చిరుతపులిని కొట్టిచంపిన స్థానికులు.. ఆరుగురు అరెస్ట్..
అస్సాంలో గువహతిలో చిరుతపులిని చంపేశారు స్థానికులు.
అస్సాంలో గువహతిలో చిరుతపులిని చంపేశారు స్థానికులు. గువహతి శివార్లలోని ఒక రెసిడెన్షియల్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోకి ప్రవేశించిన చిరుతపులిని అటవీ శాఖ జంతువును రక్షించకముందే.. కొంతమంది వ్యక్తుల సమూహం కార్నర్ చేసి తీవ్రంగా కొట్టారు. దాంతో అది మృతిచెందింది. అంతేకాదు ఈ చిరుతపులిని గ్రామంలోని వీధుల వెంట తిప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆరుగురిని అరెస్టు చేశారు.
అలాగే నేరానికి పాల్పడిన ఇతర వ్యక్తుల కోసం అన్వేషణ కొనసాగుతోంది. అటవీ శాఖ ముందస్తుగా వ్యవహరించినట్లయితే ఈ సంఘటన జరిగేది కాదని స్థానికులు అంటున్నారు. ఆదివారం ఉదయం 5 గంటలకు చిరుతపులి గురించి అప్రమత్తమైనట్లు అటవీ శాఖ అంగీకరించింది, కాని వారు అక్కడికి చేరుకోకముందే దాన్ని చంపేశారని తెలిపారు. కొంతమంది స్థానికులు జంతువును అడవిలో చంపారని.. ఈ సంఘటన రిజర్వు అటవీ ప్రాంతంలో జరిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.