Tamilnadu Governor: తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్
Tamilnadu Governor: డీఎంకే ప్రభుత్వం జాతీయ గీతాన్ని గౌరవించడం లేదన్న రవి
Tamilnadu Governor: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి .. డీఎంకే పార్టీ వైఖరి పట్ల అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీని ఉద్దేశించి ఆయన ప్రసంగం చేశారు. అయితే కొన్ని క్షణాల్లోనే ఆయన తన ప్రసంగాన్ని ముగించేశారు. ప్రసంగం ప్రారంభానికి ముందు, చివరకు జాతీయ గీతాన్ని ఆలపించలేదన్నారు. ప్రసంగ పాఠాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. జాతీయ గీతాన్ని డీఎంకే గౌరవించలేదన్నారు. అందుకే తన ప్రసంగాన్ని తొందరగా ముగించి వెళ్తున్నట్లు ఆయన చెప్పారు.