India-Pakistan: బార్డర్ లో పాక్ ఆర్మీ దుశ్చర్య.. భారత సైన్యంపై కాల్పులు

terror attack
India-Pakistan: పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో అలజడి చోటుచేసుకుంది. పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత్ పై దుశ్చర్యకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుంచి కాల్పులకు తెగించింది. శత్రువుల దాడిని భారత ఆర్మీ కూడా సమర్థంగా ఎదుర్కొంటోంది. పాక్ సైన్యం కాల్పులకు దీటుగా భారత సైన్యం బదులు ఇస్తోంది.