ఫ్రెండ్స్ ! ఈ రోజు మనం చర్చించే అంశము.... దిమాక్తో కష్టాన్ని, దిల్తో ఇష్టాన్నిఎలా గెలవవచ్చు?
ఫ్రెండ్స్ జీవితంలో ప్రతి మనిషికి ఎప్పుడో, ఒకప్పుడు ఏదో ఒక సమస్య రావచ్చు. అయితే ఎవరైతే వారి సమస్యలని దైర్యంగా ఎదుర్కుంటారో, ఎవరితే సజావుగా ఆ సమస్యని పరిష్కరిస్తారో, వారె విజేతలుగా నిలుస్తారు. కాని చాలామంది వారి సమస్యలని పరిష్కరించుకోలేక...ఆ "సమస్య" అనే సుడిగుండంలోనే...మునిగి తేలుతూ..కొట్టుకుంటూ వుంటారు.
కాని అదే వ్యక్తి, తన యొక్క ఫ్రెండ్స్ కి, లేదా బంధువుకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం, తను చాల మంచి సలహా లేదా చక్కటి పరిష్కారాన్ని చూపవచ్చు. కానీ అదే సమస్య తనకి వస్తే మాత్రం, ఆ సమయంలో అంత మంచి పరిష్కారాన్ని, తను ఆలోచించలేకపోతాడు.
ఫ్రండ్స్ ఇలా మీకు ఎప్పుడైనా అయ్యిందా? ఇలా మనకి కూడా కావచ్చు. మనం ఇతరులకి అద్బుతమైన పరిష్కారాలు చెప్పగలం, కాని మన సమస్యకి పరిష్కారం మాత్రం, మన బ్రెయిన్ అనే కంప్యూటర్ నుండి తీసుకోలేం, ఇలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా.
ఇలా ఎందుకు జరుగుతుంది అంటే.. సమస్య మనది అయినప్పుడు, ఆ సమస్య యొక్క తీవ్రత మన ఫీలింగ్స్ ని, ఎంతో ప్రభావితం చేస్తుంది. ఆ సమయములో..మనం ఆ సమస్యని ఒక పాత్రదారుడిగా మోస్తువుంటాము. అలాంటప్పుడు, ఒక రకమైన ఎమోషనల్ హైజాక్ అయిపోతం...దాని వల్ల మన బ్రెయిన్ అనే కంప్యూటర్ నుండి గొప్ప ఐడియా లు మన కోసము కూడా మనం తీసుకోలేకపోతాము. అంటే ఆ కష్టాన్నిమన "దిల్" మీదకి తీసుకోవడం వల్ల ఇదంతా.
ఉదాహరణకి మీరు వండర్లా వెళ్ళినప్పుడు, అక్కడ కొద్దిమంది ఒక రోలర్ కోస్టర్ ఎక్కారనుకొందాం, వారు అది ఎక్కి, భయపడుతుంటే వారిని చూసి మీకు నవ్వు రావచ్చు, కాని ఆ తర్వాత మీరు ఆ రోలర్ కోస్టర్ ఎక్కినప్పుడు, అది స్టార్ట్ కాగానే..కొంత ఉత్సాహం వున్నా, మీరు కిందికి చూస్తువుంటే...పక్కలకి చూస్తువుంటే ఒక రకమైన భయానికి, ఆందోళనకి, ఒత్తిడికి గురికావచ్చు. మీరు క్రింది నుండి చూసి ఎంజాయ్ చేసినవారు, మీరు ఆ పరిస్థితిలో వుంటే మాత్రం బయపడే అవకాశం ఉందికదా. అలా ముందు మనకి నవ్వు ఎందుకు వచ్చిందంటే....ఇతరుల సమస్యని పాత్రదారిలా కాకుండా....మనం ఒక ప్రేక్షకుడిలా చూస్తాము కాబట్ట్టి, ఎలాంటి ఎమోషనల్ హైజాక్కి గురికాము. అప్పుడు ఎదుటి వారి కష్టాన్ని మన "దిమాక్" తో మాత్రమే చూస్తాము. అందుకే ఆ సమయంలో మన మనస్సు ప్రశాంతంగా వుండి..మన బ్రెయిన్ కంప్యూటర్ నుండి అద్బుతమైన ఐడియాలు ఇస్తుంది.
