Pahalgam Terror Attack : ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా.. పూర్తి మద్దతు ఉంటుంది: రాహుల్ గాంధీ

Update: 2025-04-25 11:59 GMT
Pahalgam Terror Attack : ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా.. పూర్తి మద్దతు ఉంటుంది: రాహుల్ గాంధీ
  • whatsapp icon

Pahalgam Terror Attack : భారతీయులంతా ఐక్యంగా ఉండటం అవసరమని..తద్వారా ఉగ్రచర్యలను వారి లక్ష్యాలను దీటుగా ఎదుర్కొవచ్చని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని విపక్షాలన్నీ ముక్తకంఠంతో ఖండించాయని..దీనిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నా తాము మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. శ్రీనగర్ లో పర్యటించిన రాహుల్ గాంధీ, లెఫ్టినెంట్ గవర్నర్, సీఎంతో భేటీ కావడంతోపాటు ఉగ్రదాడి బాధితులను కలిసి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.

సమాజాన్ని విభజించడం, సోదరుల మధ్య తగాదాలు స్రుష్టించడమే టెర్రరిస్టుల పని. ఈ ఉగ్రచర్యను జమ్ము కాశ్మీర్ మొత్తం తీవ్రంగా ఖండించింది. వీరికి యావద్దేశం పూర్తిగా మద్దతుగా నిలిచింది. భారతీయులంతా ఐక్యంగా ఉండటం ఎంతో ముఖ్యం. అప్పుడే ఉగ్ర చర్యలను, వారి ప్రయత్నాలను దీటుగా ఎదుర్కొంటాం. కాశ్మీర్ తోపాటు దేశంలో పలు ప్రాంతాలకు చెందిన వారిపై కొందరు దాడులు చేయడం అత్యంత బాధాకరం..మనందరం ఐక్యంగా ఉండి ఉగ్రవాదాన్ని తరిమికొటాలి. లెఫ్టినెంట్ గవర్నర్, సీఎంతోనూ భేటీ అయ్యాను. ఏం జరిగిందో వారు పూర్తి వివరించారు. మా పార్టీ తరపున పూర్తి మద్దతు ఉంటుందని వారిద్దరికీ హామీ ఇచ్చాను అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 

Tags:    

Similar News