మణిపూర్ అంశంపై పట్టువీడని విపక్షాలు.. ఇవాళ పార్లమెంట్ ముందు విపక్షాల నిరసన
Parliament: విపక్షాల ఆందోళనలతో ఎలాంటి చర్చలు లేకుండా వాయిదా
Parliament: మణిపూర్ అంశంపై విపక్షాలు పట్టువీడటం లేదు. పార్లమెంట్‌లో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్న విపక్ష పార్టీలు.. ఇవాళ సుదీర్ఘ చర్చ జరిగేలా పార్లమెంట్‌లో ఒత్తిడి తీసుకొచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇవాళ మణిపూర్ ఘటనపై పార్లమెంట్ ముందు నిరసనకు కూడా పిలుపునిచ్చాయి. మణిపూర్‌లో హింసాకాండపై ప్రధాని పార్లమెంట్‌లో ఈ అంశంపై నోరు విప్పాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. అయితే మణిపూర్ ఘటనపై చర్చకు తాము సిద్ధమేనని ప్రకటిస్తూ వస్తోంది అధికార పార్టీ. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇస్తారని.. ఇతర అంశాలపై చర్చల నేపథ్యంలో స్వల్పకాలిక చర్చకు సిద్ధమని తెలిపింది. దీనికి విపక్ష పార్టీలు ససేమిరా అంటున్నాయి. పార్లమెంట్‌లో మణిపూర్ అంశంపై సుదీర్ఘ చర్చ జరపాలని.. ప్రధాని మోడీనే పార్లమెంట్‌లో సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.