మరి మన సమస్యలకి మన బ్రెయిన్ కంప్యూటర్ నుండి అద్బుతమైన పరిష్కారాలు తీసుకోలేమా? మన దిల్ మరియు దిమాక్ ని సరిగ్గా వాడుకోలేమా అని మీకు అనుమానం రావచ్చు.
మీ అనుమానం చాల సహజం. ఫ్రండ్స్ ఈ అనుమానం తీరాలంటే...NLP ( న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్) అనే సబ్జెక్టు లోని రెండు విషయాలు అర్ధం చేసుకుంటే, తప్పక మన సమస్యలకి కూడా మనం గొప్ప పరిష్కారాలు ఇచ్చుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాము.
ఈ విషయంలో NLP సబ్జెక్టు ప్రకారం, మనం ఒక సమస్య గురించి మన (మూడ్) మనోస్థితి ఒక "పాత్రదారిగా" వుంటే, ఆ మనో స్థితిని NLP లో "అసోసియేషన్ స్టేట్" అని అంటారు.
అలాగే మన మనోస్థితి ఆ సమస్య విషయంలో "ప్రేక్షకుడిగా" వుంటే "డిసోసియేషన్ స్టేట్లో" ఉన్నామని అంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఆ సమస్య యొక్క పాత్రదారిలా, అంటే "అసోసియేషన్ స్టేట్" లో వుంటే పరిష్కరించటం కొంత కష్టం.
అసలు ఈ "అసోసియేషన్ స్టేట్" పాత్రదారిలా వుంటానికి, "డిసోసియేషన్ స్టేట్లో" ప్రేక్షకుడిగా ఉండటానికి వున్నా వ్యత్యాసం ఏంటో ముందుగా అర్ధం చేసుకుందాము. అసలు "అసోసియేషన్ స్టేట్" లేదా పాత్రదారిలా ఉండటమంటే మీ సమస్యని మీరు గుర్తుకు తెచ్చుకున్నప్పుడు, ఆ సమస్యని మీ కళ్ళతో చూడటం లాంటిది. ఆ సమస్య విషయంలో మీరు ఒక బాగంలా ఫీల్ కావటం జరుగుతుంది. ఆ సమస్యని మనం ఒక పోషిస్తున్నపాత్రదారిలా మునిగిపోయాం అని అర్ధం. అంటే ఆ సమస్యని మన కళ్ళతోనే చూస్తున్నాము, మన చేవులతోనే వింటు పూర్తిగా ఆ సమస్యని ఫీల్ అవుతున్నామని అర్ధం. ఒక నాటకంలో స్టేజి పై జీవిస్తున్న పాత్రదారిలా మీరు వున్నట్టు.
కొన్ని సార్లు ఏదైనా సమస్యని పరిష్కరించడానికి, అవుట్ అఫ్ ది బాక్స్ ఆలోచించాలి అంటారు కదా. అలా "డిసోసియేషన్ స్టేట్లో" లేదా ప్రేక్షకుడిలా, అంటే మీ సమస్యని మీరు గుర్తుకు తెచ్చుకున్నప్పుడు, దానికి సంబందించిన అన్ని విషయలు, మీరు ఒక సినిమా తెరపై, లేదా నాటకం స్టేజి పై చూస్తూ, వింటు, అదే సమయంలో మిమ్మల్ని కూడా మీరు ఆ స్టేజి పై చూడగలుగుతారు. సినిమాల్లో హీరో నుండి తన అంతరాత్మ బయటికి వచ్చి మాట్లాడినట్టు.
