గుజరాత్‌లో ఘోరం జరిగింది. రాజ్‌కోట్‌లో గల అజీడ్యామ్ గోడ సోమవారం కుప్పకూలింది. దీంతో ఇద్దరు మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు క్రేన్ల సాయంతో శిథిలాలను తొలగించారు. మృతులు భూపత్ మియాత్రా (26), విజయ్ విరాడా (25) గా గుర్తించారు. వీరు అజీ ఆనకట్ట, భావ్‌నగర్ రోడ్ వైపు వెళుతున్నారు. దురదృష్టవశాత్తు ఒక్కసారిగా అజీడ్యామ్ గోడ బ్రిడ్జి కుప్పకూలడంతో వారు శిధిలాల కిందపడి తీవ్రంగా గాయపడ్డారు..
అనంతరం మృతి చెందారు. గోడ కూలే దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ప్రమాదం నుంచి ఓ ట్రాలీ తృటిలో బయటపడింది. నాలుగు రోజుల క్రితం వచ్చిన నిసర్గ తుపాను ప్రభావంతో గుజరాత్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల వల్లే అజీ డ్యామ్ గోడ బాగా నానడంతో అది కూలిపోయినట్లుగా తెలుస్తోంది.