన్చామో, మనకి అర్ధమైన విషయన్ని వారికీ మరొక్కసారి చెప్పాలి. దాని వల్ల మనం వారి యొక్క పరిస్థితిని, అవసరాన్ని అర్ధం చేసుకున్నామని ఎదుటివ్యక్తి భావిస్తాడు. అలాగే మనం వారిని వినటం వల్ల వారిని అర్ధం చేసుకున్నామని అనుకుంటాడు. మన విజయానికి ఇది తొలి మెట్ట్టు.

2. వారు లాజిక్ ఆలోచిస్తున్నారా ఎమోషన్ గా ఆలోచిస్తున్నారా చెక్ చేసుకోండి.

ఈ విషయంలో డేల్ కార్నెజీ అనే ప్రముఖ రచయిత అంటాడు "When dealing with people, remember you are not dealing with creatures of logic, but with creatures of emotion." అని..

సో ఫ్రెండ్స్! ప్రతి వ్యక్తి ఒక విషయం గురించి కొన్ని సందర్భాల్లో లాజిక్ ఆలోచిస్తారు, కొన్ని సందర్భాల్లో ఎమోషనల్ గా ఆలోచిస్తారు.

అయితే మీరు ఒప్పించాలని ప్రయత్నిస్తున్న వ్యక్తి, మీరు ఆఫర్ చేస్తున్న విషయంలో తన అభిప్రాయాన్ని లాజికల్ గా చెబుతున్నారా లేదా ఎమోషనల్ గా చెబుతున్నారా అని మనం గుర్తించాలి. అలా గుర్తించన తర్వాత మనం వారు చెప్పిన పద్దతిలోనే, అంటే ఎదుటి వ్యక్తి లాజిక్ గా మీతో మాట్లాడితే మీరు ఆఫర్ చేతున్న విషయంలోని లాజిక్ మొత్తం వివరించాలి. లేదా ఆ విషయంలో వారు ఎమోషనల్ గా వారు మాట్లాడితే మీరు ఆ పద్దతిలోనే మాట్లాడాలి. ఇందువల్ల ఇద్దరిమద్య ఒక రాప్పోర్ట్ ఏర్పడుతుంది. అలాగే ట్రస్ట్ కూడా బిల్డ్ అవుతుంది.

ముఖ్యంగా మనం గుర్తుకి పెట్టుకోవాల్సింది...

మన లాజిక్ ఎదుటి వ్యక్తిని ఒక నిర్ణయం తీసుకోనేలచేస్తుంది, కాని ఎదుటి వ్యక్తి ఎమోషన్ మాత్రమే అతను ఆక్షన్ తీసుకొనేలా చేస్తుందని.శ్రీ.కో.

3. ఒక మంచి కాంప్లిమెంట్ ఇవ్వండి.

వారు ఇప్పటివరకు మీతో చెప్పిన విషయాలన్నీ ఎమోషనల్ అయిన లేదా లాజిక్ అయిన కూడ ఆ వివరణ విన్న తర్వాత, మీరు వారు చెప్పిన విషయం లో ఒక మంచి విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక ప్రశంస ఇవ్వండి. ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తికి ఒక సరైన ప్రశంసని, సందర్భానుసారం ఇస్తామో, వారు మనని వారి శ్రేయోభిలాషిగా చూస్తారు. కాబట్టి మనం సరైన సమయంలో సరైన విధంగా వారు చెప్పిన విషయం లో ఒక మంచి విషయాన్నీ గుర్తు చేస్తూ, ఒక ప్రశంస ఇవ్వడం వల్ల మనపైన వారికీ ఒక మంచి అభిప్రాయం వస్తుంది.

4. మీరు చెప్పే విషయం లోని పాజిటివ్, నెగెటివ్ పాయింట్స్ రెండింటిని చర్చించండి.

ఎదుటి వ్యక్తికి మనం ఆఫర్ చేస్తున్న విషయంలో, మంచి ఏంటి అలాగే ఏదైనా కొంత ఇబ్బంది వుంటే అది కూడా కొంత చెప్పాలి. అలా ఆ రెండు విషయాలను చర్చించడం వల్ల అతను తీసుకోవాల్సిన నిర్ణయంకు, మనం సహాయపడే వ్యక్తిగా చూస్తాడు. అయితే అతనికి మనం చెప్పే, ఇచ్చే ఆఫర్ ద్వార వచ్చే బెనిఫిట్స్ ని ఎక్కువగా చెప్పాలి. ఒక వేల ఈ ఆఫర్ ని వారు తీసుకోలేకపతే ఎలాంటి నష్టం వారు పొందుతారో వివరించాలి.

5. మీరు చెప్పిన విషయం లో వారు ఎ యాక్షన్ తీసుకోవాలో చెప్పండి.

మీరు ఇచ్చే ఆఫర్ వారికి నచ్చింది అని మీరు గమనించగానే, ఇప్పుడు ఆ ఆఫర్ బెనిఫిట్స్ పొందటానికి వారు తీసుకోవలసిన ఆక్షన్ లేదా చర్య ఏంటో మనం ఎదుటి వ్యక్తికి వివరించాలి. వారు ఇక చెయ్యాల్సిన పని ఏంటి, వారు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, దాని గురించి వివరించడం ద్వారా, మనం ఎదుటి వ్యక్తిని మెప్పించటం లో , ఒప్పించటంలో, మనం చివరి ఘట్టానికి, చివరి దశకు వచ్చామని అర్ధం.

మీరు ఎదుటి వ్యక్తి తో "ఈ పని చేస్తే చాలు మనం మాట్లాడుకున్న లాభాలు అన్ని మీరు పొందగలుగుతారు అని చెప్పగలగాలి. అప్పుడు వ్యక్తికి మీరు చెప్పిన అంశంపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇలా మీరు ఎవరినైనా మెప్పించగలరు, ఒప్పించగలరు. అందుకే అంటారు.... కళ్ళు చూడలేని ఎన్నో విషయాలని, మన నాలికతో చిత్రికరించవచ్చని. సో ఫ్రెండ్స్ మీ మాటలతో ఎదుటి వ్యక్తిని ఒప్పించి, విజయాల పూల తోటని పెంచుకుంటారని ఆశిస్తూ. ఆల్ ది బెస్ట్. 

Similar News