మీ పిల్ల‌ల‌ను సైనిక్ స్కూళ్లో చేర్పించాల‌నుకుంటున్నారా.. అయితే అప్లై చేయండి..

Sainik School Admission 2021: మీ పిల్ల‌ల‌ను సైనిక్ స్కూల్స్‌లో చేర్పించాల‌నుకుంటే ఇది సువ‌ర్ణ‌వ‌కాశం

Update: 2021-10-24 12:30 GMT

సైనిక్ స్కూల్స్ అడ్మిషన్స్ (ఫైల్ ఇమేజ్)

School Admission 2021: మీ పిల్ల‌ల‌ను సైనిక్ స్కూల్స్‌లో చేర్పించాల‌నుకుంటే ఇది సువ‌ర్ణ‌వ‌కాశం.6వ తరగతి, 9వ తరగతిలో ప్ర‌వేశాల‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా అవకాశం ఉంది. ఈ అడ్మిషన్లు 2022-23 అకడమిక్ సెషన్ కోసం క‌ల్పిస్తున్నారు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 26 అక్టోబర్ 2021 (సాయంత్రం 5 గంటల వరకు). దరఖాస్తు ఫీజు 26 అక్టోబర్ 2021 రాత్రి 11.50 వరకు చెల్లించవచ్చు. జనరల్ కేటగిరీ, రక్షణ సిబ్బంది, మాజీ ఉద్యోగుల పిల్ల‌ల‌కు దరఖాస్తు రుసుము రూ .550. SC, ST వర్గాలకు రూ. 400 కేటాయించారు. ఫారమ్ నింపి ఆన్‌లైన్‌లో సమర్పించాలి. ఇప్ప‌టికే సైనిక్ స్కూల్ అడ్మిషన్ 2021 నోటిఫికేషన్ కూడా ఇచ్చారు.

ఈ తప్పు చేస్తే అప్లికేషన్ రిజెక్ట్

NTA జారీ చేసిన సైనిక్ స్కూల్ అడ్మిషన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ 2021లో అభ్యర్థి ఒక దరఖాస్తు ఫారమ్‌ను మాత్రమే పూరించాలని స్పష్టంగా పేర్కొంది. ఒకటి కంటే ఎక్కువ ఫారమ్‌లను నింపినట్లయితే వారి దరఖాస్తు తిర‌స్క‌రిస్తారు. ఫారమ్‌ను నింప‌డానికి ముందు నోటిఫికేషన్‌లోని ఫోటో పరిమాణం, ఫార్మాట్, అవసరమైన సర్టిఫికేట్లు, ఇతర పత్రాలు అన్ని అవ‌స‌ర‌మ‌వుతాయి.

సైనిక్ స్కూల్ అడ్మిషన్ అర్హత, వయస్సు

మీరు సైనిక్ స్కూల్ క్లాస్ 6 అడ్మిషన్ కోసం దరఖాస్తు చేస్తున్నట్లయితే అభ్యర్థి వయస్సు (సైనిక్ స్కూల్ క్లాస్ 6 వయోపరిమితి) 31 మార్చి 2021 నాటికి 10 నుంచి12 సంవత్సరాల మధ్య ఉండాలి. సైనిక్ స్కూల్లో ఈ సంవ‌త్స‌రం బాలికలకు కూడా 6వ తరగతిలోనే అడ్మిషన్ క‌ల్పిస్తున్నార‌ని గుర్తుంచుకోండి. మీరు సైనిక్ స్కూల్ క్లాస్ 9 అడ్మిషన్ కోసం దరఖాస్తు చేస్తున్నట్లయితే అభ్యర్థి వయస్సు 31 మార్చి 2022 నాటికి 13 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉండాలి (సైనిక్ స్కూల్ క్లాస్ 9 వయోపరిమితి). ప్రవేశ సమయంలో విద్యార్థి 8 వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

AISSEE 2021 పరీక్ష ఎప్పుడు

సైనిక్ స్కూల్లో అడ్మిషన్ పొందడానికి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. దీని పేరు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంటే AISSEE 2021. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది. ఈసారి సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష 09 జనవరి 2022న నిర్వహిస్తారు.

Tags:    

Similar News