UPSC Results 2024: యూపీఎస్సీ రిజల్ట్స్ వచ్చేశాయ్... తెలుగు రాష్ట్రాల నుండి టాపర్స్ లిస్ట్

UPSC Final Results 2024: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2024 ఫైనల్ రిజల్ట్ వచ్చేసింది. మంగళవారం మధ్యాహ్నం ఫలితాలు రిలీజ్ చేసిన యూపీఎస్సీ, టాప్ 10 ర్యాంక్స్ సొంతం చేసుకున్న వారి జాబితాను ప్రకటించింది.
1 ) శక్తి దూబె
2 ) హర్షిత గోయల్
3 ) డోంగ్రె అర్చిత్ పరాగ్
4 ) షా మార్గి చిరాగ్
5 ) ఆకాశ్ గర్గ్
6 ) కోమల్ పునియా
7 ) ఆయుషి బన్సాల్
8 ) రాజ్ కృష్ణ ఝా
9 ) ఆదిత్య విక్రమ్ అగర్వాల్
10 ) మయంక్ త్రిపాఠి
యూపీఎస్సీ టాపర్స్‌లో ఇ సాయి శివాని 11వ ర్యాంక్ సొంతం చేసుకుని తెలుగు రాష్ట్రాల నుండి టాపర్స్ జాబితాలో ముందు వరుసలో నిల్చనున్నారు. బన్నా వెంకటేష్ 15వ ర్యాంక్, అభిషేక్ శర్మ 38వ ర్యాంక్, రావుల జయసింహా రెడ్డి 46వ ర్యాంక్, శ్రవణ్ కుమార్ రెడ్డి 62వ ర్యాంక్ సాయి చైతన్య జాదవ్ 68వ ర్యాంక్ సొంతం చేసుకున్నారు.
చేతన్ రెడ్డి ఎన్ 110వ ర్యాంక్, చెన్నంరెడ్డి శివగణ్ రెడ్డి 119వ ర్యాంక్, చల్లా పవన్ కళ్యాణ్ 146వ ర్యాంక్, ఎన్ శ్రీకాంత్ రెడ్డి 151వ ర్యాంక్, నెల్లూరు సాయితేజ 154వ ర్యాంక్, కొలిపాక కృష్ణసాయి 190వ ర్యాంక్ సాధించారు.
యూపీఎస్సీ పరీక్షల విధానం క్లుప్తంగా...
యూపీఎస్సీ పరీక్షలకు లక్షల్లో పోటీ ఉంటుంది. ప్రిలీమ్స్, మెయిన్స్ పరీక్షలు పాస్ అయిన వారు ఇంటర్వ్యూ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మూడు పరీక్షల్లో అర్హత సాధించిన దాని ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రకటిస్తారు.
యూపీఎస్సీలో అర్హత సాధించిన అభ్యర్థులకు వారి మెరిట్ ఆధారంగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్, ఇండియన్ రెవిన్యూ సర్వీస్, ఇండియన్ ట్రేడ్ సర్వీస్ తో పాటు కేంద్రంలోని గ్రూప్ ఏ, గ్రూప్ బి కేడర్ పోస్టుల్లో అపాయింట్ చేస్తారు.
2024 యూపీఎస్సీ మెయిన్స్ పాస్ అయిన వారికి జనవరి 7వ తేదీ నుండి ఏప్రిల్ 17 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 1,132 ఖాళీలను భర్తీ చేయనున్నారు.