Supreme Court: హిజాబ్‌ కేసుపై నేడు సుప్రీంకోర్టు తుది తీర్పు

Supreme Court: 10 రోజుల పాటు విచారించిన అత్యున్నత ధర్మాసనం

Update: 2022-10-13 03:00 GMT

Supreme Court: హిజాబ్‌ కేసుపై నేడు సుప్రీంకోర్టు తుది తీర్పు

Supreme Court: హిజాబ్‌ కేసుపై ఇవాళ సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. హిజాబ్‌ నిషేధాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై 10 రోజులపాటు సుప్రీంకోర్టు విచారించింది. గత నెల 22న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. దీనికి సంబంధించిన తీర్పును జస్టిస్‌ హేమంత్‌గుప్తా, సుధాన్షు ధులియా ధర్మాసనం వెల్లడించనుంది. పాఠశాలలు, కళాశాలల్లో యూనిఫారాన్ని పూర్తిగా పాటించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని పిటిషనర్లు సవాల్ చేశారు. మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి భాగం కాదని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. దీన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు మతస్వేచ్ఛ హక్కు కోసం వాదించగా.. రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ పాఠశాలు, కళాశాలల్లో క్రమశిక్షణ పాటించాలని పేర్కొంది. తరగతి గదుల్లో హిజాబ్‌పై నిషేధం సహేతుకమైన పరిమితి అని, ఇస్లాంలో హిజాబ్ ముఖ్యమైన మతపరమైన ఆచారం కాదని కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై విద్యార్థులు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు ఏం చెబుతుందోనని అందరూ ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

Full View
Tags:    

Similar News