Income Tax: సీనియర్ సిటిజన్లకు కేంద్రం శుభవార్త..సెక్షన్ 80డి లిమిట్ రూ.1లక్షకు పెంపు

Income Tax: కేంద్రంలో మోదీ సర్కార్ ఈనెలాఖరులోపు వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో పలు రంగాల ప్రజలు ప్రోత్సాహకాలను కల్పించాలని ఎప్పటినుంచో కోరుతున్నారు. ఈ సారి పన్ను చెల్లింపుదారులు, సీనియర్ సిటిజన్లకు ఊరటకల్పించే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా సీనియర్ సిటిజన్ల వైద్యం ఖర్చుల విషయంలో సెక్షన్ 80డీ పరిమితి రూ. 1లక్షకు పెంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

Update: 2024-07-04 00:29 GMT
Income Tax: సీనియర్ సిటిజన్లకు కేంద్రం శుభవార్త..సెక్షన్ 80డి లిమిట్ రూ.1లక్షకు పెంపు

Income Tax: సీనియర్ సిటిజన్లకు కేంద్రం శుభవార్త..సెక్షన్ 80డి లిమిట్ రూ.1లక్షకు పెంపు

  • whatsapp icon

Income Tax:2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ను కేంద్రఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈనెలలోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఎప్పటిలాగే తమకు ప్రోత్సాహకాలు అందించాలని పన్ను చెల్లింపుదారులు కోరుతున్నారు. 60ఏండ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు కూడా ఆదాయం అందుకుంటున్నట్లయితే పన్ను చెల్లించాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం పెరుగుతున్న జీవన వ్యయం, ఇతర ఖర్చుల కారణంగా ప్రస్తుతం ఉన్న ఇన్ కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ పెంచాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. యూనియన్ బడ్జెట్ 2024-25 నుంచి కొన్ని మినహాయింపులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

సెక్షన్ 80 డి లిమిట్ రూ. 1లక్ష వరకు పెంపు:

ఇన్ కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లోని సెక్షన్ 80డి అనేది ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులు, ఇతర వైద్య ఖర్చులకు సంబంధించిన ట్యాక్స్ డిడక్షన్లు కల్పిస్తుంది. 60ఏండ్ల వయసులోపు వారికి గరిష్టంగా రూ.25వేల వరకు ట్యాక్స్ డిడక్షన్లు పొందవచ్చు. సీనియర్ సిటిజన్లకు అయితే ఈ లిమిట్ రూ. 50వేల వరకు ఉంటుంది. వ్యాధుల బారినపడినప్పుడు చికిత్స చేయించుకునేందుకు మరో రూ. 5వేల వరకు ట్యాక్స్ మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు. గత 5ఏండ్లలో చూస్తే వైద్య ఖర్చలు భారీగా పెరిగిపోవడంతో..సెక్షన్ 80డి లిమిట్ పెంచాలనే డిమాండ్స్ పెరిగాయి. ఆరోగ్య బీమా పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించాలని కోరుతున్నారు.

గతంలో 2018లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఈ లిమిట్ ను రూ. 30వేల నుంచి రూ. 50వేల వరకు పెంచారు. అప్పటి నుంచి ఇంత వరకు మళ్లీ పెంచలేదు. గత 5ఏండ్లలో ఆసుపత్రుల బిల్లులు రెండింతలు అయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లోనే దీనికి సంబంధించి ప్రకటన ఉంటుందని అంతా భావించినప్పటికీ కేంద్రం అలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పుడు పూర్త స్థాయి బడ్జెట్లో ఈ విషయంపై కేంద్రం ప్రకటన చేసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. సీనియర్ సిటీజన్లకు హెల్త్ ఇన్సూరెన్స్ ట్యాక్స్ మినహాయింపు లిమిట్ రూ. 50వేల నుంచి రూ. 1లక్షకు పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సూచిస్తున్నారు.

Tags:    

Similar News