హోటల్స్‌, కస్టమర్లకు పేటీఎం‌ గుడ్‌న్యూస్‌

Update: 2020-06-11 15:45 GMT

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో డిజిటల్‌ పేమెంట్స్‌ సంస్థ పేటీఎం‌ హోటల్ వ్యాపారులకు, కస్టమర్లకు ఉపయోగపడే కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కొత్తగా 'స్కాన్‌ టు ఆర్డర్'‌ ను ప్రారంభించింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం లక్షలాది మంది భారతీయులకు సురక్షితమైన, కాంటాక్ట్‌లెస్ ఫుడ్ ను ఆర్డరింగ్ ద్వారా అందిస్తుంది. అయితే స్టార్‌ హోటల్స్‌, రెస్టారెంట్స్‌, కేఫ్‌..

ఎక్కడికి వెళ్లినా కస్టమర్లు పేటీఎం క్యూఆర్‌ కోడ్‌ను వినియోగించవచ్చని పేటీఎం సంస్థ తెలిపింది. నిన్నమొన్నటి వరకూ వినియోగదారుడు భోజనానికి ఆర్డర్‌ చేయాలంటే ముందుగా మెను పేపర్‌ను టచ్‌ చేయాల్సి ఉండేది.. కానీ ఇప్పుడు క్యూఆర్‌ స్కాన్‌తో తనకు ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చని పేటియం తెలిపింది. కాగా లేబల్‌ ఉత్పత్తిని (పేరు, లోగో, బ్రాండ్‌) రెస్టారెంట్లు, ఆహార సంస్థలకు క్యూఆర్‌ కోడ్‌ ద్వారా అందిస్తోంది పేటీఎం సంస్థ.

ఇష్టమైన ఆహారానికి సంబంధించిన ఆర్డర్‌ను పొందడానికి ఇలా చేయాలి..

1)ముందుగా పేటీఎమ్‌ యాప్‌ ద్వారా రెస్టారెంట్‌ క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి మెను చెక్‌ చేయాలి..

2)వినియోగదారులకు ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్‌ చేసుకోవాలంటే యాప్‌లో యాడ్‌ ఐకాన్‌ ఆఫ్షన్‌ సెలక్ట్‌ చేసుకోవాలి..

3)ఆఫ్షన్‌ సెలక్ట్‌ చేసాక గో టు కార్ట్‌ ఆఫ్షన్‌ ను సెలక్ట్‌ చేయాలి..

4)చివరగా ట్రాన్సాక్షన్‌ పూర్తి చేయుటకు ప్రొసీడ్‌ టు పేటీఎం ఆఫ్షన్‌ సెలక్ట్‌ చేయాలి. 

Tags:    

Similar News