"ప్రతి విషయాన్నీ మీ మనసుపై తీసుకోకుండా ఎలా ఉండవచ్చు".

Update: 2019-06-11 06:58 GMT

ఫ్రెండ్స్! ఈ రోజు మనం చర్చించే అంశం... "ప్రతి విషయాన్నీ మీ మనసుపై తీసుకోకుండా ఎలా ఉండవచ్చు".

మన జీవితంలో మనని ఇబ్బందికి, ఆందోళనకి, ఒత్తిడికి గురిచేసే సంఘటనలు, పరిస్థితులు మరియు మనుషులు వచ్చినప్పుడు, ఆ సమయంలో మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాము అనేది చాలా ముఖ్యం, ఎందుకంటే ఆ వచ్చిన సమస్య మనల్ని ఎంత ఇబ్బంది పెడుతుంది అనే విషయాన్ని, మన యొక్క రెస్పాన్స్ మాత్రమే నిర్ణయిస్తుంది కాబట్టి.

ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో వున్నా, కొంత రిలాక్స్ అవ్వడం మనకి చాలా అవసరం. అయిందేదో అయింది అని ప్రశాంతంగా ఆలోచించడం చాలా ముఖ్యం. అలాకాకుండా ఆందోళన చెంది బాధపడుతూ అదే భావావేశంతో ఉంటే ఆ సమస్య తీవ్రత పెరుగుతుందే కానీ, తగ్గదు. అలాగని ఆ సమస్యని పరిష్కరించడం చాల సులువు అని అనట్లేదు. కానీ కొన్ని విషయాల సాధన చేయడం ద్వారా ఈ సమస్య యొక్క తీవ్రతను తగ్గించుకోవచ్చు.

ఒక బాధని లేదా సమస్యని తెలియకనే నాటకీయతని జోడించి పెంచుకోకుండా, త్వరగా మనం ఆ సమస్యనుండి బయట పడాలంటే మాత్రం, మనం కొన్ని చిట్కాలు అవలంబించడం చాలా అవసరం. అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం.

. ముందుగా ఈ సమస్య వాళ్ళ "ఎక్కువలో ఎక్కువ ఏమి జరుగుతుంది" అని ఆలోచించడం చాలా ఉపయోగపడుతుంది. ఏం జరుగుతుంది అని ఆలోచించడం ద్వార ఒక స్పష్టత అయితే వస్తుంది, అలాగే వాస్తవానికి మీరు ఆందోళన చెందుతున్న అంతగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదని మీకు అర్ధం అవుతుంది.

. మీ చిరునవ్వునే మీ అస్త్రంగా చేసుకోండి. మీ చిరునవ్వు మిమ్మల్ని అందంగా మార్చుతుంది. మీరు అద్దంలో చూసుకున్నప్పుడు కాని, అలాగే చిరునవ్వుతో ఇతరులను చూసినప్పుడు కానీ, మీ మొహంపై ఆ చిరునవ్వు ఉండడం వల్ల మీ ఆలోచనలు మరియు మీ మానసిక స్థితి మాత్రమే కాకుండా ఇతరులకు ఆలోచనలు, మానసిక స్థితి కూడా మారుతాయని ఎన్నో పరిశోధనలు నిరూపించాయి.

. ప్రతి పరిస్థితిలోను, సంఘటనలోను, మరియు ప్రతి సందర్భంలో హాస్యాన్ని చూడడం అలవాటు చేసుకోండి. అది ఎలా అంటే.. ఉదాహరణకి ఒక ట్రాఫిక్ జామ్ లో మీరు ఇరుక్కుంటే, అక్కడ వున్నా ట్రాఫిక్ పోలీసులు గాని, లేదా మిగిలిన వాహనదారులను కానీ లేదా ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ కూర్చున్న వారిని కానీ, ఇలా అటు ఇటు పరిశీలిస్తూ, గమనిస్తూ అందులోని హాస్యాన్ని, అక్కడ జరుగుతున్న వింత, హాస్య, సంఘటనలను ఆస్వాదించవచ్చు.

. చాలామంది ఎప్పుడు వారి గతంలోని విషయాల గురించి కాని, లేదా భవిష్యత్తుకి సంబంధించిన భయాలతో గాని వుంటారు. అలా భవిషత్తు ఆలోచనలైన, గతంకి సంభందించిన ఆలోచనలైన మీ ఈ క్షణాన్ని దోచుకోవ్వద్దు, అలా జరగవద్దు అనుకుంటే మీరు ఈ క్షణంలో,ఈ ప్రదేశంలో జీవించడం అలవాటు చేసుకోండి. అలాగే మీరు ఎక్కడైతే ఉన్నారో, ఆ ప్రాంతంలోనీ పూర్తి లగ్నం కండి, అప్పుడు, అక్కడ జరిగే విషయాన్ని పూర్తిగా ఆస్వాదించడం చాలా ముఖ్యం. అప్పుడే ఆ నిమిషంలోని ఆనందాన్ని మీరు పొందుతారు.

