జాతీయ రాజధాని ఢిల్లీలో సోమవారం మళ్లీ ప్రకంపనలు సంభవించాయి. నేషనల్ సెంటర్ ఫర్ సైంటాలజీ (సీస్మోలజీ) ప్రకారం రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 2.1 గా నమోదయింది. మధ్యాహ్నం 1 గంటలకు 18 కిలోమీటర్ల లోతులో ఇది సంభవించిందని ఏజెన్సీ తెలిపింది. దీంతో ఢిల్లీ మరియు పరిసర ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు ప్రకంపనలు సంభవించాయి. అయితే దీని వల్ల ఎటువంటి నష్టం జరగలేదు.
కాగా భూకంప కేంద్రం హర్యానాలోని గురుగ్రామ్ సమీపంలో ఉందని భారతదేశ జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం తెలిపింది. ఢిల్లీ పరిధిలో 11 రోజుల్లో రెండోసారి ప్రకంపనలు సంభవించాయి. మే 29న 4.6 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి.. అయితే, అప్పుడు కూడా ఎటువంటి నష్టం జరగలేదు. అంతకుముందు మే 15, మే 10, ఏప్రిల్ 13, ఏప్రిల్ 12న కూడా ప్రకంపనలు సంభవించిన సంగతి తెలిసిందే.