ఫ్రెండ్స్ సమయం లేదు...సమయం లేదు...అని కొద్దిమంది బాధపడుతు వుంటారు, కాని ఆ సమయాన్నే, వారు ఎలాంటి భాధ, స్పృహ లేకుండా వృధా చేస్తుంటారు.
చాలామంది గుర్తించని విషయం ఏంటంటే... సమయం అందరికి ఒకేలా ఉంటుందని, అందరి విషయంలో సమయం...సమన్యాయాన్నే పాటిస్తుంది అని, కాలం కదులుతూనే ఉంటుందని. గాలిని ఒక సీసాలో బంధించనట్టు, మన సమయాన్ని ఒక సీసాలో బంధించలేము. రేపటి కొరకు ఎ బ్యాంకు లాకర్లో కూడా దాచుకోలేము. ఈ నిమిషం...వెళ్లిందంటే..ఎప్పటికి వెళ్ళినట్టే.
సమయము గురించి...చాల చక్కగా...ప్రేమాభిషేకం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు పాడినట్టు,
ఆగదు... ఆగదు.. ఆగదు.. ఆగదు ఏ నిముషము నీ కోసము..
ఆగితే సాగదు ఈ లోకము.... అని.
ఫ్రెండ్స్ నిజమే కదా! ఒక్క నిమిషం కూడా కాలచక్రంలో ఎవ్వరికోసం ఆగదు, కాలం క్రమశిక్షణతో తన పని చేసుకుంటూపోతుంది, ఆ కాలానికి విలువ ఇవ్వని వ్యక్తికి ఓటమి అనే శిక్ష మాత్రమే మిగులుతుంది.
ఫ్రెండ్స్ చాలామంది ఎన్నో ముఖ్యమైన పనులు చెయ్యడానికి కూడా సమయం లేదు అని అంటుంటారు. వాస్తవానికి సమయం అనేది బీలియనీర్ కైనా, బిచ్చగాడి కైనా సమానంగానే వుంటుంది, ప్రతి రోజు ఇరవై నాలుగు గంటలే కదా, సో ఈ కాలాన్ని మనం ఎలా వాడుకుంటున్నాము అనేదే ముఖ్యము, సో ఈ కాలాన్ని సరిగ్గా వాడుకోవటానికి ఉపయోగపడే ముఖ్యమైన నాలుగు విషయాలు.
1. వాయిదా పై వాయిదా వేస్తూ వెళితే ఎలా!
"టైం ఇస్ మనీ" అని మీరు వినే వుంటారు, అయితే ఎదైన వస్తువుని మనం కొంటున్నప్పుడు, దానికి చెల్లించే డబ్బులు వాయిదా పద్దతిలో కడితే బాగానే వుంటుంది, కాని జీవితంలో చెయ్యాల్సిన ముఖ్యమైన పనులకి వాయిదా పద్ధతి మంచింది కాదు.
అయితే కొద్దిమంది వ్యక్తులు తము చేయాల్సిన ముఖ్యమైన పనులను కూడా వాయిదా వేస్తూ ఉంటారు. ఆ తర్వాత చేద్దాంలే అని అనుకుంటారు, కాని తిరిగి ఆ సమయానికి మల్లి ఆ పని చెయ్యడాన్ని వాయిదా వేస్తారు.
అలా ఎందుకు చేస్తారు అని చూస్తే కొద్ది మందికి, వారు చెయ్యాల్సిన పనిలో సక్సెస్ రాదేమో అని భయపడటం కూడా ఒక కారణం కావచ్చట. అలా ఫియర్ అఫ్ ఫెయిల్యూర్ వున్నవారు తమ పనిని వాయిదా వేయడం చాలా సహజంగా జరుగుతుంది. మరికోద్దిమందికి బద్దకమే వారి బలహీనతట. ఈ రెండిటికి విరుగుడు వాయిదా పై యుద్ధం ప్రకటించి... ముఖ్యమైన పనుల విషయంలో, ఆ నిమిషంలో, ఆ ప్రాంతంలోనే ఒక అడుగు ముందుకి వేయాలి.
2. ప్రాధాన్యతని పదిలంగా పట్టుకోని పాటించాలి.
మనలో చాలామంది అర్జెంటు గా చెయ్యాల్సిన పనులకి, ప్రాముఖ్యత కలిగిన పనులకి వ్యత్యాసం గుర్తించారు. ఎ పనికైతే తక్కువ సమయం వుందో, ఆ పని చేస్తూవెళతారు. అయితే ముందుగా మనం తక్షణమే చేయాల్సిన పనికి, ప్రాముఖ్యత కలిగిన పనికి, ఉన్న వ్యత్యాసం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. చాల సందర్భాల్లో తక్షణమే చేయాల్సిన పని మనకి అత్యంత ముఖ్యమైన అనిపిస్తుంది. అలా గడియరంతో పోటి పడుతూ పరిగేడుతాం. కాని ఎలాంటి గొప్ప విజయాన్ని పొందలేము.
