ఇలా చేస్తే మీ మొహమాటమనే మహమ్మారిని మట్టుపెట్టగలరు?

Update: 2019-04-18 08:44 GMT

ఫ్రెండ్స్.... మీ మొహమాటం మొదటికే మోసం తీసుకు వస్తుందా..

ఫ్రెండ్స్ "గాలిలో పెట్టిన దీపంలా"... మొహమాటం ఉన్న వ్యక్తి జీవితంలో చాలా కోల్పోతాడు. సమాజంలో వున్నా, ఒంటరిగా మిగిలిపోతాడు, పంచుకోవటంలో వున్న ఆనందాన్ని కోల్పోతాడు, అలాగే ఎదుటివారి సహకారం తీసుకోలేకపోతాడు. ముఖ్యంగా వీరివల్ల ఇతరులకు పండగ, వీరికి మాత్రం దండగ అవుతుంది. కాబట్టి ఈ మొహమాటమనే కనపడని జైలు నుండి మనం "విడుదల" కావల్సిన అవసరం ఉంది. మొహమాటానికి పోతే ఎదుటివారికి బిర్యానీ, మనికి "పచ్చడి అన్నము" మిగులుతుంది. కాబట్టి ఈ వీడియోలోని అతి ముఖ్యమైన ఐదు విషయాలు అర్థం చేసుకోవడం ద్వారా, ఈ అనవసర "మొహమాటల బందీఖానా" నుంచి ఎలా బయటపడాలో చూద్దాం.

1. ఇతరులు ఏమనుకుంటారో అని మీ బ్రెయిన్ బ్రేక్ చేసుకోకండి.

ఫ్రెండ్స్ "ఈ ప్రపంచంలో ఎక్కువ ఐడియాలు కళ్ళు తెరవక ముందే కాటికి వెళ్లి పోతున్నయట". దీనికి ముఖ్య కారణం, "ఈ ఐడియా గురించి అందరు ఏమనుకుంటారో అనే ఆలోచన వల్లే నట". ముఖ్యంగా మొహమాటపడేవారు వారి గురించి ఇతరులు ఏమనుకుంటారో అని ఎక్కువగా ఆలోచిస్తారట. అలా మీ గురించి ఇతరులు ఏదో అనుకుంటారని కూడా మీరే ఆలోచిస్తే ఎలా? ఎందుకంటే వాళ్లకున్న సమస్యల గురించే ఆలోచించుకోడానికి, వారికీ టైం సరిపోదు, మన గురించి ఆలోచించే తీరిక వాళ్లకి ఎక్కడ ఉంటుంది. ఏ వ్యక్తి అయితే తన విలువలు, లక్ష్యాల విషయంలో స్పష్టంగా ఉంటాడో అతను ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించడు. అలా స్పష్టత లేకుంటే మాత్రం ఇష్టం లేని పనులు చేసి మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి నిర్మొహమాటంగా ఉండాలి. మొహమాటం కోసం మీ బైక్ నో , మీ కార్ నో ఇతరులకి ఇచ్చి మీ బ్రెయిన్ బ్రేక్ చేసుకుంటే లాభం ఏంటి బ్రదర్.

2. ముందుగా మనం మన హక్కులు ఏంటో తెలుసుకోవాలి.

ఒక సినిమాలో పూరి జగన్నాథ్ అన్నట్టు "ఎవడి సినిమాలో వాడె హీరో". మన జీవితమనే, మన సిన్మా లో మనమే హీరో అని గుర్తు పెట్టుకోవాలి. మన సమాజంలో ప్రతి వ్యక్తికి కొన్ని హక్కులు, కొన్ని ఇష్టాలు, కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, అయితే వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం మన మీదనే ఉంటుంది. ఎప్పుడైతే మన హక్కులకు వ్యతిరేకమైన పనిని ఇతరులు చెయ్యమని కోరుకుంటారో, అప్పుడు తప్పకుండా "కాదు" అని లేదా "నో" అని చెప్పాలి. అందుకై మన హక్కులని తెలుసుకోవడం మొదటి స్టెప్ అయితే, వినియోగించుకోవడం రెండవ స్టెప్. మన హక్కులను, అభిప్రాయాలని, నమ్మకాలని ఇతరులకి స్పష్టంగా కమ్యూనికేట్ చెయ్యాలి. అప్పుడు అవి కొద్దిమందికి నచ్చవచ్చు, మరికోద్దిమందికి నచ్చకపోవచ్చు, అలా కొద్దిమంది మనని గౌరవించక పోయినా, చాలామంది మనని ఒక వ్యక్తిత్వము వున్నా వ్యక్తిగా ఎంతో గౌరవిస్తారు. అప్పుడే మన జీవిత సిన్మాలో కష్టాలు తగ్గుతాయి, సంతోషాలు పెరుగుతాయి, చివరికి శుభం కార్డ్ మాత్రమే పడుతుంది.

3. నిబంధనలు పాటించవచ్చు, కాని నిర్భంధాన్ని కాదు.

