AP Bhavan: ఏపీ భవన్‌ విభజనపై కేంద్ర హోం శాఖ కీలక ప్రతిపాదనలు.. లెక్క తేలిపోయినట్టేనా..?

AP Bhavan: 7.64 ఎకరాల పటోడీ హౌస్‌‌ స్థలాన్ని తెలంగాణకు ఇవ్వాలని ప్రతిపాదన

Update: 2023-05-04 13:30 GMT

AP Bhavan: ఏపీ భవన్‌ విభజనపై కేంద్ర హోం శాఖ కీలక ప్రతిపాదనలు.. లెక్క తేలిపోయినట్టేనా..?

AP Bhavan: ఏపీ భవన్‌ విభజనపై కేంద్ర హోంశాఖ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. 7.64 ఎకరాల పటోడీ హౌస్‌‌ స్థలాన్ని తెలంగాణకు ఇవ్వాలని ప్రతిపాదించింది. శబరి, గోదావరి, నర్సింగ్ హాస్టల్ బ్లాక్‌‌ ఉన్న 12 ఎకరాల స్థలాన్ని ఏపీకి ఇవ్వాలని కేంద్ర హోంశాఖ ప్రతిపాదన తీసుకొచ్చింది. జనాభా నిష్పత్తి ఆధారంగా రెండు రాష్ట్రాలకు వాటా ఉంటుందన్న కేంద్ర హోంశాఖ.. అవసరమైతే ఏపీ ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ చేస్తుందని తెలిపింది. కేంద్రం ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించింది ఏపీ. ప్రతిపాదన ఆచరణ యోగ్యంగా ఉందని తెలిపింది. ఈ మూడు ఆప్షన్లను పరిశీలించి తదుపరి సమావేశంలో ఏపీ భవన్ విభజనపై నిర్ణయం వెలువడనున్నట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News