ఒక రైల్వే స్టేషన్ లో ఈ ట్రైన్ ముందుగా వస్తే ఆ ట్రైన్ మనం ఎక్కంకదా, మన గమ్యానికి తీసుకెళ్ళే ట్రైన్ మాత్రమే ఎక్కినట్టు, ఒక పని అర్జెంటు అయినంత మాత్రాన తన జీవితాన్ని ఉపయోగపడాల్సిన అవసరం ఏమీ లేదు అని గుర్తించాలి. అది మన లక్ష్యానికి ముఖ్యమైనది కాకపోవచ్చు, కాబట్టి మన లక్ష్యానికి చేయాల్సిన పనులను ముందుగా నిర్ణయించుకోవాలి.
3. కాలాన్ని పెట్టుబడిగా పెట్టె దారి కనిపెట్టాలి.
ఎ పని చెయ్యాలన్న ఆ పనికి కొంత సమయం, శక్తి మనం ఖర్చుచెయ్యాల్సి వుంటుంది కదా, అయితే డబ్బులని ఖర్చు పెట్టడానికి, పెట్టుబడిగా పెట్టడానికి వున్నా వ్యత్యాసం లాగానే, మన సమయాన్ని ఈ నిమిషం దుబారాగా ఖర్చు పెట్టవచ్చు, లేదా మన లక్ష్యాలకు, భవిష్యత్తుకు పెట్టుబడిగా పెట్టవచ్చు, అయితే ముందుగా మనం సరైన విధంగా కాలాన్ని పెట్టుబడి పెట్టడం నేర్చుకోవాలి. ఎలా అయితే ఒక రైతు తన పొలంలో ఎలాంటి పంట పండిద్దాం అనుకుంటే, అలాంటి పంటకు సంబంధించిన విత్తనాలు నాటినట్టు, మన జీవితంలో కోరుకునే ఫలితాలకు తగ్గట్టుగానే, మన లక్ష్యాలకు సంబంధించిన పనులపై, మన సమయాన్ని పెట్టుబడిగా పెట్టాలి, అందుకోసం మన జీవితంలో ఎలాంటి ఫలితాలు కావాలో ముందుగా నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత పెట్టుబడిగా మన సమయాన్ని ఖర్చు చెయ్యాలి.
4. మన తిప్పలు తగ్గాలంటే "అప్పగింతలు" అవసరం.
ఫ్రెండ్స్ కొద్దిమంది పర్ఫెక్షన్ అనే పేరుతో అన్ని పనులు వారే చేయ్యలనుకుంటారు, అనవసరంగా ప్రతి పని వారే చేయాలనుకున్నప్పుడు వారి దగ్గర సమయం సరిపోదు, కాబట్టి వారు కోరుకునే అన్ని పనులు చేయలేకపోతారు. ఈ సమస్య నుండి బయటపడటానికి, ఒక మంచి దారి సమర్దులైన ఇతరులకు మన పనిలోని కొంత బాగాన్నివారికీ అప్పగించడం. ఒక క్రమ పద్ధతిలో సరైన వ్యక్తికి ఈ విధంగా కొంత పనిని, బాధ్యతని అప్పగించడం ద్వారా మీ సమయాన్ని మీరు సేవ్ చేసుకోవచ్చు. ఆ మిగిలిన సమయంలో ఇతర ముఖ్యమైన విషయాలపై మీరు వాడుకోవచ్చు. ఇలా అప్పగించడం నేర్చుకోవడం వల్ల సమయానికి సంబంధించిన ఒత్తిడిని తగ్గిచ్చుకోవచ్చు.
ఫ్రెండ్స్ చివరిగా,
కాలం అంటే గోడపై కనపడే క్యాలెండరు కాదు, కాలం అంటే చేతికి పెట్టుకొనే గడియారం కాదు...కాలము అంటే " జీవిత అనుభూతుల వాహకం అని గుర్తించాలి, ఎప్పుడైతే మనం, మన ముందు వున్న క్షణాలను సరిగ్గా వాడుకుంటామో, అప్పుడు మన నిముషాలు, గంటలు, రోజులు అన్ని సరిగ్గానే వాడుకోబడుతాయి. ఒక చనిపోయిన వ్యక్తి యొక్క ఫోటో ని చూస్తే...అతని ఫోటో లో క్రింద బాగంలో రెండు డేట్స్ వుంటాయి కదా...అవి ఒకటి అతని పుట్ట్టిన రోజు, మరి యొకటి అతను మరణించిన రోజు వుంటుంది కదా, అంటే ఆ సమయమే అతని జీవితానికి కొలమానం అని అర్ధం, ఆ సమయాన్ని ఆ వ్యక్తి ఎలా వాడుకున్నాడు అనేదే అతని జీవిత విజయానికి అర్ధం కదా. సో ఫ్రెండ్స్ మీ సమయాన్ని సరైన విధంగా వాడుకోండి. ఆల్ ది బెస్ట్.