Pahalgam: పహల్గాం ఉగ్రదాడి..ముగ్గురు ముష్కరుల ఊహా చిత్రాలు విడుదల

Update: 2025-04-23 08:03 GMT
Pahalgam: పహల్గాం ఉగ్రదాడి..ముగ్గురు ముష్కరుల ఊహా చిత్రాలు విడుదల
  • whatsapp icon

Pahalgam: జమ్ము కాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు టెర్రరిస్టుల ఊహాచిత్రాలను దర్యాప్తు సంస్థలు విడుదల చేశాయి. వీరిని ఆసిఫ్ ఫౌజి, సులేమాన్ షా, అబు తాలాగా గుర్తించారు. మూసా, యూనిస్, ఆసీఫ్ అనే కోడ్ నేమ్స్ తో కూడా ఉన్నట్లు పీటీఐ పేర్కొంది. వీరందరూ జమ్ముకశ్మీర్ కేంద్రంగా పనిచేసే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ లో సభ్యులు. ఉగ్రదాడి నుంచి బయటపడిన ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం ఈ చిత్రాలను తయారు చేశారు. టెర్రరిస్టులు పురుషులను వేరు చేసి వారి గుర్తింపులను పరిశీలిస్తున్న సమయంలో బాధితులు వారి ముఖాలు చూశారు. దీంతో జమ్ము కాశ్మీర్ లో ఉగ్రవేట షురూ అయ్యింది. దీంతోపాటు ఓ ఉగ్రవాది ఆటోమేటిక్ ఆయుధంతో ఉన్న ఫొటోను కూడా రిలీజ్ చేశారు.

ఉగ్రవాదుల వద్ద ఏకే-47 రైఫిల్స్ ఉన్నాయని, వాటితోనే వారు కాల్పులు జరిపారని చెబుతున్నారు. అలాగే, ఇద్దరు ఉగ్రవాదులు పాష్టో భాషలో మాట్లాడుతున్నారు. ఈ ఉగ్రవాదులు పహల్గామ్ చేరుకోవడానికి వారి మార్గం కూడా వెల్లడైంది. భద్రతా దళాలకు సంబంధించిన వర్గాల సమాచారం ప్రకారం, ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో ఈ ఉగ్రవాదులు దాదాపు 2 వారాల క్రితం భారత సరిహద్దులోకి ప్రవేశించారని తేలింది. ఆ తర్వాత రాజౌరి, వాధావాన్ మీదుగా పహల్గాం చేరుకున్నారు.

స్థానికులు అనుమానితులను గుర్తించడంలో సహాయపడటానికి ఉగ్రవాదుల స్కెచ్‌లను ఆ ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దర్యాప్తు సంస్థలు ఇప్పుడు ఈ అనుమానితుల దాక్కున్న ప్రదేశాలు, పరిచయాలను విచారించడంలో బిజీగా ఉన్నాయి. ఈ దాడికి లష్కరే తోయిబా విభాగమైన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అంటే TRF బాధ్యత వహించింది. పహల్గామ్ దాడిలో ఇద్దరు విదేశీ, ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు పాల్గొన్నారని నిఘా వర్గాలు తెలిపాయి. పహల్గామ్ దాడికి ప్రధాన సూత్రధారి సైఫుల్లా ఖలీద్ అని వర్గాలు తెలిపాయి. అతను పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) నుండి ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. అతని స్థానం రావల్కోట్ అని చెబుతారు. సైఫుల్లా కూడా నెల రోజుల క్రితం దాడి గురించి హెచ్చరించాడు. దీనికి సంబంధించిన 2019 నాటి వీడియో కూడా వైరల్ అయింది. ఈ వీడియోలో, సైఫుల్లా కాశ్మీర్ సమస్యను చల్లబరచడానికి అనుమతించకూడదని అన్నారు.

మంగళవారం సాయంత్రం 3గంటల సమయంలో పహల్గాం దాడి షురూ అయ్యింది. ముష్కరులు బాడీ కెమెరాలతో దాడిని చిత్రీకరించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయ్యింది. వీటిని హెల్మెట్లకు ధరించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తొలుత బాధితులు అందరినీ ఉగ్రవాదులు ఒకచోటుకు చేర్చి వారి గుర్తింపులను చెక్ చేశారు. అనంతరం కాల్చి చంపారు. కొందరిని స్నైపర్ వంటి టెక్నిక్స్ వాడి దూరం నుంచే కాల్చారు. 

Tags:    

Similar News