పెట్రోల్ ధ‌ర‌లు మెత్త‌గా పెంచేస్తున్నారు.. తాజాగా..

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఆగడం లేదు. ఆదివారం కూడా వరుసగా ఎనిమిది రోజు ధరలు పెరిగాయి. పెట్రోల్ పై లీటరుకు 62 పైసలు, డీజిల్ పై 64 పైసలను ఆయిల్ కంపెనీలు పెంచాయి.

Update: 2020-06-14 07:08 GMT

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఆగడం లేదు. ఆదివారం కూడా వరుసగా ఎనిమిది రోజు ధరలు పెరిగాయి. పెట్రోల్ పై లీటరుకు 62 పైసలు, డీజిల్ పై 64 పైసలను ఆయిల్ కంపెనీలు పెంచాయి. ఈ ఎనిమిది పెంపుల్లో అదనంగా పెట్రోల్ ధర లీటరుకు రూ 4.52, డీజిల్ రూ .4.64 పెరిగింది. తాజా రేట్లకు అనుగుణంగా ఢిల్లీలో పెట్రోల్ ధరను రూ .75.16 నుండి లీటరుకు 75.78 కు చేరుకోగా, డీజిల్ రేట్లు 73.39 రూపాయల నుండి లీటరుకు 74.03 కు పెంచినట్లు రాష్ట్ర చమురు మార్కెటింగ్ సంస్థల ధర నోటిఫికేషన్ తెలిపింది.

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినా.. స్థానిక అమ్మకపు పన్ను లేదా వ్యాట్ లను బట్టి వివిధ రాష్ట్రాల్లో రేట్లు మారుతూ ఉంటాయి. కరోనావైరస్ కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో 82 రోజుల తరువాత, చమురు కంపెనీలు గత ఆదివారం నుంచి ఖర్చులను బట్టి ధరలను సవరించడం ప్రారంభించాయి. దీంతో ధరల పెరుగుదలపై సామాన్యులు మండిపడుతున్నారు.. లాక్డౌన్ సమయంలో ఇది అదనపు భారం అని అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News