ఫెండ్స్ ! ఈ రోజు మనం చర్చించే అంశం.. "మిమ్మల్ని మీరు నమ్ముతున్నారా?"
ప్రతి వ్యక్తికి జీవితంలో ఒడిదొడుకులు సహజం. అయితే వీటిని దాటి విజేతగా నిలబడటానికి మనపై మనకి నమ్మకం చాల అవసరం. మన శక్తి సామర్ధ్యాలని మన కుటుంబ సబ్యులు నమ్మిన, మన స్నేహితులు నమ్మిన లేదా ఈ ప్రపంచమంతా నమ్మిన కూడా, మనని మనం నమ్మకుంటే మాత్రం ఎంతో నష్టపోతాము. కాబట్టి మన నమ్మకమే మనకి అసలైన భలం.
సో ఫ్రెండ్స్! మిమ్మల్ని మీరు నమ్ముతున్నారా? మీ సమస్యలను ఎదుర్కొని, పరిష్కరించే సామర్థ్యం మీకు వుందని నమ్ముతున్నారా? ఎలాంటి సమస్యనైన భవిష్యత్తులో ఎదుర్కొగలమనే నమ్మకం వుందా! అయితే మ్మిమ్మలి, మీ శక్తి సామర్ద్యాలని మీరు నమ్మకుంటే మాత్రం... మనని మనమే నమ్ముకుంటే, మరి ఎవరు మనని నమ్ముతారు? అని ఆలోచించండి.
మనని మనం నమ్మగలిగే సామర్థ్యం మనలో పెంచుకుంటే ఎన్ని విషయాలు మనం సాధించగలమో ఆలోచించండి. ఎన్నో గొప్ప విజయాలు మన సొంతం అవుతాయి. మీకు కావాల్సిందల్ల ముందుగా ఆవగింజంత నమ్మకం. అలాగే "నేను నిజంగా నా మనస్సును ఏదయిన ఒక విషయం పై పెడితే, దానిని సాధించగలిగే సామర్థ్యాన్ని పూర్తిగా సంపాదించగలను" అనే ఆలోచన మీకు రావాలి, "నేను నిజంగా నా మనస్సును ఏదయిన ఒక విషయం పై పెడితే, దానిని సాధించగలిగే సామర్థ్యాన్ని పూర్తిగా సంపాదించగలను" అనే నమ్మకం మీరు కలిగి ఉంటే, మీ జీవితంలో ఏ తేడా ఉంటుందో, ఒక్క సారి ఆలోచించండి.
ఆ తేడా గుర్తించిన తర్వాత, అప్పుడు మీరు ఏమి కోరుకుంటారు మరియు ఏమి ఆశిస్తారు?
ఆలోచించండి.... ఆలోచించండి... ఆలోచించండి...మీ మనస్సుకు పదను పెట్టండి.
ఎలాంటి ఓటమి యొక్క భయం మిమ్మల్ని వెంటాడనపుడు, ఎలాంటి అడ్డంకునైన నేను జయిస్తాను అనుకున్నప్పుడు, విజయం ఎట్టి పరిస్థితుల్లోను తధ్యం! అని మీకు తెలుస్తే, ఎలాంటి కల కనడానికి మీరు ధైర్యం చేస్తారు? ఆ కల ఎంత పెద్దగా వుంటుంది? ఎంత అందంగా వుంటుంది? ఎంత గొప్పగా ఉంటుందో? ఆలోచించండి.
ఈ నమ్మకం ఎంతో శక్తివంతంగా మీ జీవితాన్ని ప్రభావితం చేయగలదు.
అసలు మనపై మనం ఎలా నమ్మకం పెంచుకోవాలి?
చాలామంది వ్యక్తులు వారి మీద వారికీ తక్కువ లేదా అతితక్కువ స్వీయ-నమ్మకం తోనే ప్రారంభమవుతారు, వారిని వారు అంతగా నమ్మరు, ఇతరులు చేయగలిగింది వీరు చెయ్యలేము అనుకుంటారు... కానీ ఆ తర్వాత, వారి ప్రయత్నాల ఫలితంగా నమ్మకాన్ని పెంచుకొని, వారు ధైర్యంగా మరియు ఉత్సాహంగా స్వీయ నమ్మకాన్ని సాధిస్తారు.
