Randev Baba: నోరు మూసుకోండంటూ రాందేవ్ బాబా ఆగ్రహం
Randev Baba: రిపోర్టర్‌కు యోగా గురు రాందేవ్ బాబా షాక్
Randev Baba: నోరు మూసుకోండి. ఇలాంటి ప్రశ్నలు వేయడం మంచిది కాదు. చమురు ధరల పెంపుపై బాబా రాందేవ్ రిపోర్టర్‌కు చేసిన హెచ్చరిక ఇది. పరిస్థితులు అదుపులో లేవని పరిస్థితి అర్థం చేసుకోవాలన్నారు. చమురు ధరలు తగ్గితే పన్నులు రావని ప్రభుత్వం చెబుతోందని అప్పుడు ఉద్యోగులకు జీతాలు, రోడ్ల నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. అప్పటి వరకు కూల్ గా ఉన్న రాందేవ్ బాబా చమురు ధరల గురించి ప్రస్తావించడంతో ఒక్కసారిగా ఆగ్రహోదగ్ధుడయ్యాడు. హర్యానాలోని కర్నాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది.
విలేకరులు అనవసరమైన ప్రశ్నలు అడుగుతూనే ఉంటారని ప్రశ్నలన్నింటికీ సమాధానాలివ్వాలా అంటూ మండిపడ్డాడు రాందేవ్ బాబా. పెట్రోల్ ధర తగ్గింపుపై గతంలో తాను చేసిన వ్యాఖ్యల గురించి అడిగిన జర్నలిస్టును యోగా గురు రామ్‌దేవ్ చల్లబరుస్తూ బెదిరించడం కెమెరాలో కనిపించింది. ధరలు తగ్గాలని ద్రవ్యోల్బణం అదుపులోకి రావాలని ప్రజలు కూడా కష్టపడాలంటూ లెక్చరిచ్చారు. మరోవైపు చమురు ధరల పెంపుపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు అధికంగా ఉన్నా నాడు యూపీఏ సర్కారు ధరలను కంట్రోల్ చేసిందంటున్నారు.
పెట్రోల్ ధరలు దేశ వ్యాప్తంగా పది రోజుల్లో తొమ్మిదోసారి పెరిగాయ్. మార్చి 22న మొదలైన బాదుడు నిరంతరంగా సాగడంతో మధ్యతరగతి ప్రజలు విలవిలలాడుతున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల వేళ నాలుగున్నర నెలలపాటు చమురు ధరలు పెరగకపోవడం ఎలక్షన్స్ పూర్తయిన వెంటనే వడ్డించడంపై జనం మండిపడుతున్నారు. తాజాగా లీటర్, పెట్రోల్ డీజిల్ పై 80 పైసలను పెంచడంతో హైదరాబాద్ లో పెట్రోల్ ధర 115 చేరుకోగా డీజిల్ ధర నూటొక్క రూపాయి దాటింది.