India-Pakistan War: విమాన వాహక నౌక చుట్టూ విషం చిమ్ముతున్న యుద్ధం.. భారత్‌ రీవెంచ్‌ ప్లాన్‌ రెడీ!

India-Pakistan War: ఇటు ఏప్రిల్‌ 25న LOC వెంబడి పాక్‌-ఇండియా ఆర్మీ పరసర్పం కాల్పులకు తెగబడ్డాయి.

Update: 2025-04-25 17:51 GMT
India-Pakistan War

India-Pakistan War: విమాన వాహక నౌక చుట్టూ విషం చిమ్ముతున్న యుద్ధం.. భారత్‌ రీవెంచ్‌ ప్లాన్‌ రెడీ!

  • whatsapp icon

India-Pakistan War: సరిహద్దుల్లో సింహగర్జనలు వినిపిస్తున్నాయి. ప్రతి క్షణం ఉత్కంఠతో నిండిపోయింది. దేశ గౌరవాన్ని తాకిన మంట, అమాయకుల రక్తంతో తడిసిన మట్టి, బాధితుల కన్నీళ్లు... ఇవన్నీ ఇప్పుడు ప్రతీకారంగా మారుతున్నాయి. శత్రువు ఇండియా గడప దాటి వచ్చాడు. ఇప్పుడు అతనికి సమాధానం చెప్పేది బుల్లెట్లేనా? జమ్ముకశ్మీర్‌-పహల్గామ్‌లో పదులు సంఖ్యలో ప్రాణాలను బలి తీసుకున్న ఉగ్రవాదుల వెనుక ఉన్నది ముమ్మాటికి పాకిస్థానేనని భారత్‌ బలంగా నమ్ముతోంది. ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను అమాంతం పెంచుతోంది. ఇప్పుడు అందరికి ఒక్కటే ప్రశ్న.. ఈ తగాదా యుద్ధరూపం దాల్చుతుందా? ఇండియా సముద్రపు ఉపరితలంపై ఇప్పుడు ఒక యోధుడు చక్కర్లు కొడుతున్నాడు. అతని పేరే విక్రాంత్. పహల్గామ్‌పై విరుచుకుపడ్డ క్రూరత్వానికి బదులుగా సముద్రపు ఊహలన్నీ ఇప్పుడు ఈ విమాన వాహక నౌక చుట్టూ తిరుగుతున్నాయి. కర్ణాటకలోని కార్వార్ తీరాన్ని తాకుతూ, అరేబియా సముద్రంలో తన దూకుడును చాటుతోంది విక్రాంత్‌.

ఇది ఒక హెచ్చరిక కాదు.. తమ పౌరుల జోలికొస్తే మౌనంగా ఉండబోమని.. తమ రక్తాన్ని తాగిన వారికి సమాధానం ఇచ్చేందుకు వెనుకాడబోమని చెప్పే సంకేతం. ఇటు ఎత్తైన అలల మధ్య ఈ నౌక.. తన భుజాలపై మిగ్-29K యుద్ధవిమానాలను మోస్తోంది. వాటి రెక్కలు గాలిని చీల్చే వేగంతో ముందుకుసాగుతున్నాయి. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన ఈ నౌక 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పుతో, సుమారు 45,000 టన్నుల బరువుతో ఉంటుంది.

ఇది ఒకేసారి 30 వరకు యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను మోసుకెళ్లగలదు. ఇవి గగనతల, సముద్రతల నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటాయి. బరాక్-8 క్షిపణుల వ్యవస్థతో, ఇది గాల్లోని శత్రు లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదించగలదు. ఇటీవల INS విక్రాంత్ తన తుది ఆపరేషనల్ క్లియరెన్స్‌ను కూడా పొందింది. ఇటు ఏప్రిల్‌ 25న LOC వెంబడి పాక్‌-ఇండియా ఆర్మీ పరసర్పం కాల్పులకు తెగబడ్డాయి.

Tags:    

Similar News