ఈ సమయంలో విమర్శలు చేయడం అంటే దేశ ప్రజలను అవమానించడమే : సీఎం యోగి

కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫైర్ అయ్యారు. ఉత్తరప్రదేశ్ లో కరోనాను కట్టడి చేయడంలో తన ప్రభుత్వం విఫలమైందని విమర్శలు తగదన్నారు.

Update: 2020-06-05 15:09 GMT
CM yogi adityanath(File photo)

కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫైర్ అయ్యారు. ఉత్తరప్రదేశ్ లో కరోనాను కట్టడి చేయడంలో తన ప్రభుత్వం విఫలమైందని విమర్శలు తగదన్నారు.రాహుల్, ప్రియాంకల మాటలు చూస్తుంటే ఇండియా కూడా ఇటలీ అయ్యే పరిస్థితి వస్తుందని అన్నారు. ఇండియాను ఇండియాలాగే ఉంచాలని ఎద్దేవా చేశారు. 

దేశాన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ పరి పాలించిందని... అయినప్పటికీ ఒక అజెండాను కానీ, ప్రజల కోసం ఒక విజన్ ను తయారు చేయలేకపోయిందని దుయ్యబట్టారు. కరోనా మహమ్మారి తొలి కేసు బయటపడే సమయానికి దేశంలో ఒకే ఒక్క కరోనా ల్యాబ్ అందుబాటులో ఉందన్న యోగి.. తమ ప్రభుత్వ ఆలోచనా విధానంతోనే ఇప్పుడు 650 ల్యాబ్ లు అందుబాటులో ఉన్నాయని, రోజుకు 2 లక్షలకు పైగా టెస్టులు జరుగుతున్నాయని గుర్తుచేశారు. కరోనా లాంటి విపత్కర సమయంలో ప్రభుత్వానికి సహకరించకుండా విమర్శలు చేయడం అంటే దేశ ప్రజలను అవమానించడమేనని ఆయన అన్నారు.

అబద్దమాడటం కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉందని.. బీజేపీ ఎప్పటికి నిజాలే చెబుతుందని చెప్పారు. వలస కార్మికుల విషయంలో ఏదో ఘనకార్యం చేసిన వారిలాగా.. వారి కోసం బస్సులను పంపుతామని చెప్పి పంపలేదని విమర్శించారు. అంతేకాదు పంపిన కొన్ని బస్సులకు సరైన పత్రాలు, ఇన్స్యూరెన్స్, రిజిస్ట్రేషన్ కూడా లేవని సీఎం యోగి అన్నారు.

Tags:    

Similar News