మనిషి సంఘజీవి, కాబట్టి మన రోజువారీ జీవితంలో ఎంతో మందిని కలుస్తుంటాం, సంభాషీస్తుంటాము. అయితే అందులో బాగంగా ఒకో సారి కొన్ని విషయాలు చర్చిస్తుంటాము. మన కమ్యూనికేషన్ లో ఇతరులతో చర్చించడం, దాని ద్వార మన జ్ఞానాన్ని పెంచుకోగలుగుతాము. ఆ తర్వాత సరైన నిర్ణయాలు తీసుకోడానికి ఈ చర్చలు చాల ఉపయోగపడుతాయి.
ముఖ్యంగా సరైన చర్చలు ఎన్నో దేశాల మద్య యుద్దాలు రాకుండా ఆపగలిగాయి. అలాగే కొన్ని రాష్టాల మధ్య జరిగిన చర్చలు, వర్గాల మధ్య జరిగిన చర్చలు ఎన్నో సమస్యలను పరిష్కరించాయి. కాని కొద్దిమందికి ఒక విషయంపై ఎలా చర్చిన్చాలో తెలియక, చర్చిండం రాక అనవసర వాదనకి, విమర్శలకి దిగుతారు. అలా వాదనలు ఎంతో మందికి వేదనని మాత్రమే మిగులుస్తాయి.
ఆఫీస్ సమావేశాలలో అయిన, అసెంబ్లీ సమావేశాలలో అయిన అధికభాగం నిర్ణయాలు తీసుకునే చర్చలు ఉండాలి, కానీ సరైన విధంగా చర్చించడం రాకపోవడం వల్ల ఎంతో సభా సమయం, ప్రజల డబ్బు వృధా అవుతుంది. ముఖ్యంగా వ్యాపారస్తులైన, టీం లీడర్స్ అయిన వారి వ్యాపార అభివృద్ధి కోసం, తమ ఉద్యోగులతో సరైన విధంగా చర్చించడం నేర్చుకుంటే ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకొని ఏంతో అభివృద్ధి చెందవచ్చు.
ముఖ్యంగా ఒక ఉద్యోగం సంపాదించడం కోసం వెళ్లేవారికి ఇంటర్వ్యూ ఎంత ముఖ్యమో, ఆ అభ్యర్థి కమ్యునికేషన్ తెలుసుకోడానికి గ్రూప్ డిస్కషన్ కూడా ముఖ్యం కాబట్టి, ఆ కంపనీ వారు గ్రూపు డిస్కషన్ పెడతారు. ఇలా డిస్కషన్ లో విజేతగా నిలబడటం చాల అవసరం.
అయితే కొన్ని టీవీ ఛానల్స్ లో ఉదయాన్నే చర్చ పేరుతో రాజకీయ నాయకుల మద్య ఎలాంటి వాదనలు జరుగుతాయో మీరు చూసేవుంటారు...అవి వాదన నుండి అరపులా, గొడవలా అనిపించి చాలామంది ఆ టీవీ ఛానల్ మార్చేస్తారు.
ఫ్రండ్స్ ! మీకు చర్చించటానికి ఎ సందర్భాములో అవకాశం వచ్చినా, సమర్దవంతంగా ఎదుర్కోడానికి, అలాగే ఎలాంటి చర్చలో అయిన విజయవంతంగా పాలుపంచుకోడానికి, మనం ఇప్పుడు మాట్లాడుకునే విషయాలు సహాయపడతాయి, ప్రతి చర్చలో లేదా వాదనలో మిమ్మల్ని విజేతలుగా నిలుపుతాయి.
ముందుగా మనం అర్ధం చేసుకోవాల్సింది, చర్చ అంటే విజ్ఞానం మార్పిడి అని, వాదన అంటే అజ్ఞానం మార్పిడి అని. ఎందుకంటే చర్చ అనేది ఇద్దరు, లేదా కొన్ని గ్రూప్ ల మధ్య సత్యాన్ని చేరుకోవడానికి చేసే సంభాషణ. కానీ వాదన మాత్రం కేవలం మన సత్యన్ని ఇతర వ్యక్తులు నమ్మాలని, ఇతరలను ఎలాగోలా ఒప్పించేందుకు ప్రయత్నించి మనం గెలవాలనుకోవడం కోసం చాల సందర్భాల్లో జరుగుతుంది.
చర్చలో "విషయాన్ని విషయంగా చూస్తూ, ఎవరు అంటున్నారు అని చూడకుండా, ఏమి అంటున్నారు అని చూస్తూ తమ ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం జరుగుతుంది. చర్చ అనేది ఒక ప్రత్యేక సమస్యతో కూడిన ఆలోచనలు మరింత అనుకూలమైన మరియు సహజమైన ఆలోచన మార్పిడికి సహాయపడతాయి.
