మోడీతో టీవీ డిబేట్ లో చర్చకు సిద్ధం.. విచిత్ర ప్రతిపాదన పెట్టిన ఇమ్రాన్
*ఇండియాతో ట్రేడ్ ఆగిపోవడంతో తీవ్ర ఇబ్బందుల్లో పాక్ *ఇబ్బందులు అధిగమించేందుకు ఇమ్రాన్ ప్రపోజల్
Imran Khan: పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఎట్టకేలకు ద్వైపాక్షిక చర్చలకు ప్రతిపాదించారు. అయితే అధికారుల స్థాయి భేటీ కాకుండా ఆయన ఓ విచిత్రపాదన చేశారు. మన ప్రధాని మోడీతో టీవీలో లైవ్ డిబేట్ కు సిద్ధమంటూ కొత్త పంథాలో వాయిస్ వినిపించారు. దేశ విభజన జరిగిన 75 ఏళ్లలో రెండు దేశాల మధ్య సమస్యలు జటిలమవుతూ వచ్చాయే తప్ప ఏనాడూ సానుకూల పరిష్కారానికి నోచుకోలేదన్నారు. ఇద్దరమూ కలిసి ఓ టీవీ డిబేట్ లో అన్నీ మాట్లాడుకుంటే ఉపఖండంలోని 170 కోట్ల మంది ప్రజానీకానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. భారత ప్రజల్లో పాక్ పట్ల విపరీతమైన వ్యతిరేక భావం ఉందని, అది తమ దేశ వ్యాపార-వాణిజ్య కార్యకాలాపాల మీద తీవ్ర ప్రభావం చూపుతోందంటూ అసహనం వ్యక్తం చేశారు ఇమ్రాన్. రష్యూ-టుడే అనే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ప్రపోజల్ వినిపించారు. అయితే ఇమ్రాన్ ప్రతిపాదనకు భారత్ ఎలా రియాక్టవుతుందో చూడాలి.