జైలు లోని నేరస్తుడికి, జైలు లో గస్తి గా వుండే ఆఫీసర్ కి వ్యతాసం ఏంటి, ఇద్దరు జైలు లోపలే వుంటారు కదా, అని కొద్ది మంది అంటుంటారు..అయితే ఇద్దరికీ చాల వ్యతాసం వుంది, నేరస్తుడు నిర్బంధంలో వున్నాడు, ఆఫీసర్ నిబంధనల ప్రకారం వుంటాడు, అలా ఈ రెండిటికి వున్నా వ్యత్యాసం తెలుసుకోవచ్చు, అయితే బయట సమాజంలోని అనవసర నిర్భందాల వలన ఆత్మవిశ్వాసం, నమ్మకం, నైపుణ్యం వంటి వ్యక్తిగత అంశాలకు దూరం కావాల్సివస్తుంది. కాబట్టి ఒక వ్యక్తితో మాట్లాడాల్సి వచ్చినపుడు, లేదా కొంతమంది వ్యక్తులతో మాట్లాడవలసి వచ్చినప్పుడు, ఏమి మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, అని ఆలోచించుకోని పెట్టుకోవాలి. వీలైతే ఒకటి రెండు సార్లు మనస్సులో ప్రాక్టీసు కూడా చేసుకోవాలి. ఇలా ఎప్పుడు మొహమాటం వల్ల నిర్భంధానికి గురికాకండి, నిబంధనలు మాత్రమే పాటించండి, అందుకోసమే అంటారు పెద్దలు "అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్టూరం మేలని".

4. పరిచయాల పల్లకి ఎక్కండి.

మనిషి సంఘ జీవి...ఒంటరిగా ఈ సమాజంలో బ్రతకడం చాల కష్టం, అందుకోసమే ఎన్నో బంధాలు, బంధుత్వాలు...అయితే "ఈ బంధాలు" ఒక తోటలో పెంచే మొక్కల్లాన్టివి, వీటికి పరిచయాలనే విత్తనాలు. కాని కొంతమందికి కొత్తవారితో మాట్లాడాలన్నా, అమ్మాయిలతో మాట్లాడాలన్నా చాలా సిగ్గు పడుతూ ఉంటారు. దాని వల్ల నలుగురిలో కలవలేక ఎన్నో అవకాశాలను కోల్పోతారు. చాల మందిలో ఈ మొహమాటం అలాగే ఉండిపోవడానికి కారణం ఏంటి అంటే, కొత్త కొత్త పరిచయాలు చేసుకోకపోవడం. కాబట్టి మన పరిచయాలని పరిపరివిధాలుగా పెంచుకోవాలి. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైతే ఈ సమాజంలో నలుగురితో కొత్త పరిచయాలు చేసుకుంటారో ఆ వ్యక్తులతో మీ అభిప్రాయాలు పంచుకుంటారో, అందులో మీరు, మీకు నచ్చే కొద్ది మందిని కూడా కలవగలుగుతారు. అలా ఆటోమేటిక్ గా అనవసరమైన మొహమాటాలు, ఇబ్బందులు అధిగమించడం నేర్చుకుంటారు.

5. పలకరింపు, ప్రశంస కలిసి పులకరింపుని ఇస్తాయి.

హలో, బాగున్నారా! ఎలా వున్నారు! అని ఎదుటి వ్యక్తి మనతో అనే మాట మన పెదాలపై "చిరునవ్వుని చిగురింపచేస్తుంది". అయితే అలాంటి పలకరింపులతో పరిచయం చేసుకోడానికి చాల మందికి, చాలా సందర్భాల్లో ఆ తర్వాత ఏం మాట్లాడాలో తెలియదు. కాబట్టి దీనికి ఒక మంచి సాధనం మన వద్ద ఏదైనా ఉంది అంటే అవి "కుశల ప్రశ్నలు". సందర్భానుసారంగా సరైన ప్రశ్నలు అడగడం ద్వారా ఒక కొత్త వ్యక్తితో సంభాషణ, లేదా చర్చ మొదలు పెట్టవచ్చు. అలాగే అన్నిటికన్నా ముఖ్యమైనది ఉత్సాహవంతమైన పలకరింపు. అలాగే ఎదుటి వ్యక్తి లోని ఏదైనా ఒక విషయాన్ని ప్రశంసించడం ద్వారా కూడా ఆ యొక్క సంభాషణలు, చర్చని చాలా పాజిటివ్గా ముందుకు తీసుకుపోవచ్చు. ఈ ప్రపంచంలో ఎవ్వరికైనా సరే ఒక మంచి ప్రశంసకి వారి లో ఒక పులకరింపు కనిపిస్తుంది. కాబట్టి ఎదుటి వ్యక్తిలోని ఒక మంచి విషయాన్ని గుర్తించండి.... ప్రశంసించండి.

ఫ్రెండ్స్ చివరగా...మనం మాట్లాడుకున్న విషయాలు మీరు ఆచరించడం ద్వార మొహమాటమనే మహమ్మారిని మట్టుపెట్టగలరు... అలా మొహమాటాన్ని వదిలి విజయబాటని పడుతారని...నిబంధనలను గౌరవించి, నిర్బంధాలను తొలగించుకుంటారని.. ఆశిస్తూ ఆల్ ద బెస్ట్.

Similar News