ఫ్రెండ్స్! ఈ రోజు మనం చర్చించే అంశం "ఎక్కువగా ఆలోచించకుండా ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు"?
జీవితంలో ఏ మనిషికైనా అత్యంత ఆనందాన్ని ఇచ్చే రెండు గొప్ప ఆస్తులు ఏంటో మీకు తెలుసా ఫ్రండ్స్! వీటిన వారి ఆస్తిగా చాలామంది అనుకోకపోవచ్చు. కాని ఇవి లేని వారికీ వీటి ప్రాముక్యత తెలుస్తుంది. ఆ ముఖ్యమైనవి రెండు ఆస్తులలో ఒకటి మనశ్శాంతి, రెండు సంతృప్తి. ఈ రెండు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వారిని చాలా అదృష్టవంతులుగా మనం పరిగణించవచ్చు.
అయితే కొద్దిమంది ఎలాంటి ఆలోచనలు లేని స్థితిని మాత్రమే, వారి మన శాంతి అని అనుకుంటారు. ఎందుకంటే వారు ప్రతి విషయాన్ని ఎక్కువగా అలోచించి, ఉహించి ఇబ్బంది పడుతుంటారు, భవిష్యత్తు గురించి భయపడుతుంటారు లేదా గతం తలచుకొని బాధపడుతుంటారు, కాబట్టి ఈ ఆలోచనలు లేకుంటే బాగుంటుంది అనుకుంటారు. కానీ వాస్తవానికి ఆలోచించడం అనేది మనిషికి ఉన్నఒక గొప్ప వరం. మరి ఇంత గొప్ప వరం వీరికి మాత్రం శాపంలా ఎందుకు అనిపిస్తుంది అని మీకు అనుమానం రావచ్చు. అలా ఎందుకంటే...ఈ ఆలోచించడమే ఎక్కువగా అవ్వడం వల్ల, ఆ ఆలోచనలు వారికి ఒత్తిడిని సృష్టించడం వల్ల, ఆ ఆలోచనలో వారికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు, దీనినే మనం అతిగా ఆలోచించటం అంటాము.
అయితే జంతువుకి మనిషికి ఉన్న ముఖ్య వ్యత్యాసం ఆలోచించడమే కదా, మనం అలోచించి ఒక ప్రణాళికని, ఒక పద్దతిని తయారుచేసుకోగలం, కాని జంతువులు అలా చెయ్యలేవు కదా! మరి అలాంటి ఆలోచించడం వల్ల మనిషికి ఎందుకు ఇబ్బంది వస్తుంది అని చూస్తే, ఆ ఇబ్బంది రావటం ఆలోచన తప్పు కాదు అని తెలుస్తుంది, ఆలోచించడం అనేది ఒక అద్భుతమైన వరం అని తెలుస్తుంది, ఎందుకంటే ఈరోజు మనం వాడుతున్న టీవీ, ఫోన్, కార్స్ ఇలా ఏవి చూసిన అవన్నీ మనిషి ఆలోచనలో నుండి పుట్టినవే కదా! ఈ అద్భుతాలు కనిపెట్టిన, ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా, వాటన్నిటికీ మూలకారణం మనిషి ఆలోచనలే.
కానీ కొద్ది మంది వారి ఆలోచనలతో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే, వారి ఆలోచనలు వారి చేతిలో లేవు, వారి ఆలోచనలే వారిని ఇబ్బందిని గురిచేస్తున్నాయని వారు ఫీల్ అవ్వటం వలన.
