సరిహద్దులో వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకుందాం : చైనా
తూర్పు లడఖ్ లో, భారతదేశం, చైనా బలగాల మధ్య ఉద్రిక్తత ముగిసింది.
తూర్పు లడఖ్ లో, భారతదేశం, చైనా బలగాల మధ్య ఉద్రిక్తత ముగిసింది.శనివారం లెఫ్టినెంట్ జనరల్ లెవల్ మిలిటరీ కమాండర్ల మధ్య చర్చ జరిగింది. ఆదివారం దీనిపై విదేశాంగ శాఖ సమాచారం ఇచ్చింది. మొత్తం వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించడానికి ఇప్పుడు చైనా సిద్ధంగా ఉందని ఆ దేశ మంత్రిత్వ శాఖ తెలిపింది. ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత పరిష్కారం కోసం ఇరువర్గాలు అంగీకరించాయి.
కాగా ఇరు దేశాల మధ్య చర్చలు చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరిగాయి. దౌత్య సంబంధాల 70 వ వార్షికోత్సవాన్ని కూడా ఇరువర్గాలు గుర్తుచేసుకున్నాయి. "మొదట సిక్కింలో ఆ తరువాత లడఖ్‌లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఐసి) లో ఇరు దేశాల మధ్య వివాదం ఏర్పడింది." ఇది మే 5 న తూర్పు లడఖ్‌లోని పంగోంగ్ సరస్సు నుండి ఉద్భవించింది. దాంతో ఈ నెలలో భారత్, చైనా మూడుసార్లు ఘర్షణ పడ్డాయి. ఈ సంఘటనలపై, భారత సైనికులు తమ సరిహద్దులోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.