Terror Attack: రైల్వే ఆస్తులు, కాశ్మీరీ పండిట్స్ లక్ష్యంగా టెర్రర్ ప్లాన్?

Terror Attack: రైల్వే ఆస్తులు, కాశ్మీరీ పండిట్స్ లక్ష్యంగా టెర్రర్ ప్లాన్?
Terror Attack: రైల్వే మౌలిక సదుపాయాలు, కాశ్మీరీ పండిట్స్ తోపాటు కాశ్మీర్ లోయల్ పనిచేస్తున్న స్థానికేతరులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో భద్రతా దళాలు మరింత అప్రమత్తమైనట్లు అధికారులు తెలిపారు. పహల్గాం టెర్రర్ దాడి తర్వాత నిఘా వర్గాలు ఈ విషయాలను పసిగట్టినట్లు తెలిసింది. జమ్మూ కాశ్మీర్ లో పనిచేసే స్థానికేతరులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా అక్కడ పనిచేస్తున్న రైల్వే ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుంచి వెళ్లినవారే ఉన్నారు. దీంతో దాడుల ముప్పు ద్రుష్ట్యా రైల్వే భద్రతా సిబ్బంది తమ బ్యారక్స్ నుంచి బయటకు రాకుండా ఉండాలని అధికారులు తెలిపారు.
మరోవైపు కాశ్మీరీ పండిట్స్ లక్ష్యంగా దాడులు చేసేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ ప్లాన్ వేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. వీరితోపాటు శ్రీనగర్ గాందెర్బల్ జిల్లాల్లోని పోలీస్ సిబ్బందికి కూడా హెచ్చరికలు జారీ చేశాయి. ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉందన్న వార్తల నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. రైల్వే ప్రాజెక్టులను ధ్వంసం చేసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఆర్పీఎఫ్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.