Tahawwur Rana: భారత్‌కు చేరుకున్న లష్కర్‌ ఉగ్రవాది తహవూర్‌ రాణా

Tahawwur Rana: 2008 నవంబర్ 26 ముంబై పేలుళ్ల కీలక సూత్రధారి తహవూర్‌ రాణా ఇండియా చేరుకున్నాడు. ఢిల్లీ పాలం ఎయిర్‌పోర్ట్లో ప్రత్యేక విమానంలో ల్యాండ్ అయ్యాడు.

Update: 2025-04-10 09:49 GMT
Tahawwur Rana Land in Delhi

Tahawwur Rana: భారత్‌కు చేరుకున్న లష్కర్‌ ఉగ్రవాది తహవూర్‌ రాణా 

  • whatsapp icon

Tahawwur Rana: 2008 నవంబర్ 26 ముంబై పేలుళ్ల కీలక సూత్రధారి తహవూర్‌ రాణా ఇండియా చేరుకున్నాడు. ఢిల్లీ పాలం ఎయిర్‌పోర్ట్లో ప్రత్యేక విమానంలో ల్యాండ్ అయ్యాడు. దీంతో.. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు. తహవూర్ రాణాను ఎన్ఐఏ బృందం అదుపులోకి తీసుకున్నారు. తహవూర్ రాణాను అమెరికా అప్పగించడంతో ప్రత్యేక బృందం భారత్కు తీసుకొచ్చింది.

ఎన్‌ఐఏ కార్యాలయం పరిసరాల్లో స్వాట్ బృందాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్ఐఏ విచారణ తర్వాత అతనిని పటియాల హౌస్ కోర్టుకు తరలించనున్నారు. తహవూర్ రానాను కస్టడీకి అప్పగించాలని ఎన్ఐఏ పిటిషన్ వేయనుంది. కోర్టు విచారణ తర్వాత తహవూర్ రాణాను తీహార్ జైలుకు తరలించనున్నారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడన్న ఆరోపణలపై 2009లో అమెరికాలో అరెస్టయ్యాడు తహవూర్ రాణా. రాణాను అప్పగింత ప్రక్రియలో భాగంగా దాదాపు 16 ఏళ్లకు భారత్‌కు తీసుకొచ్చారు.

ముంబయి దాడి వెనక పాకిస్థాన్‌ నాయకుల పాత్రను నిర్ధరించే దిశగా విచారణ ఉండనుందని తెలుస్తోంది. దాంతో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని NIA అధికారులు భావిస్తున్నారు. 2008 నవంబర్ 26న ముంబైలోని తాజ్ హోటల్లో 10 మంది పాకిస్తాన్ టెర్రరిస్టులు నరమేధం సృష్టించిన ఘటన వెనక తాహవూర్ రాణా మాస్టర్ మైండ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఉగ్రదాడిలో 166 మంది అమాయకులు ప్రాణాలు విడిచారు.

Tags:    

Similar News