. ఒక పని చెయ్యాలి, చెయ్యలి అని అనవసరంగా ఆలోచిస్తు సమయాన్ని వృధా చెయ్యకండి, ఆ ఆలోచించే పనిని చేసేయండి. ఎందకంటే కొన్ని పనులు అలా పెట్టడం వల్ల లేదా పోస్ట్ ఫోన్ చేస్తూ ఉండడం వల్ల మన పని గురించి ఆలోచించాల్సి వస్తూ ఉంటుంది కానీ ఆ పని మనం చేయము. అలా కాకుండా మీరు ఏ పనులు అయితే చేయగలుగుతారు ముందుగా వాటిని చేసేయండి. ఒక్కసారి ఆపని చేస్తే దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు కదా. అలాగే ఎన్నో సమస్యలకి మనం చేసే పనే పరిష్కారం అవుతుంది.

. మీరు మీ స్నేహితులు చెప్పే సమస్యల గురించి వినండి అర్థం చేసుకోండి కానీ వారి సమస్యలను, అలాగే ఇతరుల సమస్యలను మీ సమస్యలుగా ఫీల్ అయ్యి ఇబ్బంది పడకండి. వారి సమస్యల గురుంచి మీరు భాదపడ్డ వారికి ఏమీ ఉపయోగం లేకపోవచ్చు అలాగే మీరు అనవసరంగా ఒత్తిడికి కూడా గురవుతారు. కాబట్టి ఇతరుల సమస్యలు విన్నప్పుడు మీకు అవకాశం వుంటే సహాయం చెయ్యండి, లేదా సలహా ఇవ్వండి కాని వారి సమస్య గురంచి ఎక్కువగా బాధ పడకండి.

. మరి ఎక్కువగా న్యూస్ చూడడం, లేదా చదవడం చేయకండి. కొంత ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవడం మంచిదే కానీ ప్రతి తప్పు గురుంచి, ప్రతి దొంగల గురించి, ప్రతి చెడు గురుంచి తెలుసుకొని ఒత్తిడి పెంచుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఈ మూలా ఎ నేరం, ఘోరం జరిగిన అది మన ఇంటి హల్లోనే చూస్తూ మన మనస్సుపై మ్పుద్రించుకోవాల్సిన అవసరం లేదు కదా. అందుకే న్యూస్ తక్కువగా చూడండి.

. మీ శరీర ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి ముఖ్యంగా సరైన నిద్ర పోవడం, సరైనా ఆహారం తీసుకోవడం చాల ముఖ్యం. అలాగే మరీ ఎక్కువ పనిచేసి ఇబ్బంది పడకుండా, అవసరమైన రిలాక్సేషన్ను, వినోదాన్ని కూడా పెంచుకుని అనారోగ్యాకరమైన అలవాట్లకు దూరంగా ఉండండి.

. అందర్నీ ఒప్పించాలని చూడకండి. అసలు అందర్నీ ఒప్పించడం మెప్పించడం అన్ని విషయాల్లో సాధ్యం కాదు. మీరు ఏమి చేస్తున్నారో అది మంచి పనా, లేదా చెడ్డ పనా ముందుగా మీరు ఆలోచించి ఒక నిర్ణయానికి రండి. ఆ తర్వాత మీరు ఏది చెయ్యగలరో దానిని బెస్ట్గా చేయండి.

. మీరు ఎలాంటి పరిస్థితి నుండి ఈ రోజు నేటి పరిస్థితికి వచ్చారో ఆలోచించండి. అంటే మీరు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చారో ఆలోచించండి. మీరు గతంలో ఎలాంటి పరిస్థితిలో ఉండేవారు ప్రస్తుతం ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు ఆలోచించండి. ముఖ్యంగా మీ చిన్నప్పుడు, లేదా స్కూల్ డేస్ లో ఎన్నో కోరికలు ఉండి ఉండొచ్చు, అందులో ఎన్నో మీరు ఇప్పటికే తీర్చుకొని ఉండవచ్చు, వాటిని ఒక సారి గుర్తుకు తెచ్చుకోండి, అప్పడు ఒక రకమైన్ తృప్తిని మీరు పొందుతారు.

పై విషయాలన్నీ కూడా మన మనస్సుని కొంత రిలాక్స్ కావడానికి సహాయపడుతాయి, పై వాటిలో మీకు నచ్చిన కొన్ని విషయాలను క్రమబద్దంగా సాధన చేసి సంతోషాన్ని మీ సొంతం చేసుకోండి. అల్ ది బెస్ట్. 

Tags:    

Similar News