ఉదాహరణకి వారికి సంతోష పెట్టే ఆలోచనలో, ఆనందం ఇచ్చే ఆలోచనలు ఎక్కువగా వస్తే ఎవరి కూడా ఎక్కువగా ఆలోచించవద్దు అని అనుకోరు కదా! కానీ వారికి వచ్చే ఆలోచనలు వారిని ఇబ్బంది పెట్టే విధంగా ఒత్తిడికి గురిచేసే విధంగా ఉండడం వల్లనే ఎక్కువగా ఆలోచించడం వల్ల ఇబ్బంది పడతారు. అందుకే ఇలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉంటే చాలు అని అనుకుంటారు. దాని కోసం రకరకాల అలవాట్లు కూడా చేసుకుంటారు. ఎలాంటి ఆలోచనలు రాకుండా ఉండటం వల్ల ప్రశాంతత అనిపిస్తుందేమో, కానీ దానివల్ల పెద్దగా ఏమీ ఉపయోగం లేదు. మనం చేయాల్సిందల్లా, మన మనసులోని మన ఆలోచనలు మన లక్ష్యం వైపు మళ్ళించ గలగాలి, అలాగే మనకు ఎ ఆలోచనలు వస్తే లాభమో వాటినే ప్రోత్సహించాలి, కాబట్టి దీని కోసం మన మనసుకి కొంత శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలా శిక్షణ ఇవ్వటం కోసం ఐదు పద్దతులు మనకి బాగా సహాయపడుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాము.
మొదటిది.... మీ ఆలోచనలు పరిశీలించండి: మీకు ఎక్కువ ఆలోచనలు వచ్చి మీరు ఇబ్బంది పడుతూ వుంటే, ముందుగా మీరు చేయాల్సింది అసలు మీకు ఎలాంటి ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయో పరిశీలించండి. దానికోసం ప్రతి రోజు కొన్ని నిముషాలు ఒక దగ్గర ప్రశాంతంగా కూర్చొని మీ ఆలోచనలను పరిశీలించండి. ఇలా చెయ్యడం వలన మీకు, మీ ఆలోచనలకూ కొంత దూరం పెరుగుతుంది, దానివలన వాటి ప్రభావం మీ మీద తగ్గుతుంది. ఇది ఎలా అంటే... మీరు ట్రాఫిక్ జామ్ లో వున్నప్పుడు మీకు చాల చికాకు, కోపం రావచ్చు, కాని అదే ట్రాఫిక్ జామ్ని మీరు ఒక ఎతైన ప్రదేశం నుండి, లేదా ఒక అపార్ట్ మెంట్ పై నుండి చూస్తే ఆ ట్రాఫిక్ జామ్ కూడా లైట్స్ తో అందంగా కనపడుతుంది కదా, అలాగే మీ ఆలోచనలు అబ్జర్వ్ చెయ్యడం వలన జరుగుతుంది, కాబట్టి మీ ఆలోచనలు పరిశీలించడం మొదలెట్టండి.
రెండోది..... ఎ ఆలోచనలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయో గుర్తించండి. ఆ తర్వాత ఆ ఇబ్బంది పెట్టె ఆలోచనలకి మూలం ఏంటో ఆలోచించండి, అది ఎ పరిస్థితిలో వస్తుందో గుర్తించండి.
మూడోది... మీరు గుర్తించిన ఆ పరిస్థితిని ఎలా మార్చవచ్చో ఆలోచించండి. ఆ పరిస్థితిని మార్చడం కోసం ఎ పనులు చెయ్యాలో వాటిని ఒక పేపర్ పై రాసుకోండి.
నాలుగోది.... ఒక వేళ ఆ పరిస్థితి ని మర్చలేకపోతే, అది మీరు మార్చలేని పరిస్థితిని అంగీకరించండి. అలా అంగీకరించడం వలన కొంత ప్రశాంతతని మీరు తప్పక పొందుతారు. చివరిది.....
ఐదవది..... మీ లక్ష్యం గురించిన ఆలోచనలు ఎక్కువగా చెయ్యండి. ఎప్పుడైతే మీ ఆలోచనలు లక్ష్యం వైపు పరిగేడుతాయో అప్పుడు మీ ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు.
ఇప్పటివరకు మనం చర్చించిన విషయాలు మీరు ఆచరణలో పెట్టడం ద్వార...ఇన్నిరోజులు మీ మనస్సు మిమ్మల్ని వాడుకున్న కూడా, ఇక మీరు మీ మస్సుని వాడుకోగలరు. అల్ ది బెస్ట్.