మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌కు పోటీగా తెరపైకొచ్చిన దేశీ సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫాం కూ యాప్ సంచలనాలు సృష్టిస్తోంది. రోజు రోజుకు కూ యాప్ యూజర్లు భారీగా పెరుగుతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే 10 లక్షల మంది కొత్త యూజర్లు చేరారు. మొత్తం వినియోగదారుల సంఖ్య 30 లక్షలు దాటేసింది. పలువురు దేశీ ఔత్సాహిక వ్యాపారవేత్తలు .. కూ యాప్‌లో ఇన్వెస్ట్ చేయడంపై ఆసక్తి చూపుతున్నారు. అందరి మన్ననలు పొందుతున్న కూ యాప్ ప్రత్యేకతలేంటి ? తక్కువ సమయంలోనే అందరి మన్ననలు పొందుతున్న స్వదేశీ యాప్ విశేషాలేంటి ?
ఇటీవలే కేంద్ర మంత్రి పియూష్ గోయెల్.. తాను స్వదేశీ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ పాం కూ యాప్‌లో చేరుతున్నానంటూ ట్వీట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. భారత ప్రభుత్వంతో ట్విట్టర్ మధ్య ఒప్పందం విరమణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కూ యాప్ ఫుల్ పాపులర్ అయిపోయింది. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేస్తున్న 1000 ట్విట్టర్ అకౌంట్లను డిలీట్ చేయమని ప్రభుత్వం సూచించినప్పటికీ ట్విట్టర్ అంగీకరించలేదు. అప్పటినుంచి దేశీ కూ యాప్ ఫుల్ ట్రెండ్ అవుతోంది.
కూ అనేది ట్విట్టర్ మాదిరిగానే మైక్రో బ్లాగింగ్ సర్వీసు. కో ఫౌండర్, సీఈఓ అయిన అప్రమేయ రాధాక్రిష్ణ ఈ యాప్ ను డెవలప్ చేశారు. 2020 మార్చిలోనే లాంచ్ చేశారు. డిజిటల్ ఇండియా ఆత్మనిర్భార్ భారత్ ఛాలెంజ్ ఎంపిక చేసిన బెస్ట్ ఇండియన్ యాప్స్ లో ఇదొకటి. స్థానిక భాషల్లోనే యూజర్లు తమ అభిప్రాయాలను వ్యక్తపరచేలా డిజైన్ చేశారు. అందరికి అర్థమయ్యేలా ఉండేందుకు వీలుగా ఈ యాప్ డిజైన్ చేయడం జరిగింది. భారతీయులు ఎవరైనా తమ మాతృభాషను ఎంచుకుని యాక్సస్ చేసుకోవచ్చు.
కూ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ ఫాంలలో అందుబాటులో ఉంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. భారతీయ భాషల్లోనే ఈ యాప్ అందుబాటులో ఉంది. బాంబినేట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అందించే యాప్‌గా యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. కూ వెబ్ సైట్ ద్వారా కూడా లాగిన్ కావొచ్చు.
కూ యాప్ ఫీచర్లు కూడా ట్విట్టర్ మాదిరిగానే ఉన్నాయి. యూజర్లు ఎవరైనా ఈజీగా బ్రౌజ్ చేసుకోవచ్చు. మెసేజ్‌లు, టెక్స్ట్, ఆడియో లేదా వీడియో ఫార్మాట్లలో న్యూస్ ఫీడ్‌లో సెండ్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. కన్నడ, తమిళ్, తెలుగు, ఇంగ్లీష్ భాష ఆప్షన్లు ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో ఇతర భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. కూ యాప్‌లో ట్వీట్ మాదిరిగా చేయాలంటే 400 వరకు క్యారెక్టర్లకు అనుమతి ఉంది. ప్రత్యేకించి లాంగ్వేజీ కమ్యూనిటీలు కూడా ఉన్నాయి. ఏ భాషలోనైనా సంబంధిత కంటెంట్ యాక్సస్ చేసుకోవచ్చు.