ఫ్రెండ్స్ మనం ఇతరులను చూసి కూడా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ముఖ్యంగా మీరు ఇతర స్వీయ- నమ్మకం గల పురుషులు మరియు స్త్రీ లను పరిశీలిస్తూ, వారు ఆలోచనలను తెలుసుకుంటూ, వారి కృషిని గుర్తిస్తు, వారు చేసే పనులను మీరు చేస్తే, మీరు కూడా అదే స్వీయ నమ్మకానికి సంబంధించిన భావాలను అనుభవిస్తారు మరియు అదే ఫలితాలను కూడా పొందుతారు, అలా మీరు కూడా విజేతగా నిలవగలరు.
మిమ్మల్ని మీరు నమ్మడం అంటే, మీలోని అత్యుత్తమ విషయాలను నమ్మడమే, అలాగే మీలోని విలువలు మరియు ఆకాంక్షలను గుర్తించడం, వాటికి అనుగుణంగా మీ జీవితాన్ని నిలబెట్టుకోవటానికి కృషి చేస్తూవుండటం. మీరు మిమ్మల్ని పూర్తిగా నమ్మడానికి, తెలుసుకోవడానికి ఇది అత్యుత్తమ మార్గం. ఇలా నమ్మడం మొదలెట్టిన నాటి నుండి మీ జీవితంలో ఎన్నో మంచి మార్పులను మీరు గమనిస్తారు. అలాగే ఇతరులు కూడా మీ ప్రవర్తనలో, మీ పనులలో వచ్చిన మార్పుని గుర్తించి, మిమ్మల్ని అభినందిస్తారు.
సో ఫ్రెండ్స్ ! ఇప్పుడు ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి. లేదా మీ చుట్టూ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. ఆ తర్వాత కొంత సమయం తీసుకొని, అసలు మీరు ఎలాంటి వ్యక్తి అని మీరు అనుకుంటున్నారు? మీ నమ్మకాలు ఏంటి? మీరు దేనికీ ఎక్కువ విలువ ఇస్తారు? మీ జీవితంలో మీకు అతి ముఖ్యమైనవి ఏమిటి? మీరు దేనికోసం రాత్రి పగలు కష్టపడటానికి సిద్దంగా వున్నారు? మీ జీవితానంతరం అందరు మిమ్మల్ని ఎలా గుర్తుకు పెట్టుకోవాలని మీరు కోరుకుంటున్నారు? ఈ ప్రపంచానికి మీ వంతుగా ఏమి అందిద్దామని మీరు అనుకుంటున్నారు!
ఉదాహరణకి......మీరు నటుడుగా మారడం ద్వారా మీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే, మీరు అది చేయగలరని నమ్మటం అతి ముఖ్యం. ఆ ప్రయాణంలో కష్టతరమైన అడుగు, నటన ఎలా చేయాలో తెలుసుకోవడానికి గాను ఆత్మవిశ్వాసం సంపాదించటమే. ఆ తర్వాత మీ పనిని ప్లాన్ చేసి, సాధన చేయడము మరియు నటించే అవకాశం పొందే నిరూపితమైన వ్యవస్థను పట్టుకున్న తర్వాత,మీ పెద్ద లక్ష్యాన్ని చేరుకోవడం సులభం అవుతుంది.
మిమ్మల్ని మీరు నమ్మిన క్షణాలలోనే, మీ లక్ష్యాలపై తక్షణ చర్య తీసుకోవడానికి కావాల్సిన ధైర్యం మీరు పొందుతారు. ఈ విధంగా మీరు విజయాన్ని సొంతం చేసుకుంటారు. మన అందరిలోనూ కొన్ని ప్రత్యేకమైన సామర్ధ్యాలు, నైపుణ్యాలు ఉన్నాయనే విషయాన్ని, అవి మనని ఒక ప్రత్యేకత కలిగిన వ్యక్తిగా నిలబెడతాయని గుర్తుకు పెట్టుకోవాలి. ఇలా మనం చర్చించిన విషయాలను ఆచరణలో పెట్టడం ద్వార మీపై మీరు నమ్మకాన్ని పెంచుకోవచ్చు. అలా మీ జీవితంలో గొప్ప విజయాలు సాదించవచ్చు. అల్ ది బెస్ట్.