Jammu and Kashmir Ter*ror Attack: ఉగ్రదాడి గురించి ముందస్తు సమాచారం ఉందా? గత నెలలో హోంశాఖ కార్యదర్శి ఏం చెప్పారు?
Jammu and Kashmir Ter*ror Attack: మొబైల్ ఫోన్‌లు వాడటం మానేసి, సిగ్నల్ లేని ప్రాంతాల్లో.. వ్యక్తిగతంగా సమాచారాన్ని పంచుకుంటూ, మరింత రహస్యంగా కదలికలు సాగిస్తున్నారు.

Jammu and Kashmir Ter*ror Attack: ఉగ్రదాడి గురించి ముందస్తు సమాచారం ఉందా? గత నెలలో హోంశాఖ కార్యదర్శి ఏం చెప్పారు?
Jammu and Kashmir Ter*ror Attack: ఉగ్రదాడి జరిగిన వెంటనే అందరిలో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకోవడం సాధారణ విషయమే. అటు ప్రభుత్వం కూడా ఘాటుగానే బదులిచ్చింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్థాన్‌పై ఆంక్షలు విధించింది. ఇప్పటివరకు బాగానే ఉంది కానీ.. ఈ ఉగ్రదాడుల విషయంలో సెక్యూరిటీ ఫెయిల్యూర్ ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. జమ్ముకశ్మీర్‌లో పెద్ద ఉగ్రదాడి జరగబోతోందన్న చర్చలు నెలలుగా నడుస్తున్నాయి. భద్రతా వర్గాలు, ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తంగా ఉన్నట్టు ప్రకటించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎన్నోసార్లు జమ్ముకశ్మీర్‌ను సందర్శించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్వయంగా ఈ విషయంపై సందర్భాలున్నాయి. కానీ.. దాడి మాత్రం జరిగింది. చాలా జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతున్నా ఉగ్రవాదం మాత్రం మరొకసారి దేశ గుండెలోకి తుపాకీ పెట్టగలిగింది.
కతువా, రాజౌరీ, పూంచ్ లాంటి ప్రాంతాల్లో ఉగ్రవాద కదలికలు ఏవో మొదలైపోయినప్పటి నుంచే ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. అడవుల్లో ముష్కరుల ఉన్నట్లు వార్తలొచ్చాయి. BSF నుంచి CRPF వరకు... పోలీస్ నుంచి RAW వరకు ప్రతీ విభాగం అప్రమత్తంగా ఉన్నట్లు పత్రికల్లో న్యూస్ వచ్చింది. హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ జమ్ముకు వచ్చి సమీక్షలు నిర్వహించారంటే.. కేంద్రం ఎంతగా ఆందోళన చెందిందో అర్థమవుతుంది. గత మార్చి 10న గోవింద్ కశ్మీర్‌లో పరిస్థితులపై పలు సూచనలు కూడా చేశారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ మరింత బలోపెతం చేయాలని కూడా చెప్పారు. కానీ.. తీరా ఏప్రిల్ 22న పహల్గాంలో అమాయక పర్యాటకులపై తుపాకులు పగిలినప్పుడు.. అటు ఇంటెలిజెన్స్, ఇటు భద్రతా బలగాల అప్రమత్తత మట్టిలో కలిసిపోయింది.
నిజానికి అమిత్ షా చాలాసార్లు కశ్మీర్‌ను సందర్శించారు. అభివృద్ధి, భద్రత, పునరావాసం పేరుతో పర్యటనలు జరిపారు. అజిత్ దోవల్ కూడా పుల్వామా తర్వాత కశ్మీర్ చుట్టూ అనేకసార్లు తిరిగారు. గత ఫిబ్రవరిలో కతువా జిల్లాలో ఉగ్రవాదుల చేతిలో అనేకమంది పౌరులు చనిపోయారు. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. కతువా అడవుల్లో ముష్కరుల కదలికలు ఉన్నట్టు స్థానికులు సైతం అనేకసార్లు చెప్పారు. ఇటు ఇప్పుడు దాడులు జరిగిన అనంత్‌నాగ్ జిల్లాలోనూ ఉగ్రవాదులున్నట్టు సమాచారం ఉంది. పైగా బైసరన్ అనేది పర్యాటక ప్రాంతం. నిత్యం వేలాది మంది వస్తుంటారు. అందుకే ముష్కరులకు అది టార్గెట్ అయ్యింది. పదుల సంఖ్యలో ప్రాణాలు పోవడానికి కారణమైంది.
ఇక ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా అప్రమత్తంగా ఉందని అధికారులు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నా, వాస్తవంగా పహల్గాం దాడి ముందు వచ్చిన సమాచారం ఎలా ఉపయోగపడిందన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న. ప్రధానంగా అడవీ మార్గాల నుంచి వచ్చిన ముష్కరులు పర్యాటక ప్రాంతానికి ఎలా చేరుకున్నారు? దారి మధ్య వారిని ఎవరూ కూడా ఎలా గుర్తించలేకపోయారు? సర్వేలైనా, చెక్‌పాయింట్లు అయినా, ముందస్తు నిఘా వ్యవస్థలైనా.. అన్నీ ప్రశ్నార్థకంగా మారాయి. ప్రభుత్వ ప్రకటనల ప్రకారం స్థానిక మద్దతుదారుల సహకారంతో ఆయుధాల సమీకరణ జరిగినట్టు వివరాలు బయటపడ్డాయి. దీనికి తోడు ఉగ్రవాద గ్రూపులు ఇప్పుడిప్పుడే టెక్నాలజీ వాడకాన్ని తక్కువగా చేస్తూ, మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ లాంటివి ఉపయోగించకుండా, తమను ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌కు దూరంగా ఉండేలా చూసుకుంటున్నారు. ముందు టెర్రరిస్టులు ఫోన్లు, ఇంటర్నెట్ ఉపయోగించేవాళ్లే. ఆ సమయంలో భద్రతా వర్గాలు వీళ్లను పట్టుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు వాళ్లు మొబైల్ ఫోన్‌లు వాడటం మానేసి, సిగ్నల్ లేని ప్రాంతాల్లో.. వ్యక్తిగతంగా సమాచారాన్ని పంచుకుంటూ, మరింత రహస్యంగా కదలికలు సాగిస్తున్నారు. అందుకే.. ఇప్పుడు టెర్రరిస్టులను పట్టుకోవడం కాస్త కష్టంగా మారిందనే చెప్పాలి.