దేశంలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లేదు : ఐసిఎంఆర్

Update: 2020-06-11 16:30 GMT

కరోనా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ దేశంలో ఇంకా ప్రారంభం కాలేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) గురువారం వెల్లడించింది. ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ ప్రభుత్వ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అనే పదంపై చర్చ పూర్తి స్థాయిలో ఉందని.. అయితే ఈ విషయంపై WHO సరైన వివరణ ఇవ్వలేదని అన్నారు.

అలాగే భారత్ లో 1% కన్నా తక్కువ జనాభాపై కరోనా ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. పట్టణ ప్రాంతాలు మరియు కంటైనర్ జోన్లలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని. అయితే, మాకు కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అనేది జరగలేదని అన్నారు.

లాక్డౌన్ సమయంలో దేశంలోని 83 జిల్లాల్లోని 28 వేల కుటుంబాలపై ఐసిఎంఆర్ ఒక సర్వే చేసింది. దీని ప్రకారం ప్రకారం, కరోనా ప్రభావిత జిల్లాల్లోని జనాభాలో 0.73% మాత్రమే వైరస్ బారిన పడ్డారు. అంటే, కరోనా వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో లాక్‌డౌన్ విజయవంతమైందని అన్నారు. కాగా ఈ సర్వే నివేదిక ఏప్రిల్ 30 నాటికి ఉన్న డేటా ఆధారంగా ఉంది.

మరోవైపు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ.. గత ఒక నెలలో కరోనా రికవరీ రేటు 11 శాతానికి పెరిగిందని చెప్పారు. మే 18న 38.29 శాతం ఉంటే.. నేడు ఇది 49.21 శాతానికి పెరిగిందని అన్నారు. ఇప్పటివరకు, 1.41 లక్షలకు పైగా ప్రజలు కరోనా భారిన పడి కోలుకున్నారు. మరణ రేటు 1% తగ్గింది. మే 15 న దేశంలో మరణాల రేటు 3.73 శాతంగా ఉంటే.. ఇప్పుడు అది 2.78% కి తగ్గింది. 

Tags:    

Similar News