Mallikarjun Kharge: రైతుల గొంతుకను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోంది
Mallikarjun Kharge: రైతుల గొంతుకను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు.
Mallikarjun Kharge: రైతుల గొంతుకను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. పెద్ద సంఖ్యలో రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోకి చేరిన నేపథ్యంలో వారిని రైతులను నగరంలోకి రాకుండా అధికారులు అడ్డుకున్నారన్నారు. రైతులకు ఇచ్చిన మూడు హామీలను మోదీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఖర్గే ఆరోపించారు. 750 మంది రైతుల ప్రాణాలను బలి తీసుకున్నారన్నారు.
10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం దేశంలోని రైతులకు ఇచ్చిన మూడు వాగ్దానాలను తుంగలో తొక్కిందన్నారు. ప్రస్తుతం 62 కోట్ల మంది రైతులు తమ గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కాంగ్రెస్ రైతుల ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. అలాగే రైతుల చలో ఢిల్లీ పాదయాత్రపై కాంగ్రెస్ నేత పవన్ ఖేడా స్పందించారు. గత రెండేళ్లలో రైతులకు ఏం కావాలో అర్థం కాలేదా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.