మన డబ్బుకి జబ్బు చెయ్యకుండా పెట్టుబడిగా ఎలా పెట్టాలి?

Update: 2019-07-18 12:09 GMT

ఫ్రెండ్స్! ఈ రోజు మనం చర్చించే అంశం..... మన డబ్బుకి జబ్బు చెయ్యకుండా పెట్టుబడిగా ఎలా పెట్టాలి?

ఈరోజులలో డబ్బు వలన లాభాలు ఏంటో తెలియని వారు, డబ్బు యోక్క ఉపయోగం తెలియని వారు, డబ్బు తీసుకురాగల సుఖాల గురించి తెలియని వారు చాల తక్కువ మందే ఉంటారని చెప్పవచ్చు.

కానీ అదే డబ్బు విలువ తెలిసిన వ్యక్తులు మన సమాజంలో ఎంత శాతం వున్నారని అడిగితే మాత్రం.....ఆ వ్యక్తుల శాతం చాలా తక్కువనే చెప్పాలి. మీకు డబ్బు యొక్క ఉపయోగంకి మరియు విలువకి ఏమిటి వ్యత్యాసం అని మీకు అనుమానం రావచ్చు. ఆ వ్యత్యాసం ఏంటంటే.... ప్రస్తుత పరిస్థితుల్లో ఒక కిరణా కొట్టుకి వెళ్లి చాక్లెట్ తీసుకోవాలన్న, ఆ షాప్ లోని వ్యక్తికి డబ్బు ఇవ్వవలసి ఉంటుందని చిన్న పిల్లవాడికి కూడా తెలుసు. కాని అదే పిల్లవాడికి ఈ డబ్బులు ఎలా సంపాదించడం, దాని వెనక కృషి, దాని ఉత్పత్తి గురించి, దానిని పెట్టుబడిగా పెడితే వచ్చే ఫలితాల గురించి తెలియక పోవచ్చు. ఇలాంటి విషయాలు మనకు ఎ పాటశాల తరగతి గదిలో కూడా చెప్పట్లేదు లేదా కాలేజి చెప్పట్లేదు, విశ్వవిద్యాలయాల్లో కూడా డబ్బుకి సంబంధిచిన పాటలు చాల తక్కువే అని చెప్పాలి. కాని చాలామంది విద్యార్థులను, ఉద్యోగులను వారు చేస్తున్న పని ఎందుకు చేస్తున్నారు అని అడిగితే మాత్రం... చాలామంది చెప్పే సమాధానం... డబ్బు కోసమని.

ప్రస్తుతం వున్న స్థితిలో మార్కెట్లో, డబ్బు వాడనిదే ఎలాంటి అమ్మకాలు కొనుగోళ్లు జరిగే అవకాశాలు లేవు కదా! అలాగే మనకి కావాల్సిన ఏ సేవ పొందాలనుకున్న కూడా ఈ రోజు చాలా అవసరం అయినది డబ్బు. మన రోజువారి అవసరాలలో డబ్బు ఒక అత్యంత ముఖ్యమైన అంశంగా మారింది. ప్రతి వ్యక్తి దగ్గర కొంతైన డబ్బు ఉంటేనే బయటికి వెళ్లే పరిస్థితులు వచ్చేసాయి. ఈరోజుల్లో ఒక గ్లాస్ మంచి నీరు కావాలన్నా కూడా డబ్బులు పెట్టి కొనుకోవల్సిందే కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ డబ్బు గురించి ఎంత తెలుసుకుంటే అంత మంచిది.

ఈ రోజుల్లో మనకు కావలసిన డబ్బు సంపాదించడానికి రకరకాల దారులు ఉన్నాయి, డెలివరీ బాయ్ నుండి క్యాబ్ డ్రైవర్ వరకు.... మొబైల్ షాప్ రిపేర్ వ్యక్తి నుండి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ వరకు వారి వద్ద వున్నా నైపుణ్యాన్ని, శ్రమని, కృషిని వాడి, ఎదుటి వ్యక్తికి కొంత విలువని అందించి, దానికి సమానంగా డబ్బుని సంపాదిస్తున్నారు. అయితే ఎవరికీ ఏ విషయంలో అయితే నైపుణ్యం, ప్రావిణ్యత ఉందో వారు ఆ పనిలో ఎక్కువ విలువ అందిచగలుగుతున్నారు. దీనే మనం స్పెషాలై జేషన్ అని అంటున్నాము. ఈ స్పెషాలైజేషన్ వుండటం ద్వార ఎక్కువ డబ్బు సంపాదిచ గలుగుతున్నారు. అయితే ఇలా డబ్బుని ఎక్కువ సంపాదించిన వారు అందరు ధనవంతులు అవుతున్నారా అని చూస్తే................సమాదానం "లేదు" అని చెప్పాలి.

