Viral News: సినిమాను మించిన ట్విస్టులు.. కాబోయే అల్లుడితో పారిపోయిన అత్త వ్యవహారంలో కీలక మలుపు..!
Viral News: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్‌లో ఓ భిన్నమైన ప్రేమ కథ కలకలం రేపుతోంది.

Viral News: సినిమాను మించిన ట్విస్టులు.. కాబోయే అల్లుడితో పారిపోయిన అత్త వ్యవహారంలో కీలక మలుపు..!
Viral News: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్‌లో ఓ భిన్నమైన ప్రేమ కథ కలకలం రేపుతోంది. పది రోజుల క్రితం 39 ఏళ్ల మహిళ తన కాబోయే అల్లుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోవడం, అనంతరం నేపాల్ సరిహద్దు దాకా వెళ్లి మళ్లీ స్వయంగా తిరిగివచ్చి పోలీసులకు లొంగిపోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
వివరాల్లోకి వెళితే.. స్వప్న అనే మహిళ, ఆమె కూతురికి కాబోయే వరుడు రాహుల్ (25)తో పారిపోయింది. స్వప్న కుమార్తె వివాహం రాహుల్‌తో పెళ్లి కావాల్సిన తేదీ దగ్గరపడుతున్న వేళ, అనూహ్యంగా తానే అతనితో కలిసి పారిపోవడం కుటుంబాలను షాక్‌కు గురిచేసింది.
పారిపోయిన తర్వాత ఈ జంట నేపాల్ సరిహద్దు దాకా చేరింది. అయితే ఇరు కుటుంబ సభ్యుల ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించినట్లు తెలుసుకున్న ఈ జంట భయంతో తిరిగి అలీగఢ్‌కు మళ్లింది. స్థానిక పోలీస్ స్టేషన్‌కు వచ్చి స్వయంగా లొంగిపోయింది.
పోలీసుల విచారణలో స్వప్న ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తాను తన భర్తతో జీవించలేనని, అతను మద్యం సేవించి తరచూ హింసిస్తున్నాడని ఆరోపించింది. అందుకే రాహుల్‌తో జీవితం కొనసాగించాలని తుదిగా నిర్ణయించుకున్నట్లు తెలిపింది. "రాహుల్‌ను నేను విడిచిపెట్టను.. నన్నెవరూ ఆపలేరు" అంటూ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేసింది.
ఇక రెండోపక్క, స్వప్న భర్తతో పాటు ఆమె పిల్లలు పలుమార్లు బతిమాలినా, తిరిగి రమ్మని కోరినా ఆమె ఒప్పుకోలేదు. ఈ ఘటనతో ఇరు కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు లోనయ్యారు. పోలీసులూ సైతం ఈ కేసును ఎలా పరిష్కరించాలో అర్ధం కాక అయోమయంలో పడిపోయారు. ప్రస్తుతం ఈ వ్యవహారం న్యాయపరంగా ఎటు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.