Indus water Treaty: సింధు జలాల ఒప్పందం నుంచి వైదొలగడం వెనుక అసలు నిజం ఇదే.. పాకిస్థాన్‌ ఆకలితో ప్రా*ణాలు విడుస్తుందా?

Indus water Treaty: మరోవైపు దేశంలో మిలిటరీ వ్యయాలు పెరిగినప్పటికీ, ప్రజల ప్రాథమిక అవసరాల్ని తీర్చలేని పరిస్థితి నెలకొనడం వల్ల ప్రభుత్వ వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది.

Update: 2025-04-24 14:30 GMT
Indus water Treaty

Indus water Treaty: సింధు జలాల ఒప్పందం నుంచి వైదొలగడం వెనుక అసలు నిజం ఇదే.. పాకిస్థాన్‌ ఆకలితో ప్రా*ణాలు విడుస్తుందా?

  • whatsapp icon

Indus water Treaty: భారత్‌పై నిరంతరం ఉగ్రవాదులను ఉసిగొల్పుతూ, శాంతిని భంగం చేస్తున్న పాకిస్తాన్‌కు ఇప్పుడు కుడివైపు నుండి దెబ్బ తగిలినట్టైంది. పహల్గాం దాడి తర్వాత భారత్ తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఒకటైన సింధు జలాల ఒప్పందం నుంచి వైదొలగాలన్న ఆలోచన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది. ఇది కేవలం నీటి ప్రసక్తి మాత్రమే కాదు, భౌగోళికంగా, రాజకీయంగా, ఆర్థికంగా పాక్‌ను అసలు స్థాయిలో కుదేలు చేసే చర్యగా మారొచ్చని అంచనాలు ఉన్నాయి.

భారత్ ఎన్నేళ్లుగా ఈ ఒప్పందాన్ని గౌరవిస్తూ, సింధు నదుల నీటిని పాకిస్తాన్‌కు సముచితంగా వదిలిస్తూనే వచ్చింది. అయితే పాకిస్తాన్ మాత్రం ప్రతిసారీ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తూ, జలవనరులను కూడా రాజకీయ ఆయుధంగా వాడేందుకు ప్రయత్నిస్తోన్న తీరు కొనసాగిస్తోంది. పైగా, ఇండియా నిర్మిస్తున్న హైడ్రో ప్రాజెక్టులపై తరచూ అభ్యంతరాలు తెలుపుతూ, వాటిని అంతర్జాతీయ న్యాయస్థానాల్లోకి లాగే ప్రయత్నాలు కూడా చేసింది. కానీ తన బకాయిలను తీర్చకపోయినా, ఉగ్రవాదానికి అండగా ఉన్నా, భారత్ మాత్రం నీటిపై ఉన్న ఒప్పందాన్ని గౌరవిస్తూ వచ్చింది.

ఇప్పుడు పుల్వామా తర్వాత పహల్గాం దాడి జరిగిన నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయాలన్న నిర్ణయం మాత్రం పూర్తిగా భిన్నమైనది. ఇది కేవలం నీటి నియంత్రణ సమస్యే కాదు.. ఇది ఒక స్ట్రాటజిక్ వాప్‌న్. ఎందుకంటే ఈ నిర్ణయం వల్ల పాకిస్తాన్‌కు ఎదురయ్యే దెబ్బ అత్యంత తీవ్రమైనదిగా ఉండే అవకాశం ఉంది.

సింధు బేసిన్ మీదే ఆధారపడే వ్యవసాయ రంగం డిగ్రీలు తగ్గినా, తాగునీటి కొరత ఏర్పడినా, హైడ్రోపవర్ ఉత్పత్తి క్షీణించినా..వాటన్నింటికన్నా ముందుగా పాక్ ఎదుర్కొనే దెబ్బ 'ఆహార భద్రత' పై ఉంటుంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ, ఆర్ధిక దివాలా పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్‌కి ఇది మరింత ఉత్పాతం తెచ్చే పరిణామం అవుతుంది. మరోవైపు దేశంలో మిలిటరీ వ్యయాలు పెరిగినప్పటికీ, ప్రజల ప్రాథమిక అవసరాల్ని తీర్చలేని పరిస్థితి నెలకొనడం వల్ల ప్రభుత్వ వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. రాజకీయంగా అస్థిరత పెరిగితే, మిలిటరీ వ్యవస్థే పాలన చేపట్టే అవకాశాలు కూడానే ఉన్నాయి. ఇది మొత్తంగా పాక్‌ను అంతర్గతంగా కుంగదీసే పరిణామాలకు దారితీయవచ్చు.

సింధు ఒప్పందం ఒక అంతర్జాతీయ ఒప్పందం కావడంతో, దీన్ని రద్దు చేయడం అంత తేలిక కాదు. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ కోర్టుల ద్వారా పాక్ తమ వాదనను ముందుకు తెస్తే భారత్‌కి పలు న్యాయపరమైన అడ్డంకులు ఎదురవుతాయి. ముఖ్యంగా చైనా పాక్‌కు నీటి విషయంలో మద్దతుగా నిలవడం, బ్రహ్మపుత్ర నదిని భారత్‌కు అడ్డుకోవడానికి ప్రయత్నించడం వంటి విషయాలు చర్చనీయాంశం కావచ్చు. అయితే భారత్‌కి అనుకూలంగా ఉన్న విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు గ్లోబల్ కమ్యూనిటీ భారత్‌ను ఒక బాధ్యతాయుతమైన దేశంగా చూస్తోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్‌కు వ్యతిరేకంగా ఇప్పటికే పలు దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అలాంటి సమయంలో సింధు జలాల ఒప్పందం నుంచి భారత్ వెనక్కి తగ్గితే, పాక్‌కు మద్దతు ఇవ్వడానికి అంతర్జాతీయ సమాజం కూడా రెండు సార్లు ఆలోచించాల్సి రావచ్చు.

ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మోదీ సర్కార్ దేశంలో జాతీయవాద భావోద్వేగాలను మరింత పెంచేలా మారుతుంటుంది. 'మోది దెబ్బకు పాక్ బలహీనపడుతోంది' అనే నారేటివ్ దేశవ్యాప్తంగా ప్రజల్లో తిరుగులేని మద్దతును తెచ్చేలా మారుతుంది. ఉగ్రదాడులకు ప్రతీకారం తీసుకోవడంలో ఇదొక శక్తివంతమైన దూకుడు నిర్ణయంగా చరిత్రలో నిలిచిపోవచ్చు. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడమంటే, అది కేవలం నీటిపై ఆధారపడిన ప్రక్రియ కాదు. అది ఒక జియోపాలిటికల్ గేమ్ ఛేంజర్. ఇది పాక్‌కి ఆర్థిక, సామాజిక, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో కలిపి గట్టి ఎదురుదెబ్బ అవుతుంది. అయితే ఈ నిర్ణయాన్ని అమలు పరచడంలో భారత్‌కి వ్యూహాత్మకంగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. అన్ని వైపులా అంతర్జాతీయ మద్దతును సమీకరించుకుని, నిర్ణయం తీసుకోవడమే సరైన మార్గం. అప్పుడు మాత్రమే ఈ 'నీటి యుద్ధం'లో భారత్ విజయంతో బయటపడగలదు.

Tags:    

Similar News