మరి ఎక్కువ డబ్బులు సంపాదించినా కూడా ధనవంతులు ఎందుకు కావట్లేదు అంటే, డబ్బు సంపాదించటం నాణానికి ఒక వైపు అయితే దానిని కాపాడటం, పెంపొందించడం నాణానికి మరో వైపు కాబట్టి. మనం ఎక్కువ డబ్బు సంపాదించిన కూడా, ఆ డబ్బుని కొంత మిగుల్చుకుని, కొంత పొదుపు చేసి, ఆ పొదుపు చేసిన డబ్బు ని సరైన విధంగా పెట్టుబడిగా మార్చుకోలేకపోతే మాత్రం............ఎంత డబ్బు సంపాదించినా ఆ వ్యక్తి ఒక ధనవంతుడు కాలేడు ఎందుకంటే తను సంపాదించిన డబ్బంతా తన అవసరాలకి తన లైఫ్ స్టైల్కి ఖర్చుపెట్టేస్తాడు కాబట్టి, మరి ఈ సమస్య నుండి ఎలా భయటపడాలో ఇప్పుడు చూద్దాము.

ఎక్కువ డబ్బు సంపాదించడం వలెనే ఎవరు ధనవంతులు కాలేరు. సంపాదించిన డబ్బును ఒక ప్రణాళిక ప్రకారం, మీ ఆర్ధిక అవసరాల ప్రకారం సరైన విధంగా, ఒక పెట్టుబడి గా మీరు మార్చాలి. దానికోసం...

మొదటి మెట్టు.... మీ ప్రస్తుత నెట్ వర్త్ ఎంతో మీరు తెలుసుకోవాలి. మీ నెట్ వర్త్ అంటే...ప్రస్తుతం మీ ఆర్ధిక పరిస్థితి ఎలా వుందో తెలుసుకోవడం. మీ నెట్ వర్త్ తెలియాలంటే మీ ఆస్తులు, మీ పెట్టుబడుల్లోనుండి మీ అప్పులు, ఖర్చులు తీసివేస్తే వస్తుంది, ఇది మీ ఆర్ధిక పరిస్థితి అని అర్ధం.

రెండవ మెట్టు....మీ ఆర్ధిక లక్ష్యాలు ఏంటో మీరు నిర్ణయించుకోవాలి. అది ఒక ఇల్లు కట్టుకోవడం అయివుండవచ్చు, కార్ కొనుక్కోవటం అయివుండవచ్చు, లేదా కూతురు పెళ్లి చేయటం, ప్రపంచ విహారం అయికూడా ఉండవచ్చు...వీటి కోసం మీకు ఎంత డబ్బు భవిష్యత్తు లో అవసరము ఉంటుందో నిర్ణయించుకోండి.

మూడవ మెట్టు............ ఇప్పుడు మీ ఒక్కో ఆర్ధిక లక్షనికి ఎంత డబ్బు కావాలి, మరియు ఎప్పటివరకు కావాలి అని ఆలోచించి ప్రణాళిక వేసుకోండి. ఇలా నిర్ణయిస్తున్నప్పుడు ద్రవ్యోల్భానాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి.

నాలుగవ మెట్టు..... మీ డబ్బుని పెట్టుబడిగా పెట్టడానికి మీరు ఎంత రిస్క్ తీసుకోగాలరో ఆలోచించండి, ముఖ్యంగా ఇది మీ ఆదాయం, మీ మీద ఆధారపడిన వారు, మీ వయస్సు లాంటి విషయాలపై కూడా ఆధారపడి ఉంటుది.

ఐదవ మెట్టు.... ఇప్పడు మీ రిస్క్ తీసుకొనే స్వభావాన్ని బట్టి ఈక్విటీ మార్కెట్ లోనే, రియల్ ఎస్టేట్ లోన, లేదా బ్యాంకు ఫిక్స్డ్ డీపాజిట్, లేదా పోస్ట్ ఆఫీస్ లో నైన పెట్టుబడి పెట్టవచ్చు.

ఆరవ మెట్టు: మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టిన కూడా, ప్రతి మూడు నెలలకి ఒక సారి వాటి పరిస్థితి ఏంటో పరిశీలిస్తూ వుండండి, ఏదైనా మార్పులు, చేర్పులు అవసరం వుంటే, దాని ప్రకారం చర్య తీసుకోండి.

సో ఫ్రెండ్స్.....మనం ఎక్కువ డబ్బులు సంపాదించడం ద్వారానే ధనవంతులం కాము అని గుర్తుకు పెట్టుకోండి, మన సేవింగ్స్ మరియు పెట్టుబడులే మనని ధనవంతులను చేస్తాయి. వీటి గురించి ఇంకా వివరంగా వచ్చే వ్యాసాలలో చూద్దాము. అల్ ది బెస్ట్.  

Tags:    

Similar News