Lockdown: తమిళనాడులో పూర్తిస్థాయి లాక్డౌన్
Lockdown: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Lockdown: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్లుండి నుంచి (10వ తేదీ) నుంచి రెండు వారాలపాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్టు ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు పలు చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో అత్యవసరం కాని సేవలన్నీ నిలిచిపోనున్నాయి. తమిళనాడు సీఎంగా స్టాలిన్ శుక్రవారం స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొవిడ్ కేసుల కట్టడికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు కర్ణాటకలో 10 నుంచి 24వ తేదీ వరకు లాక్డౌన్ విధించగా.. ఇక కేరళ ప్రభుత్వం నేటి నుంచి ఈ నెల 16 వరకు లాక్‌డౌన్‌ను ప్రకటించింది.