అయితే వాదన మాత్రం...ఇద్దరు లేదా ఎక్కువ మంది ఒక విషయంలో భినమైన అభిప్రాయాలూ కలిగి, ఒక అంగీకారంకు రాకుండా తమ నమ్మకానికి తోడ్పడే విషయాలను, రీజన్గా, వారి వద్ద వున్నా సాక్షాలు చూపెడుతూ, మాట్లాడుకోవడము అవుతుంది. వాదన అనేది పాల్గొనే వ్యక్తుల యొక్క ఆలోచనలకూ , భావాలకు సంబంధించిన ఒక అవేశాపురితమైన, ఉద్రేకపూరిత వ్యక్తీకరణలా వుంటుంది.
"విరుద్ద అభిప్రాయాలు కలిగిన వ్యక్తుల మధ్య ఒక బావవేశంతో కూడుకున్న సంబాషణని మనం వాదన అని అనవచ్చు. "వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడిన వాదనలో చాలా తరచుగా చర్చ క్షీణిస్తుంది".
చర్చలో లెక్కలు, సాక్ష్యాలు మరియు తార్కిక ఆధారంగా ఉన్నాయి. అదే వాదనలో కేవలం తనకున్న మొత్తం వాయిస్ పైన అరుస్తూ వున్నట్టు ఉంటుంది.
అసలు ఎక్కడైనా, ఎప్పుడైనా వాదన లేక చర్చ జరగాల్సింది, మాట నెగ్గడం కోసం కాదు. ఆలోచనలు ముందుకు సాగడం కోసం అని మనం గుర్తుకి పెట్టుకోవాలి. అలాగే ఎప్పుడు ఎదుటి వ్యక్తి అభిప్రాయాన్ని గౌరవించగలగాలి. మీ అభిప్రాయానికి, వారి అభిప్రాయానికి వ్యత్యాసం వున్నా, మీ అభిప్రాయం గురించి, అలా ఎందుకు అనుకుతున్నారో వివరణ ఇవ్వగలగాలి.
ఒక చర్చలో మనం విజయం పొందాలి అంటి ముందుగా ఇద్దరికీ సంబంధించిన కామన్ ఏరియాస్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఆ తర్వాత విషయం చెప్పె వ్యక్తికి సహనం తప్పకుండ వుండాలి. లేకుంటే అది అనవసర వాదనకి దారి తీయవచ్చు. అలాగే వాదనలో అయిన చర్చలో అయిన మనం మాట్లాడుతున్న విషయం ముఖ్యం అని గుర్తించాలి.
చర్చలో ఒక ఏక అభిప్రాయానికి రావడం సాధ్యం అవుతుంది కాని వాదనల్లో చాలా వరకూ ఆ వాదన ఒక భావవేశం, లేదా వ్యక్తుల నమ్మకాల పరిధిలోనే వుండటం వల్ల ఏకాభిప్రాయం రావడం చాలా కష్టం. వాదనలో ఒకరు "విజేత" మరియు మరొకరు "ఓటమి" వైపు ఉన్నట్టుగా భావిస్తారు. అందుకే వాదనలు ఎల్లప్పుడూ కొంత నష్టాన్ని కలిగిస్తాయి, అందుకే అంటారు మీరు వాదనలో "గెలిచినప్పటికీ" ఒక మంచి మిత్రుడిని కోల్పోయే ప్రమాదం వుంది అని.
చర్చలు సాధారణంగా ఆరోగ్యకరమైనవి, ఎందుకంటే అవి వ్యక్తుల మద్య సంభాషణల ద్వార సంబంధాలు నిర్మించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మరియు దీని ఫలితంగా ప్రతిఒక్కరికీ "విజయం" అందుతుంది..
మనం ఒక వాదనలో మూడో వ్యక్తి ద్రుష్టి నుండి చూడగలిగితే వాస్తవాలు తెలుస్తాయి, ఎలాగితే కోర్టులో జడ్జీ గారు ఇద్దరు లాయర్స్ యొక్క వాదనలు విని సత్యాన్ని గ్రహిస్తారో...అలాగే మీరు మూడో వ్యక్తి కోణంలో చూసి...ఏది రైట్ అని ఆలోచించాలి. ఎవరు రైట్ అని కాదు.
ఒక చర్చ ఫలవంతం కావాలి అంటే, చర్చలోని ఇద్దరి కామన్ ఇంట్రెస్ట్ వున్నా విషయాలను ముందుగా చేర్చించి ఎకిభవిస్తే మంచింది. ముక్యంగా చర్చలో పాల్గొనే వారికి సహనం, అలాగే ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలియటం చాల ముఖ్యం.
ఏదైనా విషయంలో ఎదుటి వ్యక్తిని మనం ఒప్పించటానికి, వారి నుండి పూర్తి సమాచారం తెలుసుకొని, ఒక నమ్మకమైన వాతావరణంలో వారితో చర్చించగలగాలి. అలా ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి చర్చ ఎంతగానో సహాయపడుతుంది.
అందుకే మీ రోజువారీ జీవితంలో ఎక్కువగా చర్చలలో పాల్గొనండి, వీలైనంత వరకు చర్చని వాదనగా మారకుండా చూసుకోండి. అప్పుడు మీరు ఎన్నో కొత్తవిషయాలు నేర్చు కుంటారు. కొత్త బంధాలు ఏర్పరచుకుంటారు. అల్ ది బెస్ట్.