అంటే ప్రస్తుత మీరు సినిమా హాళ్ళో ఒక కుర్చీలో హాయిగా కూర్చొని వుంటే. సినిమాల్లో చూపెట్టినట్టు...మీలోనుండి మరో వ్యక్తి...మీలాగే వున్నా వ్యక్తి...ఆ సినిమా తెరపైకి వెళ్లినట్టు ఉహించండి, అలాగే ఆ సమస్యని ఆ సినిమా తెరపై ఎదురుకుంటున్నట్టు చూడండి. అంటే స్టేజి మీద వున్నా మరో మీరు, తన సమస్యని ఎలా ఎదుర్కుంటునాడో, కుర్చీలో కూర్చున్న మీరు చూస్తున్నారు. అలా ఎప్పుడైతే ఒక ప్రేక్షకుడిలా మిమ్మల్ని, మీ సమస్యని మీరు చూస్తారో, అప్పుడు మీలో ఎలాంటి ఎమోషనల్ హైజాక్ జరగదు, అందువల్ల చాల తార్కికంగా, సృజనాత్మకంగా కుర్చీలో కూచున్న మీరు ఆలోచించి, ఒక పరిష్కారాని కనిపెట్టగలరు.
ఫ్రండ్స్! ఇప్పుడు ఈ రెండు విషయాల మద్య మనకి వ్యత్యాసం తెలిసింది కాబట్టి, మనకి ఎలాంటి సమస్య వచ్చిన, కష్టం వచ్చిన అప్పుడు ఆ సమస్యని "డిసోసియేషన్ స్టేట్లో" అంటే ఒక ప్రేక్షకుడిలా చూడగలగాలి. అప్పుడు ఆ సమస్యని మన దీమాక్ తో చాల చక్కగా పరిష్కరించగలం. ఇలా ఎ సమస్యనైన, కష్టాన్నైనా దూరం నుండి చూడటం వల్లా సరైన పరిష్కారాన్ని మన బ్రెయిన్ కంప్యూటర్ లో నుండి తియ్యగలం. ఇలా చెయ్యడం వల్ల, మన గత తప్పుల నుండి ఎంతో నేర్చుకోగలం, అలాగే ఏదైనా విషయంలో మనకి ఫోబియా, లేదా ఫియర్ వుంటే కూడా ఇలా "డిసోసియేషన్ స్టేట్లో" మనని చూసుకుంటే, ఆ భయాన్ని త్వరగా జయించగలం.
అలాగే మీకు ఇష్టమైన విషయాల్లో, సంతోషకరమైన విషయాల్లో, లేదా మీరు సాదించాలి అని అనుకునే లక్ష్యం విషయంలో మాత్రం.. పూర్తి "అసోసియేషన్ స్టేట్" లేదా పాత్రదారిలా చూడాలి, వినాలి, ఫీల్ కావలి. ఏదైనా మీకు ముఖ్యమయిన పని చెయ్యడానికి కూడా ఈ "అసోసియేషన్ స్టేట్" మనకు ఉపయోగపడుతుంది. ఆ పనిని మీరు చేస్తున్ననట్టు, మీ కళ్ళ ద్వారానే ప్రతిది చూస్తూ ఉహించడం ద్వార మీకు ఉత్సాహకరమైన మూడ్ వస్తుంది.
ఇలా చేసినప్పుడే మీలో ఉత్సాహం నిండి మీ లక్ష్యం వైపు పరుగులు పెడుతారు. ఇలా మీ దీమాక్తో మీ కష్టాలన్ని ప్రేక్షకుడిలా ఉహించి చూస్తే ఎన్నో మంచి పరిష్కారాలు మీకు వస్తాయి, అలాగే ఒక పాత్రదారిలా, మీ దిల్తో మీరు చెయ్యాలనుకున్న పనులను, మీ లక్ష్య సాధనలో ఒక్కో అడుగు వేస్తున్నట్టు...మీ ఇష్టాలన్ని చూడగలిగితే, వాటిని తప్పక జయించగలరు. అల్ ది బెస్ట్.