Indian Visa: ఇండియన్స్ వీసా లేకున్నా ఈ దేశాల్లో తిరగవచ్చు..! ఎలాగంటే..
* హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2021 లో మొత్తం 199 దేశాలలో భారతదేశం 90 వ స్థానంలో ఉంది
Indian visa: ఇండియన్స్ వీసాలేకున్నా సరే చాలా దేశాలు సందర్శించవచ్చు. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2021 లో మొత్తం 199 దేశాలలో భారతదేశం 90 వ స్థానంలో ఉంది. ఈ ర్యాంక్ ఏ దేశ పాస్‌పోర్ట్ ఎంత శక్తివంతమైనదో చూపిస్తుంది. విశేషమేమిటంటే గత కొన్నేళ్లుగా భారత్ ర్యాంకు పడిపోతూ వస్తుంది. పాస్‌పోర్ట్‌కి సంబంధించి పలు విషయాలు తెలుసుకుందాం.
పాస్‌పోర్ట్ ర్యాంకింగ్‌లో భారతదేశం 2020 నుంచి 90 వ స్థానానికి అంటే 6 స్థానాలు దిగజారింది. 58 దేశాలు భారతీయ పౌరులకు వీసా లేకుండా ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తాయి. 2020 లో భారతదేశ ర్యాంక్ 84. 2011 నుంచి 2021 వరకు భారతదేశ ర్యాంకింగ్ చూస్తే కేవలం 2013 లో మాత్రమే ఉత్తమంగా ఉంది. ఆ సమయంలో 199 దేశాలలో భారతదేశం 74 వ స్థానంలో ఉంది.
అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? ఈ జాబితాలో జపాన్, సింగపూర్ మొదటి స్థానంలో ఉన్నాయి. ఈ రెండు దేశాల పౌరులను వీసా లేకుండా 192 దేశాలు అంగీకరిస్తున్నాయి. తరువాత జర్మనీ, దక్షిణ కొరియా సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి.
అదే సమయంలో మూడో స్థానంలో ఫిన్లాండ్, ఇటలీ, స్పెయిన్, లక్సెంబర్గ్ ఉన్నాయి. ఆస్ట్రేలియా, డెన్మార్క్ నాలుగో స్థానంలో ఉన్నాయి. తర్వాత ఫ్రాన్స్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, పోర్చుగల్ ఐదో స్థానంలో ఉన్నాయి. ర్యాంకింగ్ ఏ ప్రాతిపదికన లెక్కిస్తారు. పాస్‌పోర్ట్ హోల్డర్ వీసా లేకుండా తమ దేశంలోకి ప్రవేశించడానికి ఎన్ని దేశాలు అనుమతిస్తాయనే దాని ఆధారంగా ర్యాంకింగ్ నిర్ణయిస్తారు.
దీని అర్థం భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు వీసా లేకుండా ఆ దేశాలకు వెళ్లి అక్కడ వీసా పొందవచ్చు. పాస్‌పోర్ట్ ఎన్ని దేశాల్లోకి అనుమతి ఉంటుందో అంత బలమైనదని అర్థం. అదే సమయంలో గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో పాకిస్తాన్ 113వ స్థానంలో ఉంది.
కేవలం 32 దేశాలు మాత్రమే పాకిస్థానీ పౌరులకు వీసా రహిత ప్రవేశాన్ని కల్పిస్తున్నాయి. ఈ జాబితాలో ఆఫ్ఘనిస్థాన్ చివరి స్థానంలో అంటే 116 వ స్థానంలో ఉంది కేవలం 26 దేశాలు మాత్రమే వీసా రహిత ప్రవేశాన్ని కల్పిస్తున్నాయి.