Viral News: ఈ సమాజానికి ఏమైంది.. కూతురి మామతో మహిళ జంప్..!
Viral News: సమాజంలో జరుగుతోన్న సంఘటనలు చూస్తుంటే అసలు ఎటు వెళ్తున్నామా.? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Viral News: ఈ సమాజానికి ఏమైంది.. కూతురి మామతో మహిళ జంప్..!
Viral News: సమాజంలో జరుగుతోన్న సంఘటనలు చూస్తుంటే అసలు ఎటు వెళ్తున్నామా.? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సభ్య సమాజం తల దించుకునేలా జరుగుతోన్న ఘటనలు భయంతో పాటు అసహ్యాన్ని కలిగిస్తున్నాయి. కట్టుకున్న భర్తలను కాదని ప్రియుళ్లతో పారిపోతున్నారు కొందరు. ఇక ఏకంగా కూతురు పెళ్లి చేసుకోబోయే వ్యక్తితో అత్త పరార్ అయిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా ఇదే ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ ఘటన ఈ సమాజానికి ఏమైందన్న ప్రశ్నలను సంధిస్తోంది.
ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రెండు సంచలనాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఒకటి అలీగఢ్‌లో కాగా, మరొకటి బదాయూలో చోటు చేసుకున్నాయి. అవి సామాజిక విలువలు, కుటుంబ బంధాలపై పెద్ద చర్చకు తెచ్చాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన బదాయూన్ ఘటన సబ్యసమాజాన్ని ప్రశ్నిస్తోంది.
బదాయూకు చెందిన 43 ఏళ్ల మమత అనే మహిళ, తన కూతురి మామ శైలేంద్ర అలియాస్ బిల్లుతో కలిసి పరారైంది. మమత భర్త సునీల్ కుమార్ ట్రక్ డ్రైవర్‌గా పని చేస్తూ నెలలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ఇంటికి వచ్చేవాడు. ఈ సమయంలో శైలేంద్ర తరచుగా మమత ఇంటికి వెళ్లేవాడని, ఇది వీరి మధ్య సన్నహిత బంధానికి కారణమైందని కుటుంబ సభ్యులు తెలిపారు.
మమత కుమారుడు తెలిపిన వివరాల ప్రకారం, శైలేంద్ర మూడు రోజులకోసారి ఇంటికి వచ్చేవాడు. తల్లి ప్రవర్తనపై అనుమానం వచ్చి, తాము మరో చోటుకు మారాల్సి వచ్చిందని తెలిపారు. చివరకు శైలేంద్రతో కలిసి ఆమె ఒకానొక సమయంలో పారిపోయింది. సునీల్ కుటుంబ పోషణ కోసం ఎప్పటికప్పుడు డబ్బులు పంపుతున్నప్పటికీ, భార్య తన పక్కనే లేకపోవడం బాధిస్తున్నదని వాపోయాడు. ఆమె ఇంటి నుంచి వెళ్లి పోయే సమయంలో బంగారం, డబ్బు తీసుకొని పోయిందని తెలిపారు.
ఈ విషయమై స్థానికులు మాట్లాడుతూ.. సునీల్ ఎక్కువగా ఇంటికి రాకపోవడం వల్ల శైలేంద్ర తరచూ వారి ఇంటికి రావడం పై ఎవరికీ అనుమానం రాలేదని, అతడు బంధువు కావడంతో ఆ సంభందం మొదట్లో సాధారణంగా అనిపించింన్నారు. అయితే ఇది మమత, శైలేంద్రల మధ్య వివాహేతర బంధంగా మారిందని పోలీసులు అంటున్నారు. ఈ ఘటనపై సునీల్ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మమతకు నలుగురు పిల్లలు ఉన్నారు. వారిలో ఒక కూతురు ఇప్పటికే వివాహమై ఉంది. అల్లుడి తండ్రితో మమత వివాహేతర సంబంధం పెట్టుకోవడం సంచలనంగా మారింది.