Amit Shah VS Stalin: అమిత్ షా కాదు.. ఏ షా కూడా తమిళనాడులో అడుగుపెట్టలేరు!
Amit Shah VS Stalin: గతంలో కంటే ఈసారి బీజేపీ ఇంకా తీవ్రంగా తమిళ ఐడెంటిటిని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని అన్నారు. ఎవరిని కలుపుకున్నా సరే.. డీఎంకే తిరిగి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు.

Amit Shah VS Stalin: అమిత్ షా కాదు.. ఏ షా కూడా తమిళనాడులో అడుగుపెట్టలేరు!
Amit Shah VS Stalin: తమిళనాడు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ద్రావిడియ ఉద్యమానికి నిలయంగా మారిన తమిళ మట్టి ఢిల్లీ నియంత్రణను ఏనాడూ ఒప్పుకోదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పష్టంగా చెప్పారు. తిరువళ్లూర్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ 2026లో తమిళనాడు తిరిగి డ్రావిడ మోడల్ పాలననే ఎన్నుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇటీవలే తిరిగి కలిసిన బీజేపీ–అన్నాడీఎంకే కూటమిపై స్టాలిన్ ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై స్పందిస్తూ తమిళనాడు ఎప్పటికీ ఢిల్లీ ఆదేశాలకు లోబడి ఉండదన్నారు. ఆ రాష్ట్ర ప్రజల గర్వాన్ని, స్థానిక పాలనకు సంబంధించిన నిర్ణయాలను బయట వ్యక్తులు నియంత్రించలేరని స్పష్టం చేశారు. పార్టీల భగ్నం చేయడం, రెయిడ్‌లు వేయడం లాంటి కేంద్ర పద్ధతులు తమిళనాడులో పనికి రావని హెచ్చరించారు. ఈ రాష్ట్రం ఎప్పుడూ స్వయం గౌరవంతో బతికిందని, ఢిల్లీ శాసనానికి లోబడే పరిస్థితి లేదు అన్నారు.
ఇటీవల ప్రధాని మోదీ తమిళనాడులో మాట్లాడుతూ కేంద్రం ఎంతో నిధులు ఇస్తోందన్న వ్యాఖ్యలపై స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రాలు వెత్తుకుంటూ కేంద్రం వద్దకు రావాలా అని గతంలో మోదీనే అడిగారని గుర్తు చేశారు. తమ డిమాండ్లు సహాయం కోసం కాదు, తమ హక్కుల కోసమేనని స్పష్టంగా చెప్పారు.
తమిళుల పట్ల బీజేపీ నేతలు చేసిన అనవసర వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, రాష్ట్ర ప్రజల గౌరవాన్ని తక్కువ చేసే ప్రయత్నాలు ఈ రాష్ట్రంలో నిలబడవని హెచ్చరించారు. ఒడిశాలోని ప్రముఖ నాయకుడు పాండియన్‌కు సంబంధించిన వ్యాఖ్యలతో బీజేపీ వాదనలకు తాము ఎలా బదులు చెప్పాలో తెలుసని స్టాలిన్ వ్యాఖ్యానించారు. గతంలో కంటే ఈసారి బీజేపీ ఇంకా తీవ్రంగా తమిళ ఐడెంటిటిని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని అన్నారు. ఎవరిని కలుపుకున్నా సరే, డీఎంకే తిరిగి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇది ఒక పార్టీ గెలుపు కాదు.. ద్రావిడ ప్రజల గౌరవానికి గెలుపు అని చెప్పారు.