కోర్టు ఖర్చుల కోసం భార్య నగలు అమ్ముకున్నా : అనిల్‌ అంబానీ

Anil Ambani To UK Court : కోర్టు ఖర్చుల కోసం తన భార్య నగలు అమ్ముకున్నట్లు అనిల్ అంబానీ చెప్పాడు. మూడు చైనా బ్యాంకుల రుణాల ఎగవేత కేసులో విచారణకు హాజరైన ఆయన.. ఆదాయాలు లేక విలాస జీవితం కాకుండా ఒక సాధారణ మనిషిగా జీవిస్తున్నానని, నా భార్య నగలు అమ్మి మరీ కోర్టు ఖర్చులు భరిస్తున్నానని అన్నారు.

Update: 2020-09-26 12:34 GMT

Anil Ambani

Anil Ambani To UK Court : కోర్టు ఖర్చుల కోసం తన భార్య నగలు అమ్ముకున్నట్లు అనిల్ అంబానీ చెప్పాడు. మూడు చైనా బ్యాంకుల రుణాల ఎగవేత కేసులో విచారణకు హాజరైన ఆయన.. ఆదాయాలు లేక విలాస జీవితం కాకుండా ఒక సాధారణ మనిషిగా జీవిస్తున్నానని, తన భార్య నగలు అమ్మి మరీ కోర్టు ఖర్చులు భరిస్తున్నానని అనిల్ అంబానీ అన్నారు. ఆర్థిక సంక్షోభం కారణంగా రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి 2019, 2020లో తనకి ఎలాంటి ఆదాయం రాలేదని అయన వెల్లడించారు. భారత్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యూకే హైకోర్టు ఎదుట హాజరైన ఆయన ప్రస్తుత తన జీవన శైలి, ఆస్తులు, అప్పుల గురించి కోర్టుకు తెలియజేశారు. తాను సాధారణ జీవితాన్ని గడుపుతున్నానని, కేవలం ఒక కారును నడుపుతున్నానని తన దగ్గర ఏమీ లేదంటూ చేతులెత్తేశారు. తన ఖర్చులను సైతం తన భార్య, ఇతర కుటుంబ సభ్యులు భరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

2020 జనవరి మరియు జూన్ మధ్య చట్టపరమైన ఖర్చుల కోసం తన ఆభరణాలన్నింటినీ విక్రయించానని, దీనికి గాను తనకు రూ .9.9 కోట్లు వచ్చాయని వెల్లడించారు. ప్రస్తుతం తన తల్లికి 500 కోట్ల రూపాయలు, కుమారుడు అన్మోల్‌కు 310 కోట్ల రూపాయలు బాకీ ఉన్నట్టుగా వెల్లడించారు. అలాగే తాను రిలయన్స్‌ ఇన్నోవెంచర్స్‌ కోసం రూ.5 బిలియన్ల రుణం తీసుకున్నానని, ఆ కంపెనీలో ఉన్న 12 మిలియన్ల షేర్లు ఇప్పుడు దేనికి పనికిరావని తెలిపారు. కుటుంబ ట్రస్ట్‌తో సహా, ప్రపంచ వ్యాప్తంగా ఏ ట్రస్ట్‌ వల్ల తాను ప్రయోజనం పొందడం లేదని అనిల్ అంబానీ వివరించారు.

2019-2020లో రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నుండి తనకు ఎటువంటి ప్రొఫెషనల్ ఫీజులు రాలేదని, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి కారణంగా ఈ సంవత్సరం ఏదీ ఆశించలేదని ఆయన అన్నారు. ఇక ఇతర ఆస్తుల గురించి కోర్టు ప్రశ్నించగా "నా ఖర్చులు చాలా తక్కువ మరియు భార్య మరియు కుటుంబ సభ్యులు భరిస్తున్నారు" అని అంబానీ తెలిపారు. ప్రస్తుతం ఒక కారు మాత్రం వాడుతున్నట్టుగా వెల్లడించారు. ముందుముందు మరిన్ని ఖర్చులు ఎదురైతే, ఇతర ఆస్తులకు సంబంధించి కోర్టు ఆమోదానికి లోబడి ఉంటానని అనిల్ అంబానీ వెల్లడించారు. 

Tags:    

Similar News